టాటా నెక్సాన్ కారును తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'టాటా నెక్సాన్' మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. టాటా నెక్సాన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. నెక్సాన్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ 1,50,000 వాహనాలను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ పేర్కొంది.

టాటా నెక్సాన్ కారును తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

తాజాగా, టాటా మోటార్స్‌కి చెందిన పూణేలోని రంజాంగవ్ ప్లాంట్‌లో తయారైన 1,50,000వ టాటా నెక్సాన్ కారును కంపెనీ విడుదల చేసింది. కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని తొలిసారిగా 2017లో విడుదల చేసింది. టాటా నెక్సాన్ మొదటి 50,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని సెప్టెంబర్ 2018లో చేరుకుంది.

టాటా నెక్సాన్ కారును తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

ఆ తర్వాత రెండవ 50,000 ఉత్పత్తి మైలురాయి సెప్టెంబర్ 2019లో చేరుకుంది. కాగా, ఈ ఏడాది కోవిడ్-19 మహమ్మారి వలన ఏర్పడి పరిస్థితులు, లాక్‌డౌన్ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, నెక్సాన్ అమ్మకాలు మాత్రం ప్రభావితం కాలేదు. గడచిన అక్టోబర్ నెలలో టాటా నెక్సాన్ ఎస్‌యూవీ అత్యధిక అమ్మకాలను సాధించినట్లు కంపెనీ ప్రకటించింది.

MOST READ:భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 బైక్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

టాటా నెక్సాన్ కారును తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, టాటా మోటార్స్ తమ సోషల్ మీడియాలో #Nexlevel150K అనే కాంపిటీషన్‌ను కూడా ప్రారంభించింది. ఈ పోటీలో వినియోగదారులు తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో తమ ప్రయాణాన్ని, అనుభవాలను పంచుకోవాలని కంపెనీ కోరుతోంది.

టాటా నెక్సాన్ కారును తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

ఇందులోని బెస్ట్ ఎంట్రీ పొందిన వారికి, టాటా నెక్సన్ మోడల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ జట్టు ప్రముఖ బ్యాట్స్‌మాన్ మరియు వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌ను కలిసే అవకాశాన్ని కంపెనీ కల్పించనుంది. అదనంగా, విజేతలకు 1,50,000 రూపాయల నగదు బహుమతి, రాహుల్ సంతకం చేసిన వస్తువులతో పాటు వివిధ రకాల బహుమతి వోచర్లను కంపెనీ అందించనుంది.

MOST READ:మళ్ళీ పుంజుకున్న జావా పెరాక్ బైక్ అమ్మకాలు.. కారణం ఏంటో తెలుసా ?

టాటా నెక్సాన్ కారును తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

ఇక టాటా నెక్సాన్ విషయానికి వస్తే, ఈ కారు మార్కెట్లో మంచి విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. టాటా నెక్సాన్ 2018లో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన సేఫ్టీ అక్రెడిటేషన్ బాడీ అయిన గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో పూర్తి 5 స్టార్ అడల్డ్ సేఫ్టీ రేటింగ్‌ను అందుకున్న మొదటి భారతీయ కారు కావటం విశేషం.

టాటా నెక్సాన్ కారును తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్‌ని మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:లగ్జరీ బైక్ కొన్న సాధారణ యువకుడు.. ఇంతకీ ఎలా కొన్నాడో తెలుసా?

టాటా నెక్సాన్ కారును తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సిక్స్-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీలో ‘ఎకో', ‘సిటీ' మరియు ‘స్పోర్ట్' అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉంటాయి.

టాటా నెక్సాన్ కారును తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్ ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.12.70 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యువి300, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, టయోటా అర్బన్ క్రూయిజర్ మరియు మరికొద్ది రోజుల్లోనే విడుదల కానున్న నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

టాటా నెక్సాన్ కారును తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

టాటా నెక్సాన్ ఉత్పత్తి మైలురాయిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

గ్లోబల్ ఎన్‌సిపి క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ తెచ్చుకున్న టాటా నెక్సాన్, భారత మార్కెట్లో వాహన భద్రత కోసం ఓ సరికొత్త బెంచ్‌మార్క్ కారుగా నిలిచింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటుగా అనేక ఫీచర్లను కూడా కలిగి ఉండి, కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.

Most Read Articles

English summary
Tata Motors rollout of the 1,50,000th Nexon compact-SUV in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X