Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇప్పుడు రూ. 4.60 లక్షలకే బిఎస్ 6 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ కార్
ఇండియన్ మార్కెట్లో టాటా మోటార్స్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు టాటా మోటార్స్ నుండి టియాగో యొక్క ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దీనిని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

టాటా మోటార్స్ టియాగో యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది కంపెనీ యొక్క అమ్మాకాలో ప్రధానమైన పాత్ర వహిస్తుంది. టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ బిఎస్ 6 వెర్షన్ యొక్క ధర రూ. 4.60 లక్షలు (ఎక్స్‌షోరూమ్).

టియాగో ఫేస్‌లిఫ్ట్ చాలా వరకు నవీనీకరించబడింది. నవీనీ కరించిన తరువాత ఇందులో ఉన్న ఫీచర్స్ ని గమనించినట్లయితే కారు ముందు భాగంలో కొత్త గ్రిల్‌తో పూర్తిగా కొత్త ఫ్రంట్ ఫాసియాను పొందుతుంది. ఇది అప్‌డేట్ చేసిన హెడ్‌లైట్ యూనిట్ల సమితిని కూడా పొందుతుంది. ఇందులో ఉన్న ఎల్ఇడి డిఆర్ఎల్ లను కోల్పోతుంది. ఫ్రంట్ బంపర్‌లో కొత్త ఎయిర్ డ్యామ్‌లతో పాటు సర్కిల్ ఫాగ్ లాంప్స్ ని కూడా కలిగి ఉంటుంది.

కారులో ఒక సైడ్ కి వెళ్లే కొద్దీ అల్లాయ్ వీల్స్, పియానో బ్లాక్ ఫినిష్డ్ ఓఆర్విఎం లు టర్న్ ఇండికేటర్స్ మరియు బ్లాక్-అవుట్ రూఫ్ కోసం కొత్త డిజైన్‌ను పొంది ఉంటుంది. అదేవిధంగా వెనుక వైపున టియాగో నవీకరించబడిన టైల్లైట్ల సమితిని పొందుతుంది. ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు పార్కింగ్ సెన్సార్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి.

కారు యొక్క లోపలి భాగంలో హ్యాచ్‌బ్యాక్‌లో తో పాటు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు హర్మాన్ ఆడియో సిస్టమ్లు ఉన్నాయి. ఎసి వెంట్స్ చుట్టూ నవీకరించబడిన అప్హోల్స్టరీ మరియు బాడీ-కలర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ లో భద్రతకు సంబంధించినంతవరకు చాలా సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే టియాగోలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇబిడి, సీట్-బెల్ట్ రిమైండర్ మరియు హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఫేస్‌లిఫ్టెడ్ టియాగో 1.2-లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. బిఎస్ 4లో ఇంజన్ 84 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. కానీ దీనిని బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీకరించబడిన తర్వాత శక్తి మరియు టార్క్ గణాంకాలు గురించి మనకు ఇంకా తెలియరాలేదు. కాని శక్తి కొద్దిగా పెరుగుతుందని మరియు టార్క్ తగ్గుతుందని ఊహించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
కంపెనీ యొక్క అమ్మకాలలో టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ బిఎస్ 6 మన దేశంలో ప్రధానపాత్ర వహిస్తుంది. టియాగో ని నవీనీకరించిన తరువాత వినియోగదారులను ఎక్కువ ఆకర్షించవచ్చు. ఎందుకంటే నవీనీకరించిన తరువాత వినియోగ దారుణాలకు బిఎస్ 4 వెర్షన్ కంటే కూడా చాల అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఫేస్ లిఫ్ట్ బిఎస్ 6 టియాగో మారుతి సుజుకి సెలెరియో మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 లకు ప్రత్యర్థిగా ఉంటుంది.