Just In
- 35 min ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 1 hr ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
- 1 hr ago
చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!
- 2 hrs ago
మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు
Don't Miss
- Movies
Vakeelsaab 10 days collections:సెకండ్ వీకెండ్లో ఊహించని కలెక్షన్స్..వాళ్లకు ప్రత్యేక షోలు..ఇంకా ఎంత రావాలంటే?
- Sports
'తొలి టెస్టు అనంతరం జట్టులో చోటు దక్కక పోవడం బాధించింది.. నా టెక్నిక్ గురించి కలత చెందా'
- News
కరోనా ఎఫెక్ట్ ... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన వాయిదా
- Lifestyle
ఇలా చేస్తే బలహీనమైన జుట్టు సహజంగా బలపడుతుంది..కొత్త జుట్టు వస్తుంది..
- Finance
పెద్ద బ్యాంకుల కంటే బెట్టర్! సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ రేట్లు ఇలా
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో బెస్ట్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టాప్-5 సేఫెస్ట్ కార్స్ ఇవే..
ఇటీవలి కాలంలో కార్ల కొనుగోలుదారులు అప్‌గ్రేడెడ్ టెక్నాలజీ మరియు అధునాతన సేఫ్టీ ఫీచర్లు కలిగిన వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో సురక్షిత కార్లకు డిమాండ్ జోరందుకుంది. మరోవైపు కార్ల తయారీదారులు కూడా సేఫ్టీ పరంగా సురక్షితమైన కార్లను అందించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ కథనంలో ప్రస్తుతం దేశంలో లభిస్తున్న టాప్-5 సేఫ్ కార్ల గురించి తెలుసుకుందాం రండి.

1. మహీంద్రా ఎక్స్‌యూవీ 300
సేఫ్టీ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన మొదటి వాహనం మహీంద్రా ఎక్స్‌యూవీ 300. ఈ కారులో పిల్లల సేఫ్టీ కోసం 4 స్టార్ రేటింగ్ దక్కించుకుంది. ఇందులోని 2 ఎయిర్‌బ్యాగ్ వేరియంట్ 5 స్టార్ రేటింగ్ పొందింది. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్‌లో 7 ఎయిర్‌బ్యాగులు లభిస్తాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 300లో 7 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎబిఎస్ విత్ ఇబిడి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఐఎస్ఓఫిక్స్ మౌంట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, హీటెడ్ సైడ్ మిర్రర్స్, అన్ని చక్రాలపై 4 డిస్క్ బ్రేకులు, రియర్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:వరదనీటిలో చేపలా ఈదుతున్న లంబోర్ఘిని సూపర్ కార్ [వీడియో]

2. టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా కారు. టాటా నెక్సాన్ ఈ సేఫ్టీ టెస్టులో 17 పాయింట్లకు గానూ గరిష్టంగా 16.06 పాయింట్లను సాధించి, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ కారులో పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 25 పాయింట్లు లభించాయి, ఈ విషయంలో ఇది 4 స్టార్ రేటింగ్‌ను పొందింది.

టాటా నెక్సాన్ కారులో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎబిఎస్ విత్ ఇబిడి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఐఎస్ఓఫిక్స్ మౌంట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, బ్రేక్ డిస్క్ వైపింగ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న పెంపుడు కుక్క [వీడియో]

3. టాటా అల్ట్రోజ్
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ కూడా సేఫ్టీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. దీంతో ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. ఈ టెస్టులో వయోజన రక్షణలో దీనికి ఐదు స్టార్లకు గానూ మొత్తం ఐదు స్టార్లు లభించాయి. పిల్లల సేఫ్టీలో ఇది 3 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది.

టాటా అల్ట్రోస్‌లోని భద్రతా ఫీచర్లను గమనిస్తే, ఇందులో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఐఎస్ఓఫిక్స్ మౌంట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్, వాయిస్ అలర్ట్, ఎత్తు సర్దుబాటు చేయగల సీట్ బెల్ట్, ఫాగ్ ల్యాంప్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:భారీస్థాయిలో వాహన రద్దీ ఏర్పడటానికి కారణం ఇదే

4. మహీంద్రా థార్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కొత్తం2020 మహీంద్రా థార్ అడల్ట్ సేఫ్టీలో ఈ ఎస్‌యూవీకి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కగా, పిల్ల సేఫ్టీ విషయంలో కూడా 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ విభాగంలో ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన వాహనంగా మారింది.

కొత్త 2020 మహీంద్రా థార్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, రియర్ పార్కింగ్ అసిస్ట్ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ 300 కాంపాక్ట్ ఎస్‌యూవీ తర్వాత క్రాష్ టెస్టులో బెస్ట్ రిజల్ట్స్ పొందిన రెండవ మహీంద్రా మోడల్ ఇది.
MOST READ:నుజ్జు నుజ్జయిన 25 కోట్ల విలువైన పగని కార్.. ఎలాగో తెలుసా

5. టాటా టియాగో / టిగోర్
టాటా మోటార్స్ అందిస్తున్న టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు టిగోర్ కాంపాక్ట్ సెడాన్లను ఈ క్రాష్ టెస్టుల్లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. ఈ రెండు మోడళ్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లకు కంపెనీ ఇటీవలే క్రాష్ టెస్టు నిర్వహించింది. ఈ టెస్టులో ఇవి వయోజన రక్షణ కోసం 4 స్టార్ మరియు పిల్లల భద్రత కోసం 3 స్టార్ రేటింగ్‌ను పొందాయి.

టాటా టియాగో మరియు టాటా టిగోర్ కార్లలో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్, కెమెరాతో, ఫాలో మి హోమ్ లాంప్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాకింగ్, రియర్ వాష్ వైపర్ (టియాగో), డీఫాగర్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.