ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

భారతదేశంలో 2020 జనవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 వాహనాల జాబితా విడుదలైంది. ఈ టాప్ 10 వాహనాలలో అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్ మారుతి సుజుకి. ఇది టాప్ 10 లో మొదటి 5 స్థానాలను ఆక్రమించింది. ఈ 5 స్థానాలలో కూడా మారుతి డిజైర్ మొదటి స్థానాన్ని పొందింది. 2020 జనవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

మారుతి సుజుకి డిజైర్:

మారుతి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ జనవరి నెలలో దేశంలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. ఈ సెడాన్ జనవరి 2020 లో 22,406 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 17% వృద్ధితో 19,073 యూనిట్లను అధికంగా కలిగి ఉంది. ఇంకా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఒక్క గత నెలలో మాత్రమే కాదు దాదాపు గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెలలోనూ మొదటి 5 స్థానాలలో నిలిచింది. మారుతి డిజైర్ భారత మార్కెట్లో హోండా అమేజ్ మరియు వోక్స్వ్యాగన్ అమియో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

మారుతి సుజుకి బాలెనో:

మారుతి బాలెనో భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆఫర్. ఈ కారు గత నెలలో 20,485 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరం కంటే కూడా 16,717 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి 23% వృద్ధిని సాధించింది. మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, వోక్స్వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది టాప్ 10 జాబితాలో రెండవ స్థానంలో ఉంది.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

మారుతి సుజుకి స్విఫ్ట్:

మారుతి సుజుకి స్విఫ్ట్ జనవరి 2020 లో దాదాపు 19,981 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ప్రస్తుతం మూడవ తరం పునరావృతంలో ఉన్న మారుతి స్విఫ్ట్ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. జనవరి 2019 తో పోలిస్తే, మారుతి స్విఫ్ట్ అమ్మకాలు 18,795 యూనిట్ల అమ్మకాలతో 6% ఎక్కువ వృద్ధిని సాధించింది.

మారుతి సుజుకి కూడా ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించబడిన స్విఫ్ట్ యొక్క హైబ్రిడ్ వెర్షన్‌లో పనిచేస్తుందని, ఈ ఏడాది ఎప్పుడైనా భారతీయ మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి స్విఫ్ట్ టాప్ 10 జాబితాలో 3 వ స్థానానని ఆక్రమించింది.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

మారుతి సుజుకి ఆల్టో:

మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ చాలాకాలంగా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. కానీ హ్యాచ్‌బ్యాక్ వార్షిక అమ్మకాలలో 2019 జనవరిలో 23,360 యూనిట్ల నుండి అంతకుముందు నెలలో 18,914 యూనిట్లకు పడిపోయింది. అమ్మకాలలో 19% తగ్గుదల కనిపించింది. ఇది టాప్ 10 జాబితాలో 4 వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

మారుతి సుజుకి ఇటీవల రాబోయే బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఆల్టోస్ ను అప్‌డేట్ చేసింది. అంతే కాకుండా దీని హ్యాచ్‌బ్యాక్ ధరలను కొద్దిగా పెంచింది. మారుతి ఆల్టో భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ మరియు డాట్సన్ రెడి జిఓలకు ప్రత్యర్థిగా ఉంది.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

మారుతి సుజుకి వాగన్ ఆర్:

మారుతి వాగన్ ఆర్ వార్షిక అమ్మకాల పరంగా భారత మార్కెట్లో ఇప్పుడిప్పుడే కొంతవరకు పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఇది 2019 జనవరి మరియు గత నెల మధ్య 52% వృద్ధిని నమోదు చేసింది. వాగన్ ఆర్ అమ్మకం 2019 జనవరిలో 10,048 యూనిట్ల నుండి అంతకుముందు నెలలో 15,232 యూనిట్లకు పెరిగింది. మారుతి వాగన్ఆర్ దాని టాల్ బాయ్ డిజైన్ కి ప్రసిద్ది చెందింది. 2019 లో కొత్త-తరం హ్యాచ్‌బ్యాక్ పరిచయం డిజైన్ మరియు ఇంటీరియర్ లక్షణాల పరంగా కూడా అనేక నవీకరణలను తీసుకువచ్చింది.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే
ర్యాంక్ మోడల్స్ జనవరి 2020 జనవరి 2019 పెరుగుదల (%)

