2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

ఎట్టకేలకు 2020 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొన్ని ముఖ్యమైన కార్ల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

2020 ఫిబ్రవరి నెలలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోతో భారత ఆటో పరిశ్రమ ఒక మెరుపు మెరిసింది. ఎందుకంటే 2020 ఆటో ఎక్స్‌పోలో అనేక కొత్త వాహనాలు పరిచయం చేయబడ్డాయి. 2020 ఆటో ఎక్స్‌పో తరువాత మార్చి మరియు జూన్ 2020 మధ్య అధికంగా విజృంభించడం వాళ్ళ కరోనా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ లాక్ డౌన్ కారణంగా ఆటో పరిశ్రమ చాలా నష్టాలను చవిచూసింది.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

కరోనా లాక్ డౌన్ ఇటీవల కాలంలో కొన్ని షరతులతో ముగియడంతో ఆటో పరిశ్రమలో పూర్వ వైభవం తీసుకురావడానికి చాలా వరకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత ఆటో పరిశ్రమ నెలవారీగా గణనీయమైన రికవరీని సాధించగలిగింది. ఆటో పరిశ్రమలో దాదాపు అన్ని విభాగాలలో అనేక కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా ఈ గణనీయమైన అమ్మకాలను సాధించడం జరిగింది.

2020 లో భారత మార్కెట్లో అడుగు పెట్టిన టాప్ 10 కార్లను గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం, రండి.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

కియా సోనెట్ :

సోత్ కొరియా బ్రాండ్ అయిన కియా మోటార్స్ నుండి భారత మార్కెట్లో అడుగుపెట్టిన మూడవ మోడల్ ఈ కియా సోనెట్. సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో ఉంది. కియా సోనెట్ రూ. 6.71 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) అందించబడుతుంది. కియా సోనెట్ బ్రాండ్ యొక్క సెల్టోస్ ఎస్‌యూవీకి దిగువన ఉంది. అంతే కాకుండా దాని మునుపటి మోడల్స్ లాగా దేశీయ మార్కెట్లో ప్రజాదరణ పొందింది.

MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

కియా సోనెట్ మూడు ఇంజన్ ఎంపికలతో పనిచేస్తుంది. ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్, వీటిలో 1.0-లీటర్ టి-జిడి పెట్రోల్ యూనిట్ ఉంటుంది. మూడు ఇంజిన్ ఆప్షన్లు అనేక ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందించబడతాయి.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

నిస్సాన్ మ్యాగ్నైట్ :

నిస్సాన్ మ్యాగ్నైట్ భారత మార్కెట్లో అడుగుపెట్టిన మరో కాంపాక్ట్-ఎస్‌యూవీ ఆఫర్. ఈ నెల ప్రారంభంలో నిస్సాన్ మ్యాగ్నైట్ భారతదేశంలో అడుగుపెట్టింది. దీని ధర రూ. 4.99 లక్షలతో (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభమవుతుంది. ఇది విభాగంలో తన ప్రత్యర్థులతో పోటీపడటానికి సహాయపడుతుంది.

MOST READ:రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

నిస్సాన్ మ్యాగ్నైట్ అద్భుతమైన ఫీచర్లు, పరికరాలతో పాటు అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, ఇది శక్తివంతమైన ఇంజిన్ ని కూడా కలిగి ఉంది. నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో పనిచేస్తుంది, వీటిలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ 20 :

కొత్త హ్యుందాయ్ ఐ 20 నవంబర్ 2020 లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. హ్యుందాయ్ నుండి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆఫర్ ఇప్పుడు మూడవ తరం పునరావృతంలో ఉంది మరియు పూర్తిగా పునరుద్ధరించిన డిజైన్ మరియు స్టైలింగ్‌తో వస్తుంది. కొత్త హ్యుందాయ్ ఐ 20 ఇప్పుడు మరింత స్పోర్టిగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇది పవర్ పుల్ ఇంజిన్ ఎంపికలను కొద కలిగి ఉంది. ఆధునిక కాలంలో ఉన్న వాహనదారులకు సరిపోయే విధంగా దీనిని తయారుచేశారు.

