న్యూ టాటా నెక్సాన్.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా కంటే పవర్‌ఫుల్!

ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో టాటా నెక్సాన్ పాపులర్ మోడల్. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మొట్టమొదటి మోడల్ కూడా ఇదే. టాటా మోటార్స్ తమ పాపులర్ నెక్సాన్ మోడల్‌ను ఇటీవలె ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మార్కెట్లోకి లాంచ్ చేసింది.

న్యూ టాటా నెక్సాన్.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా కంటే పవర్‌ఫుల్!

టాటా మోటార్స్ బీఎస్6 వెర్షన్‌లో లాంచ్ చేసిన నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మునుపటి కంటే మరింత శక్తివంతమైనది. దాయ్ క్రెటా 1.4-లీటర్ డీజల్ వేరియంట్ కంటే మరింత శక్తివంతమైనది.

న్యూ టాటా నెక్సాన్.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా కంటే పవర్‌ఫుల్!

టాటా మోటార్స్ నిశ్శబ్దంగా అప్‌డేట్ చేసిన బీఎస్6 టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 1.2-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ అప్‌డేట్ చేసింది. ఇది సుమారుగా 120బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

న్యూ టాటా నెక్సాన్.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా కంటే పవర్‌ఫుల్!

టాటా నెక్సాన్ మునుపటి వెర్షన్‌లో ఉన్న ఇదే ఇంజన్ 110బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసేది. బీఎస్6 అప్‌డేట్‌తో ఇప్పుడు 10బిహెచ్‌పి ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ క్రెటాలోని 1.4-లీటర్ ప్రొడ్యూస్ చేసే 90బిహెచ్‌పి పవర్ కంటే ఎక్కువే.

న్యూ టాటా నెక్సాన్.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా కంటే పవర్‌ఫుల్!

టాటా నెక్సాన్ డీజల్ వేరియంట్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇందులోని 1.5-లీటర్ బీఎస్6 డీజల్ ఇంజన్ గరిష్టంగా 110బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ బీఎస్6కు సంబంధించి అధికారికంగా ప్రకటించనప్పటికీ, టాటా మోటార్స్ అఫీషియల్ వెబ్‌సైట్లో ఈ వివరాలను అప్‌డేట్ చేసింది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో ఎంచుకోవచ్చు.

న్యూ టాటా నెక్సాన్.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా కంటే పవర్‌ఫుల్!

తాజా అప్‌డేట్‌తో టాటా నెక్సాన్ ఇప్పుడు హ్యుందాయ్ వెన్యూలోని 1.0-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ ఉత్పత్తి చేసే 120బిహెచ్‌పి పవర్‌కు సమానమైన ఇంజన్ పవర్‌నిస్తుంది. టార్క్ (170ఎన్ఎమ్) కూడా రెండింటిలో ఒక్కటే. దీంతో శక్తివంతమైన టుర్భోపెట్రోల్ ఇంజన్ వేరియంట్ల సరసన టాటా నెక్సాన్ చేరిపోయింది.

న్యూ టాటా నెక్సాన్.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా కంటే పవర్‌ఫుల్!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ అప్‌డేట్‌తో రానుంది. ఇది కూడా 110బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్ అతి త్వరలో 130బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ఇచ్చే సరికొత్త T-GDI mStallion ఇంజన్‌తో విడుదల కానుంది.

న్యూ టాటా నెక్సాన్.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా కంటే పవర్‌ఫుల్!

టాటా మోటార్స్ ఈ మధ్యనే విడుదల చేసిన నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి, పగటి పూట వెలిగే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, 16-ఇంచుల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, యూనియన్-జాక్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటివి వచ్చాయి.

న్యూ టాటా నెక్సాన్.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా కంటే పవర్‌ఫుల్!

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యూ ఫ్యాబ్రిక్ సీట్లు, వెహికల్ లొకేషన్ ఫీచర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి లేటెస్ట్ ఫీచర్లను అప్‌డేట్ చేసారు. టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా లాంచ్ చేసింది. దీంతో నెక్సాన్ ఇప్పుడు పెట్రోల్, డీజల్ మరియు ఎలక్ట్రిక్ ఆప్షన్లలో లభిస్తోంది.

Most Read Articles

English summary
Tata Nexon Petrol is now more powerful than the Hyundai Creta
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X