1 మారుతి సుజుకి డిజైర్ 24,406 19,073 17
2 మారుతి బాలెనొ 20,485 16,717 23
3 మారుతి స్విఫ్ట్ 19,981 18,795 6
4 మారుతి ఆల్టో 18,914 23,360 -19
5 మారుతి వాగన్ ఆర్ 15,232 10,048 52
6 కియా సెల్టోస్ 15,000 - -
7 మారుతి ఇకో 12,324 9,063 36
8 మారుతి వితారా బ్రెజ్జా 10,134 13,172 -23
9 హ్యుందాయ్ ఐ 10 గ్రాండ్ 8,774 10,285 -15
10 హ్యుందాయ్ ఐ 20 ఎలైట్ 8,137 11,749 -31
ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

కియా సెల్టోస్:

కియా సెల్టోస్ 2019 ఆగస్టులో ప్రారంభించబడింది మరియు అప్పటి నుండి భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యువిగా ప్రసిద్ధి చెందింది. సెల్టోస్ స్పోర్టి డిజైన్‌తో, మల్టిపుల్ గేర్‌బాక్స్ ఎంపికలతో బలమైన పనితీరు గల ఇంజన్లు మరియు అధిక ఫీచర్లను కలిగి ఉంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల గత నెలలో వీటి అమ్మకాలు గణనీయంగా పడిపోయినప్పటికీ, 2020 జనవరి నెలలో మాత్రం కంపెనీ 15,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

మారుతి సుజుకి ఇకో:

అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి సుజుకి ఇకో ఏడవ స్థానాన్ని సంపాదించింది. ఈకో మునుపటి నెలలో 12,324 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది 2019 జనవరి నుండి ఇప్పటికి 36% వృద్ధిని సాధించింది. ఇది ప్రస్తుతం 9000 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా:

ఇండియన్ మార్కెట్లో మారుతి విటారా బ్రెజ్జా అమ్మకాలు కొంత కాలంగా తగ్గు ముఖం పట్టాయి. అదే విధంగా జనవరి 2020 లో కూడా మారుతి సుజుకి విటారా బ్రెజ్జా అమ్మకాలలో కంపెనీ 23% క్షీణతను నమోదు చేసింది. కాంపాక్ట్-ఎస్‌యూవీ 2020 జనవరిలో 10,134 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కానీ గత ఏడాది ఇదే నెలలో దాదాపు 13,172 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10:

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 టాప్ -10 అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. గ్రాండ్ ఐ 10 హ్యాచ్‌బ్యాక్ గత నెలలో 8774 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కానీ 2019 జనవరిలో 10,285 యూనిట్లు మాత్రమే అమ్మకాలను కలిగి ఉంది. దీని వార్షిక అమ్మకాలు గత సంవత్సరం కంటే కూడా 15% క్షీణతని కలిగి ఉంటుంది. కానీ గత నెలలో భారత మార్కెట్లో కొరియా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20:

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 అమ్మకాలు గత రెండు నెలల్లో బాగా తగ్గాయి. కొరియన్ బ్రాండ్ నుండి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆఫర్ గత నెలలో 8,137 యూనిట్ల అమ్మకాలను సాధించింది. వార్షిక అమ్మకాలు గత ఏడాదికంటే 31% క్షీణతను నమోదు చేసింది.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన టాప్ 10 కార్లు ఇవే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సాధారణంగా అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 వాహనాల జాబితా ప్రతి నెల కొంత తారుమారుగా ఉంటుంది. అంటే వాటి అమ్మకాలలో కొంత తేడా ఉంటుంది. జనవరి 2020 టాప్-10 జాబితాలో మారుతి సుజుకి డిజైర్ అత్యధిక అమ్మకాలను జరిపి ఇండియన్ మార్కెట్లో సంచలనం సృష్టించింది.

ఇండియన్ మార్కెట్లో కియా సెల్టోస్ భారీగా పడిపోయిన తరువాత మళ్ళీ టాప్-10 జాబితాలో చేరటం కొంత ఆనదించాల్సిన విషయం. 2020 ఆటో ఎక్స్‌పో జరగడంతో భవిష్యత్ లో చాలా బ్రాండ్ల నుంచి మరిన్ని కొత్త వాహనాలు మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ విధంగా కొత్త వాహనాలు రావడం వాళ్ళ వాహనాల యొక్క అమ్మకాలు మరింత తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది.

Source: Autopunditz

Most Read Articles

English summary
Top-Selling Cars In India For January 2020: Kia Seltos Regains Best-Selling SUV Title. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X