నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న నెక్సాన్ మరియు ఆల్ట్రోజ్ మోడళ్ల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రెండు మోడళ్లపై వేరియంట్‌ను బట్టి రూ.1,000 నుంచి రూ.16,000 మేర ధరలు పెరిగాయి.

నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

నెక్సాన్, ఆల్ట్రోజ్ రెండు మోడళ్లలోని అన్ని వేరియంట్ల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయి. ఈ రెండు మోడళ్లలో ఎటువంటి మార్పులు చేయబడలేదు, వీటిలో బిఎస్6 అప్‌డేట్ తర్వాత ధరలు పెరగటం ఇదే మొదటిసారి.

నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

తాజాగా పెరిగిన ధరల తర్వాత దేశంలో నెక్సాన్ కాంపాక్ట్-ఎస్‌యూవీ మరియు ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధరలు వరుసగా రూ.5.44 లక్షలు మరియు రూ.6.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ మోడల్‌లో వేరియంట్ల వారీగా పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Altroz Petrol New Price Old Price Difference
XE ₹5,44,000 ₹5,29,000 ₹15,000
XM

₹6,30,000

₹6,15,000 ₹15,000
XT ₹6,99,000 ₹6,84,000 ₹15,000
XZ ₹7,59,000 ₹7,44,000 ₹15,000
XZ(O) ₹7,75,000 ₹7,69,000 ₹6,000
XE Rhythm ₹5,70,000 ₹5,54,000 ₹16,000
XM Style ₹6,64,000 ₹6,49,000 ₹15,000
XM Rhythm ₹6,69,000 ₹6,54,000 ₹15,000
XM R+S ₹6,94,000 ₹6,79,000 ₹15,000
XT Luxe ₹7,38,000 ₹7,23,000 ₹15,000
XZ Urban ₹7,89,000 ₹7,74,000 ₹15,000
Atlroz Diesel New Price Old Price Difference
XE ₹6,99,000 ₹6,99,000 0
XM ₹7,90,000 ₹7,75,000 ₹15,000
XT ₹8,59,000 ₹8,44,000 ₹15,000
XZ ₹9,19,000 ₹9,04,000 ₹15,000
XZ(O) ₹9,35,000 ₹9,29,000 ₹6,000
XE Rhythm ₹7,27,000 ₹7,24,000 ₹3,000
XM Style ₹8,24,000 ₹8,09,000 ₹15,000
XM Rhythm ₹8,29,000 ₹8,14,000 ₹15,000
XM R+S ₹8,54,000 ₹8,39,000 ₹15,000
XT Luxe ₹8,98,000 ₹8,44,000 ₹54,000
XZ Urban ₹9,49,000 ₹9,34,000 ₹15,000

MOST READ:కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

టాటా మోటార్స్ తన 'న్యూ ఫరెవర్' శ్రేణి ప్యాసింజర్ వాహనాల కోసం ధరలను సవరించినట్లు ధృవీకరించింది. ధరల పెంపు వెనుక అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పరిస్థితులు, ఇన్పుట్ వ్యయాలలో మార్పులు మరియు ఇతర ఆర్థిక కారకాలు వంటి అనేక కారణాలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో మరియు ఇన్-హౌస్ స్టైల్ ప్యాకేజీలతో అందిస్తోంది. ఈ ప్యాకేజీలు వ్యక్తిగతీకరణ (కస్టమైజేషన్)లో భాగంగా ఉంటాయి, ఇవి అర్బన్, లక్స్, స్టైల్ మరియు రిథమ్ అనే నాలుగు ఆప్షన్లలో లభిస్తాయి.

MOST READ:డస్టర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ టీజర్ లాంచ్ చేసిన రెనాల్ట్

నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

ఈ హ్యాచ్‌బ్యాక్‌లోని టాప్-ఎండ్ ఎక్స్‌జెడ్ (ఓ) వేరియంట్ మినహా, మిగతా అన్ని వేరియంట్‌ల కస్టమైజేషన్ ప్యాకేజీల ధరలను కూడా రూ.15,000 పెంచారు. అయితే, టాప్-ఎండ్ వేరియంట్ కస్టమైజేషన్ ప్యాకేజీని రూ.6,000 మాత్రమే పెంచారు.

నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

డీజిల్ మోడల్ యొక్క ఎంట్రీ లెవల్ ఎక్స్‌ఈ వేరియంట్ ధరను మాత్రమే పెంచలేదు. అయితే, కస్టమైజ్డ్ ప్యాకేజీతో కొనుగోలు చేసే ఎక్స్‌ఈ రిథమ్ డీజిల్ వేరియంట్ కోసం కస్టమర్లు ఇప్పుడు అదనంగా రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. ఈ కార్ ఒకే ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణిస్తుంది

నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ ఎక్స్‌ఈ బేస్ వేరియంట్ ధర రూ.5.44 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ ఎక్స్‌జెడ్ (ఓ) పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.75 లక్షలుగా ఉంది. అదేవిధంగా, ఆల్ట్రోజ్ డీజిల్ ఎక్స్‌ఈ మరియు ఎక్స్‌జెడ్ (ఓ) వేరియంట్ల ధరలు వరుసగా రూ.6.99 లక్షలు, రూ.9.35 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Nexon Petrol Price
XE ₹6,99,900
XM ₹7,84,500
XMA ₹8,44,500
ZX ₹9,64,500
XZ+ ₹9,84,500
Z+ DT ₹10,24,500
XZA+ DT ₹10,24,500
XZA+ ₹10,44,500
XZ+ (O) ₹10,44,500
XZ+ DT (O) ₹10,54,500
XZA+ (O) ₹10,84,500
XZ+ (S) ₹11,04,500
XZ+ DT (S) ₹11,14,500
XZA+ DT (S) ₹11,34,500
XZA+ (S) ₹10,70,000
Nexon Diesel Price
XE ₹8,45,000
XM ₹9,20,000
XMA ₹9,80,000
ZX ₹10,20,000
XZ+ ₹11,00,000
XZ+ DT ₹11,20,000
XZA+ DT ₹11,80,000
XZA+ ₹11,60,000
XZ+ (O) ₹11,90,000
XZ+ DT (O) ₹12,10,000
XZA+ (O) ₹12,70,000
XZ+ (S) ₹11,60,000
XZ+ DT (S) ₹11,80,000
XZA+ DT (S) ₹12,40,000
XZA+ (S) ₹12,20,000
నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

ఇకపోతే టాటా నెక్సాన్ విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా ఆప్షనల్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా లభిస్తుంది. టాటా నెక్సాన్‌పై కంపెనీ కస్టమైజేషన్ ప్యాక్‌ను అందించకపోయినప్పటికీ, ఇది ఆప్షనల్ డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో లభిస్తుంది.

MOST READ:మన దేశంలో అక్కడ డీజిల్ & పెట్రోల్ కూడా లిమిట్ గానే, ఎక్కడో తెలుసా

నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

ధరల పెరుగుదల తరువాత టాటా నెక్సాన్ పెట్రోల్ ఎక్స్‌ఈ ప్రారంభ ధర రూ.6.69 లక్షలుగా ఉండా, టాప్-ఎండ్ ఎక్స్‌జడ్ఏ ప్లస్ డ్యూయల్ టోన్ (ఎస్) ధర రూ.11.34 లక్షలుగా ఉంది. అదేవిధంగా, ఎస్‌యూవీకి చెందిన డీజిల్ ఎక్స్‌ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.8.45 లక్షలుగా ఉండగా, టాప్-ఎండ్ వేరియంట్ ఎక్స్‌జడ్ఎ ప్లస్ డ్యూయల్ టోన్ (ఓ) ధర రూ.12.7 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

నెక్సాన్, ఆల్ట్రోజ్ ధరలను పెంచిన టాటా మోటార్స్ - ధరల పెంపు వివరాలు

ముందు చెప్పినట్లుగానే, ధరల పెరుగుదల వెంటనే అమలులోకి వస్తుంది మరియు ఇప్పటికే వాహనాలను బుక్ చేసుకున్న కస్టమర్లకు కూడా ఈ ధరల పెంపు వర్తిస్తుంది. అయితే, నెక్సాన్ కోసం కొన్ని డీలర్‌షిప్ కేంద్రాలలో డీలర-స్థాయి క్యూరేటెడ్ ఆఫర్లను అందిస్తున్నారు, ఈ మోడల్‌పై కంపెనీ నుంచి నేరుగా ఎలాంటి ఆఫర్లు లేవు.

టాటా నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్ల ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

నిజానికి టాటా నెక్సాన్, ఆల్ట్రోజ్ మోడళ్లపై టాటా మోటార్స్ నుంచి నేరుగా ఎలాంటి డిస్కౌంట్లు, ఆఫర్లు లేకపోయినప్పటికీ, వీటి అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. వీటి డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకే కంపెనీ ఈ మోడళ్ల ధరలను పెంచినట్లు తెలుస్తోంది. వీటికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, పెరిగిన ధరలు అమ్మకాలపై పెద్ద ప్రభావం చూపబోవని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Tata Motors announced a price increase on the Nexon and the Altorz models in the Indian market. Both models receive a price hike ranging between Rs 1,000 and up to Rs 16,000 depending on the variant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X