2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా వింగర్‌

టాటా మోటార్స్ 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా వింగర్ ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ ని ఆవిష్కరించింది. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఈ టాటా వింగర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందా!

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా వింగర్‌

వాణిజ్య వాహనాల తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్ ఇప్పుడు 2020 ఆటో ఎక్స్‌పోలో తన బ్రాండ్ అయిన టాటా వింగర్స్ ని ఆవిష్కరించింది. సాధారణంగా టాటా వింగర్స్ ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ ని 2017 లో ప్రారంభించింది. ఇప్పుడు టాటా మోటార్స్ 2017 లో ఆవిష్కరించిన టాటా వింగర్స్ కంటే మరింత ఎక్కువ ఫీచర్స్ ఎక్కువ సీటింగ్ వ్యవస్థను కలిగి ఉంది. ఇప్పుడు రిలీజ్ చేసిన టాటా వింగర్ ఎస్‌యువిలో 16 సీట్లు ఉన్నాయి. 1 డ్రైవర్ సీట్ మిగిలిన 15 సీట్లు పరయాణికులకోసం. ఇందులో బిఎస్-6 కంప్లైంట్ ఇంజిన్ కూడా ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా వింగర్‌

టాటా వింగర్ ఫేస్‌లిఫ్ట్ ఇంపాక్ట్ ముందు భాగంలో 2.0 డిజైన్ పొంది ఉంటుంది. 2.0 ఇంపాక్ట్ ఆధారంగా రూపొందించినమొత్త మొదటి టాటా కారు హారియర్. వింగర్ పై భాగంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, మధ్యలో టాటా లోగో, పునః రూపకల్పన చేసిన గ్రిల్ మరియు బంపర్ మరియు అప్డేట్ చేసిన హెడ్‌లైట్స్ ఉంటాయి. టాటా వింగర్ లో ప్రధానంగా చేసిన మార్పు బోనెట్. ఇది చూడటానికి వాణిజ్య వ్యాన్ లాగ కాకుండా ప్రయాణికుల ఎస్‌యువి లాగా కనిపిస్తుంది. ఈ మార్పు వల్ల వ్యాన్ మరింత సురక్షితంగా ఉంటుంది. ఇది చూడటానికి కూడా చాల ఆకర్షణీయంగా ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా వింగర్‌

అప్డేట్ చేసిన వింగర్ బ్లూ కలర్ లో ఉంటుంది. వెనుక భాగంలో ఎల్ఇడి టెయిల్ లాంప్లను పొందుతుంది. ఇవే కాకుండా 5- స్పోక్ అల్లాయ్ వీల్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్, కొత్తగా నవీనీకరించిన బ్యాక్ డోర్స్ వంటివి ఇందులో ఉన్నాయి. టాటా వింగర్ యొక్క లోపల భాగంలో డాష్‌బోర్డ్ మరియు కొత్త స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా వింగర్‌

టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫాబ్రిక్ సీట్లు మరియు ఎసి కంట్రోల్ నాబ్స్‌తో సహా వివిధ భాగాలపై సిల్వర్ / పియానో బ్లాక్ ఫినిష్ ఉన్నాయి. ప్రయాణికుల విభాగంలో పెద్దగా మార్పులు ఉండవు. కాకపోతే లగేజ్ ర్యాక్, మల్టిపుల్ యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌లు, వ్యక్తిగత ఎసి వెంట్స్, పుష్ బ్యాక్ సీట్లు మరియు రూప్ యొక్క ఎత్తు కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా వింగర్‌

వింగర్ ఫేస్‌లిఫ్ట్ మునుపటి మాదిరిగానే అదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నందు వల్ల వ్యాన్ యొక్క కొలతలలో పెద్ద తేడా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు టాటా వింగర్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, దాని మోనోకోక్ చట్రం శబ్దం మరియు ప్రకంపనలను తగ్గించడం ద్వారా మంచి రైడ్ నాణ్యతను కలిగి ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా వింగర్‌

టాటా వింగర్ లో చేసిన ఒక పెద్ద మార్పు కొత్త బిఎస్ 6 కంప్లైంట్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్. ఇది 89 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 190 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. మైలేజ్ సుమారు 10 కిలోమీటర్లు ఉంటుందని భావిస్తున్నారు. టాటా వింగర్ యొక్క ధరను గమనిస్తే ఇది దాదాపుగా రూ. 12 లక్షల రూ. 15 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా వింగర్‌

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన టాటా వింగర్ చూడటానికి ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా, మరింత అధునాతన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా తయారు చేయబడింది.

More from DriveSpark

Article Published On: Monday, February 10, 2020, 12:16 [IST]
English summary
Tata Winger gets Harrier inspired front – Debuts at Auto Expo 2020. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+