Just In
Don't Miss
- Finance
కోవిడ్ క్లెయిమ్స్ రూ.9,000 కోట్లు, హెల్త్ పాలసీవే రూ.7,100 కోట్లు
- Movies
పూరి తనయుడి రొమాంటిక్ సినిమా ఆగిపోలేదు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేశారు
- News
IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెట్రోల్, డీజిల్ అవసరం లేని టాటా టిగోర్ - ఫేస్‌లిఫ్ట్ వివరాలు
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ విక్రయిస్తున్న టిగోర్ మోడల్‌లో ఓ కొత్త అప్‌డేటెడ్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, కొత్త టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ స్పై చిత్రాలు, కొన్ని డిజైన్ వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ కొత్త టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన తాజా స్పై చిత్రాలను చూస్తుంటే, భారత్ రోడ్లపై ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న టెస్టింగ్ వాహనాన్ని కంపెనీ పరీక్షిస్తుండటాన్ని గమనించవచ్చు. క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేయటాన్ని చూస్తుంటే, అతి త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌లో షార్ప్ గ్రిల్, కొత్త హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి మార్పులను చూడొచ్చు.

వెనుక భాగంలో, బూట్ లిడ్‌పై ఉన్న స్పాయిలర్, కొత్త షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎలక్ట్రిక్ వాహనాన్ని గుర్తు చేసేలా వెనుక భాగంలో ఉండే బ్లూ కలర్ స్టిక్కర్ వంటి మార్పులు చూడొచ్చు. మొత్తమ్మీద టాటా టిగోర్ ఈవి ఓవరాల్ సిల్హౌహ్ అలానే ఉంచినట్లు అనిపిస్తుంది. ఈ కారు సైడ్ ప్రొఫైల్‌లో చేసిన మార్పులను చిత్రాల్లో స్పష్టంగా తెలియడం లేదు. అయితే, టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌ను అప్‌డేట్ చేసిన డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌తో అందిస్తుందని మేము ఆశిస్తున్నాము.
MOST READ: నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

లోపలి భాగంలో, ఇది కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్, ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు అప్‌డేటెడ్ డ్యూయెల్-టోన్ సీట్ అప్‌హోలెస్ట్రీ వంటి మార్పులు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ నుండి గ్రహించినట్లు అనిపిస్తుంది.

ఇంకా ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు, క్లైమేట్ కంట్రోల్, రిమోట్ లాకింగ్, మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లే, పవర్ విండోస్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఎబిఎస్ అలాగే రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన ఫీచర్లు ఉంటాయి.
MOST READ: టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు, ఎలా ఉన్నాయో చూసారా ?

ఇంజన్ విషయానికి వస్తే, ఫేస్‌లిఫ్టెడ్ టాటా టిగోర్ ఈవిలో ప్రస్తుత మోడల్ మాదిరిగానే 72వి త్రీ-ఫేజ్ ఎసి ఇండక్షన్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 21.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇందులో ఎకో మరియు స్పోర్ట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.

ఈ ఎలక్ట్రిక్ మోటార్ 4500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 40 బిహెచ్‌పి శక్తిని మరియు 2500 ఆర్‌పిఎమ్ వద్ద 105 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వస్తుంది. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 213 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. టాటా టిగోర్ ఈవిలో క్విక్ చార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది, దీని సాయంతో కేవలం 2 గంటల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు. అదే సాధారణ ఛార్జర్‌ను ఉపయోగించడం చార్జ్ చేస్తే పూర్తి ఛార్జ్ కావటానికి 11.5 గంటల సమయం పడుతుంది.
MOST READ: మరోసారి వైరల్ అయిన మహేంద్ర సింగ్ ధోని వీడియో : అదేంటో తెలుసా

ఫేస్ లిఫ్ట్ మోడల్ కూడా ఇదే తరహా పవర్ ఫిగర్స్ మరియు ఛార్జింగ్ టైమ్స్ కలిగి ఉంటుందని అంచనా. అయితే, కొత్త మోడల్‌లో డ్రైవింగ్ రేంజ్ మాత్రం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త టిగోర్ ఈవిలో చేసిన అప్‌డేట్స్ కారణంగా దాని ధరలో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని అంచనా. టాటా మోటార్స్ ప్రస్తుతం ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను రూ.9.54 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విక్రయిస్తోంది.

టాటా మోటార్స్ ఈవి ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టాటా మోటార్స్ తమ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు టాటా టిగోర్ ఈవిని భారత మార్కెట్లో అప్‌డేట్ చేయడాన్ని చూస్తుంటే, దేశీయ మార్కెట్లో వినియోగదారులు క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. మరోవైపు టాటా మోటార్స్ తమ టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేయటాన్ని గమనిస్తే, ఇందులో పెద్దగా డిజైన్ మార్పులు ఏవీ ఉండబోవని తెలుస్తోంది. ఇది ఈ సెగ్మెంట్లో మహీంద్రా ఈ-వెరిటో మోడల్‌కు పోటీగా నిలుస్తుంది.