లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపివేసిన సంగతి తెలిసినదే. ఈ మహమ్మారి వలన మన భారతదేశంలో మార్చ్ 2020 నెల చివరి నుండి జూన్ 2020 నెల మధ్య భాగం వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగింది.

లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

ఈ లాక్‌డౌన్ ఎంతో మందిపై అనేక రకాల ప్రభావాన్ని చూపింది. మఖ్యంగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఈ లాక్‌డౌన్ కారణంగా తీవ్ర నష్టాలను చవిచూసింది. జూన్ నెల మధ్య భాగంలో లాక్‌డౌన్‌ను పాక్షికంగా సడలించినప్పటికీ, ఆ పరిస్థితులను పూర్తిగా కోలుకోవటానికి ఆటోమొబైల్ కంపెనీలకు చాలానే సమయం పట్టింది.

లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను వదిలి వ్యక్తిగత రవాణ వైపు మొగ్గు చూపడంతో, దేశంలో కార్లకు మరియు ద్విచక్ర వాహనాలకు డిమాండ్ జోరందుకుంది. గడచిన జూన్-నవంబర్ 2020 మధ్య కాలంలో ఆటోమొబైల్ ట్రెండ్స్‌ని గమనిస్తే, దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల వివరాలు ఇలా ఉన్నాయి.

MOST READ:కార్ బోనెట్‌పై పడ్డ పోలీస్.. అలాగే డ్రైవ్స్ చేసిన కార్ డ్రైవర్.. చివరికి ఏం జరిగిందంటే ?

లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

జాటో డైనమిక్స్ విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం, మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ జూన్-నవంబర్ 2020 మధ్య కాలంలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

నెలవారీ సగటు అమ్మకాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు. గడచిన ఆరు నెలల్లో, నెలకు సగటున 15,798 మారుతి స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ చాలా కాలంగా ఈ విభాగంలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

MOST READ:ఒక్క ఫోటో ద్వారా లాక్‌డౌన్ ఫీలింగ్స్ పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆ ఫోటో మీరు చూడండి

లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో నెలకు 14,466 యూనిట్లతో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఉండగా, నెలకు 14,461 యూనిట్లతో మారుతి సుజుకి ఆల్టో మూడవ స్థానంలోనూ మరియు నెలకు 14,316 యూనిట్ల సగటు అమ్మకాలతో మారుతి సుజుకి బాలెనో నాల్గవ స్థానంలోనూ ఉన్నాయి. ఈ జాబితాలో మొదటి నాలుగు మోడళ్లు కూడా మారుతి సుజుకివే కావటం విశేషం.

లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

హ్యుందాయ్ క్రెటా ఈ లిస్టులో ఐదవ స్థానంలో ఉంది. కొత్త అవతార్‌లో వచ్చిన 2020 హ్యుందాయ్ క్రెటా కస్టమర్లను ఆకర్షించడంలో విజయవంతమైందనే చెప్పాలి. ఫేస్‌లిఫ్ట్ తర్వాత ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. హ్యుందాయ్ క్రెటా సగటున నెలకు 11,480 యూనిట్లు అమ్ముడుపోయాయి. హ్యుందాయ్ సంస్థ అమ్మకాల వృద్ధికి క్రెటా కీలక పాత్ర పోషించింది.

MOST READ:లగ్జరీ బైక్ కొన్న సాధారణ యువకుడు.. ఇంతకీ ఎలా కొన్నాడో తెలుసా?

లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

మారుతి సుజుకి అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ డిజైర్ ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. సగటున ప్రతి నెలా 11,328 యూనిట్ల స్విఫ్ట్ డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో మారుతి సుజుకి అందిస్తున్న మల్టీ పర్సప్ వాహనం ఈకో 9522 యూనిట్లు సగటు నెలవారీ అమ్మకాలతో కొనసాగుతోంది.

లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సగటున నెలకు 9380 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక కియా మోటార్స్ అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్‌ సగటున 8871 యూనిట్ల నెలవారీ అమ్మకాలతో ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది.

MOST READ:ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా

లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

ఇక చివరి స్థానంలో మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి ఎర్టిగా ఉంది, ఇది సగటున 8067 యూనిట్ల నెలవారీ అమ్మకాలను కలిగి ఉంది. గడచిన 6 నెలల్లో భారత మార్కెట్లో మొత్తంగా చూసుకుంటే 14 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి.

లాక్‌డౌన్ తర్వాత దేశంలో టాప్-10 కార్లు ఇవే..

దేశంలో అమ్ముడైన మొత్తం కార్లలో హ్యాచ్‌బ్యాక్ విభాగం 40 శాతానికి పైగా ఉంది. జూన్ నుండి నవంబర్ 2020 వరకు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో 7 వాహనాలు మారుతి సుజుకి బ్రాండ్‌కు చెందినవే కావటం విశేషం.

Most Read Articles

English summary
Top 10 Best Selling Cars During June - November 2020, Maruti Suzuki Tops With Seven Modeles In The List. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X