Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా టియాగోలో కొత్త ఇంటీరియర్ ఫీచర్లు: ధర, ఇతర వివరాలు
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'టియాగో'లో కంపెనీ సైలెంట్‌గా కొత్తగా ఫీచర్లను జోడించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొత్త టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో డోర్ లాక్ డిజైన్ మరియు డోర్ ట్రిమ్స్ డిజైన్‌ను కొత్తగా అప్‌డేట్ చేశారు.

టీమ్-బిహెచ్‌పి నుండి వచ్చిన చిత్రాల ప్రకారం, టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో కనిపించిన ఓవల్ ఆకారపు ఇంటీరియర్ డోర్ హ్యాండిల్ మరియు స్టిక్ టైప్ డోర్ లాక్‌లను మరింత ప్రీమియం లుకింగ్ యూనిట్‌తో రీప్లేస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఇప్పుడు కొత్త ఎల్ ఆకారపు డోర్ హ్యాండిల్ మరియు హ్యాండిల్ పైన ఉంచిన త్రిభుజాకారపు డోర్ లాక్ ఉంది.

కొత్త టాట టియాగో కారులో లోపలి డోర్ హ్యాండిల్ మరియు లాక్ డిజైన్‌తో పాటుగా కంపెనీ డోర్ ట్రిమ్ డిజైన్‌ను కూడా అప్‌డేట్ చేసింది. మునుపటి ఫ్లాట్ డోర్ ట్రిమ్ స్థానంలో, వాలుగా ఉండే పవర్-విండో స్విచ్ కన్సోల్‌ను అమర్చారు.
MOST READ:కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

కారులో ఎక్కువగా ఉపయోగించే ఫీచర్లలో కారు లోపలి డోర్ హ్యాండిల్స్ మరియు పవర్-విండో స్విచ్‌లు చాలా ప్రధానమైనవి. టియాగో హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్‌లకు కొత్త డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసిన తరువాత, ఇప్పుడు క్యాబిన్ లోపలి భాగం మరింత ప్రీమియంగా, మునుపటి కన్నా కొత్తగా అనిపిస్తుంది. ఈ రెండు మార్పులు మినహా ఇందులో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

టాటా టియాగో ప్రస్తుతం ఆరు వేరియంట్లలో లభిస్తుంది, ఇందులో రెండు ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి. అవి: ఎక్స్ఈ, ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్+, ఎక్స్‌జెడ్ఏ, ఎక్స్‌జెడ్+. మార్కెట్లో ఈ మోడల్ ధరలు రూ.4.7 లక్షల నుండి రూ.6.74 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).
MOST READ:మీరు ఎప్పుడూ చూడని మోడిఫైడ్ సూరజ్ 325 సిసి బైక్

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఇందులోని 1.2-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

టాటా టియాగోలో కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఫోల్డింగ్ వింగ్ మిర్రర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో రోడ్డుపైకి రానున్న కొత్త హోండా హైనెస్ సిబి350 బైక్

ఇంకా ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ (సిఎస్‌సి) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో డీసెంట్ ఫీచర్లు లభిస్తాయి. అయితే, టియాగో మోడల్‌లోని టాప్-ఎండ్ వేరియంట్లలో మరిన్ని అధనపు ఫీచర్లు లభిస్తాయి. ఇందులో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

భారత మార్కెట్లో టాటా టియాగో ఈ విభాగంలో డాట్సన్ గో, హ్యుందాయ్ శాంత్రో, మారుతి సుజుకి సెలెరియో మరియు వ్యాగన్ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. టాటా టియాగో ఇటీవలే తమ ఎక్స్‌టి వేరియంట్ ఫీచర్లను కూడా అప్‌డేట్ చేసింది - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాటా టియాగో ఇంటీరియర్ ఫీచర్ అప్‌గ్రేడ్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టాటా మోటార్స్ ఇటీవలే తమ టియాగో వేరియంట్ లైనప్‌లో సైలెంట్‌గా అప్‌డేట్స్ చేస్తూ వస్తోంది. ఈ అప్‌డేట్స్ చాలా స్వల్పమైనవే అయినప్పటికీ, వీటి కారణంగా కంపెనీ ఈ మోడల్ ధరలను మాత్రం పెంచలేదు. కొత్త అప్‌డేట్స్ మరింత ప్రీమియం అనుభవాన్ని మరియు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.