ఇండియాలో 5 అత్యంత చీప్ & బెస్ట్ బిఎస్ 6 కార్లు
భారత ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ప్రకారం 2020 ఏప్రిల్ 01 నుంచి బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించాలి. ఈ కారణంగా చాల కంపెనీలు తమ వాహనాలను నిర్దిష్ట గడువుకు ముందే బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించారు. బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించని వాహనాలను దేశీయ మార్కెట్లో నిలిపివేశారు. ఇక్కడ బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించిన వాహనాలు ఉన్నాయి. భారతదేశంలో వినియోగదారులు కొనడానికి మరియు అత్యంత సరసమైన ధరకు లభించే బెస్ట్ 5 కార్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

మారుతి ఆల్టో :
భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెందిన కార్లలో మారుతి ఆల్టో ఒకటి. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 2.94 నుంచి 4. 36 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

మారుతి ఆల్టో ప్రస్తుతం తన కంపెనీ లైనప్‌లో వున్న అత్యంత సరసమైన కారు. ఆల్టో ఇప్పుడు 796 సిసి ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులకు చాలా నమ్మికైనదిగా ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మారుతి ఎస్-ప్రెస్సో :
దేశీయ మార్కెట్లో మారుతి ఎస్-ప్రెస్సో ధర రూ. 3.7 నుంచి 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.0-లీటర్ కె-సిరీస్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభిస్తుంది. అంతే కాకుండా ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఎఎంటి గేర్ బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

మారుతి ఎస్-ప్రెస్సో సంస్థ యొక్క హ్యాచ్ బ్యాక్ కె ప్లాట్‌ఫామ్ మీద ఆధారపది ఉంటుంది. ఎస్-ప్రెస్సో మంచి డైనమిక్స్, బలమైన మోటారు మరియు తగినంత విశాలమైన క్యాబిన్‌తో పాటు ఎస్‌యూవీ-ప్రేరేపిత స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది మంచి డిజైన్ ని కలిగి ఉంటుంది.

రెనాల్ట్ క్విడ్ :
భారతదేశంలో అమ్మకాల పరంగా మంచి డిమాండ్ ఉన్న వాహనం ఈ రెనాల్ట్ క్విడ్. ఆల్టో ఇప్పుడు దేశీయ మార్కెట్లో 0.8-లీటర్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుండగా, క్విడ్ 0.8-లీటర్ మరియు 1.0-లీటర్ వేరియంట్లలో అమ్మకం కొనసాగుతోంది.

ఈ కారు ధర రూ. 2.92 నుండి రూ. 5.01 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. రెనాల్ట్ క్విడ్ ఎస్‌యువి మంచి స్టైలింగ్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా రూమి క్యాబిన్ మరియు సులభమైన నిర్వహణతో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా నవీనీకరించబడి ఉంటుంది.

మారుతి సెలెరియో :
ఈ జాబితాలో తదుపరి మోడల్ మారుతి సెలెరియో. ఇది బి 1-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్. అంతే కాకుండా ఇది మార్కెట్లో AMT ఎంపికను అందించిన మొట్టమొదటి మారుతి కారుగా నిలిచింది. అయితే ఇప్పుడు సెలెరియో తన కెరీర్ యొక్క చివరి దశలో ఉంది మరియు ఒక సంవత్సరంలో ఒక సరికొత్త మోడల్ ద్వారా భర్తీ చేయబడుతుంది.

మారుతి సెలెరియో ప్రస్తుత ధర రూ. 4.41 నుంచి రూ. 5.58 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మంచి క్యాబిన్ ని కలిగి ఉంటుంది. బలమైన 1.0-లీటర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మంచి మైలేజ్ ని కూడా అందిస్తుంది.

హ్యుందాయ్ సాంట్రో :
హ్యుందాయ్ సాంట్రో ధర ప్రస్తుతం భారతదేశంలో రూ. 4.57 నుంచి రూ. 6.2 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. టాల్‌బాయ్ యొక్క తాజా సంస్కరణ దాని పూర్వీకుల వలె అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ, ఇది ఇప్పటికీ దాని రూమి క్యాబిన్, చక్కగా క్రమబద్ధీకరించబడిన అప్సనల్ AMT, తగినంత శక్తివంతమైన 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు సులభమైన నిర్వహణతో ఆకట్టుకుంటుంది. హ్యుందాయ్ సాంట్రో ఇక్కడ ఉన్న జాబితాలో అత్యంత ఖరీదైన కారు.


Click it and Unblock the Notifications








