అంబానీ యొక్క 5 లేటెస్ట్ కార్స్, వాటి వీడియోస్ చూసారా..!

ఆసియా ఖండంలో ఉన్న ధనవంతులలో ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త అయిన ముఖేష్ అంబానీ ఒకరు. ఇంతటి ప్రసిద్ధి చెందిన ముఖేశ్ అంబానీ తన కుటుంబంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ముఖేష్ అంబానీ గురించి మరిన్ని ఇంట్రస్టిగ్ విషయాలు ఇప్పుడు మీకోసం..

అంబానీ యొక్క 5 లేటెస్ట్ కార్స్, వాటి వీడియోస్ చూసారా..!

రిలయన్స్ గ్రూప్ అఫ్ కంపెనీ అధినేత అయినా ముఖేష్ అంబానీ భారతదేశంలో పేరు మోసిన వ్యాపార వేత్త. ఇతడు ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. అంబానీ భారతదేశంలో అత్యంత ఖరీదైన ఒక గృహాన్ని కలిగి ఉన్నారు. అంతే కాకుండా విలాసవంతమైన మరియు అత్యంత ఖరీదైన వాహనాలను కూడా ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.

అంబానీ యొక్క 5 లేటెస్ట్ కార్స్, వాటి వీడియోస్ చూసారా..!

అంబానీ యొక్క గ్యారేజ్ లో మన దేశానికి సంబందించినవి మాత్రమే కాకుండా ఇతర దేశాలలకు చెందిన అత్యంత ఖరీదైన వాహనాలు ఉన్నాయి. ఈ ఖరీదైన వాహనాలలో జి-వాగెన్ నుండి టెస్లా వరకు ఉన్నాయి. అంబానీ కుటుంబానికి చెందిన కార్లు ముంబై రోడ్లలో కనిపించిన వీడియోస్ మనం ఇక్కడ చూడవచ్చు. అంబానీ కుటుంబం చాల విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ 5 లేటెస్ట్ కార్లు వాటి వీడియోస్ ఉన్నాయి.

అంబానీ యొక్క 5 లేటెస్ట్ కార్స్, వాటి వీడియోస్ చూసారా..!

బెంట్లీ బెంటాయ్గా వి 8

అంబానీ ఫ్యామిలీ ఉపయోగించే వాహనాలలో బెంట్లీ బెంటాయ్గా వి 8 ఒకటి. ఇది అంబానీ గ్యారేజ్ లో ఉన్న రెండవ బెంట్లీ బెంటాయ్గా. దీని ధర సుమారు రూ. 4 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కార్ని అంబానీ కుమారులలో ఒకరు ఉపయోగించినట్లు తెలిసింది.

భద్రతా లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ కారు ముంబై రోడ్లపై చాల సార్లు కనిపించింది. ఇది 4.0 లీటర్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 542 బిహెచ్‌పి శక్తిని మరియు 770 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అంబానీ యొక్క 5 లేటెస్ట్ కార్స్, వాటి వీడియోస్ చూసారా..!

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB

అంబానీ ఫ్యామిలీ గత సంవత్సరం రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఇడబ్ల్యుబి ని కొనుగోలు చేసింది. ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఇడబ్ల్యుబి కారు ఇతని గ్యారేజ్ లో ఉన్న అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్. ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఇడబ్ల్యుబి ధర రూ. 13.5 కోట్లు (ఆన్ రోడ్). ఇటీవల కాలంలో ఈ కారు ముంబై రోడ్లలో కనిపించింది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఇడబ్ల్యుబి కారు 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి12 ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 563 బిహెచ్‌పి మరియు 900 ఎన్‌ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ శాటిలైట్ అటాచ్డ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ని కలిగి ఉంటుంది. ఇది అత్యంత వేగంగా ప్రయాణించే వాహనాలలో ఒకటి.

అంబానీ యొక్క 5 లేటెస్ట్ కార్స్, వాటి వీడియోస్ చూసారా..!

రోల్స్ రాయిస్ కల్లినన్

భరతదేశంలో కల్లినన్ కారును డెలివరీ చేసుకున్న మొదటి వారు అంబానీ కుటుంబమే. బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ నుండి వచ్చిన మొదటి ఎస్‌యువి ప్రస్తుతం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో ఉన్న అనేక ప్రముఖుల చెంతకు వెళ్తోంది. కల్లినన్ ఎస్‌యువిలో అంబానీ చాలాసార్లు గుర్తించబడ్డారు.

రోల్స్ రాయిస్ కల్లినన్ 6.75-లీటర్ వి 12 పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది గరిష్టంగా 563 బిహెచ్‌పి మరియు 850 ఎన్ఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

అంబానీ యొక్క 5 లేటెస్ట్ కార్స్, వాటి వీడియోస్ చూసారా..!

మెర్సిడెస్-ఎఎమ్‌జి జి 63

అంబానీ కుటుంబం ఇటీవల భారతదేశంలో రెండవ మెర్సిడెస్-ఎఎమ్‌జి జి 63 యొక్క డెలివరీని అందుకుంది. దీని ధర రూ. 2.2 కోట్లు (ఎక్స్‌ షోరూమ్). కానీ ఆన్ రోడ్ ప్రైస్ మాత్రం దాదాపు రూ. 3 కోట్లకి దగ్గరగా ఉంది.

ఇది పూర్తి-ఎల్‌ఈడీ సెటప్‌ను పొందుతుంది కాని బోనెట్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్లను కలిగి ఉంటుంది. ఈ వాహనం టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్‌ను పొందుతుంది అంటే కాకుండా 21-అంగుళాల 7 స్పోక్ అల్లాయ్ వీల్‌లపై నడుస్తుంది.

అంబానీ యొక్క 5 లేటెస్ట్ కార్స్, వాటి వీడియోస్ చూసారా..!

మెర్సిడెస్-ఎఎమ్‌జి జి 63 కారు 4.0-లీటర్ బై-టర్బోచార్జ్డ్ వి 8 పెట్రోల్ ఇంజన్ ని కలిగి ఉంటుంది. ఇది 585 బిహెచ్‌పి మరియు 850 ఎన్‌ఎమ్‌ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

అంబానీ యొక్క 5 లేటెస్ట్ కార్స్, వాటి వీడియోస్ చూసారా..!

టెస్లా మోడల్ ఎస్ 100 డి

ప్రపంచంలో అత్యంత లగ్జరీ కారుగా పేరుపొందిన టెస్లా మోడల్ ఎస్ 100 డి భారతదేశంలో ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు. కానీ అంబానీ కుటుంబం గత సంవత్సరమే ఈ వాహనాన్ని డెలివరీ చేసుకుంది. టెస్లా మోడల్ ఎస్ 100 డి చాలా శక్తివంతమైన చక్రాల సమితిని కలిగి ఉంటుంది. ఈ వాహనానికి శక్తినిచ్చే ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 423 పిఎస్ శక్తిని మరియు 660 ఎన్ఎమ్ భారీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

ఇది అత్యంత వేగంగా ప్రయాణించే వాహనాలలో ఒకటి. మోడల్స్ ఎస్ 100 డి ఎలక్ట్రానిక్ పరిమిత టాప్స్-స్పీడ్‌ను గంటకు 250 కిమీ వేగంతో చేరుకోగలదు. అయితే ఇది ఒకే పూర్తి ఛార్జీలో గరిష్టంగా 495 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 18, 2020, 10:42 [IST]
English summary
5 of Ambani’s latest cars on video: From G-Wagen to Tesla. Read in telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+