MOST READ:డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

కొత్త హ్యుందాయ్ ఐ 20 ఇప్పటికే భారత మార్కెట్లో మంచి డిమాండ్‌ను సాధించింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ధర 6.80 లక్షలు, (ఎక్స్‌షోరూమ్, ఇండియా) తో ప్రారంభమవుతుంది. ఇది మూడు ఇంజిన్ ఎంపికలతో పనిచేస్తుంది. వీటిలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి జతచేయబడుతుంది.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

మహీంద్రా థార్ :

భారతీయ మార్కెట్లో మహీంద్రా థార్ మంచి ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ. కొత్త మహీంద్రా థార్ దాని మునుపటి వెర్షన్ నుంచి దాదాపు అన్ని అంశాలతో ముందుకు వెళ్తుంది. కానీ ఇప్పుడు ఇది పూర్తిగా భిన్నంగా ప్యాక్ చేయబడింది. కొత్త థార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల ద్వారా శక్తిని పొందుతున్నప్పుడు మునుపటి కంటే చాలా లేటెస్ట్ గా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఇప్పుడు అత్యంత ఖరీదైనది కూడా.

MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

కొత్త మహీంద్రా థార్ ప్రారంభ ధర రూ. 11 లక్షలు, ఎక్స్-షోరూమ్‌తో అందించబడుతుంది. ఎస్‌యూవీ ఇప్పటికే చాలా డిమాండ్‌ను సంపాదించగలిగింది, కొత్త థార్ కోసం వెయిటింగ్ పీరియడ్ దేశవ్యాప్తంగా 6 నెలలకంటే ఎక్కువగా ఉంది.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

న్యూ హ్యుందాయ్ క్రెటా :

2020 మార్చిలో కరోనా లాక్ డౌన్ ప్రకటించకముందే ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా అమ్మకానికి వచ్చింది. అయినప్పటికీ హ్యుందాయ్ క్రెటా దేశీయ మార్కెట్లో త్వరగా మరియు అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హ్యుందాయ్ క్రెటా పూర్తిగా కొత్త డిజైన్‌తో వస్తుంది.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క ప్రారంభ ధర రూ. 10 లక్షల లోపు ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా డిజైన్ అప్‌డేట్ అవ్వడం మాత్రమే కాకుండా, ఇంటీరియర్స్ కూడా పూర్తిగా పునరుద్ధరించబడ్డాయి.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

న్యూ హోండా సిటీ :

న్యూ హోండా సిటీ ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త తరం హోండా సిటీ ప్రస్తుతం దాని పాత తరం వెర్షన్‌తో పాటు అమ్ముడవుతోంది. అయితే ఈ కోట వెర్షన్ లో గణనీయమైన డిజైన్ మార్పులు జరిగాయి, అంతే కాకుండా ఈ సెడాన్ యొక్క కొలతలు కూడా పెరిగాయి.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

కొత్త హోండా సిటీ దాని మునుపటి మోడల్‌తో పోలిస్తే ప్రీమియం ధరను కలిగి ఉంది. కొత్త సిటీ సెడాన్ ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఇండియా). కొత్త హోండా సిటీ ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్-శక్తితో కూడిన వేరియంట్లలో లభిస్తుంది.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

కియా కార్నివాల్ :

కియా మోటార్స్ 2020 ఆటో ఎక్స్‌పోలో తన కార్నివాల్ ఎమ్‌పివిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కియా కార్నివాల్ బ్రాండ్ నుండి వచ్చిన ప్రీమియం ఎంపివి ఆఫర్, దీని ధర రూ 5 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఇండియా).

కియా కార్నివాల్ అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉంటుంది ఇందులో ఎలక్ట్రానిక్ అసిస్ట్‌లు, ఇంటీరియర్‌లపై ప్రీమియం అప్హోల్స్టరీ మరియు బలమైన పనితీరు గల టర్బో-డీజిల్ ఇంజిన్‌తో నిండి ఉంది. భారత మార్కెట్లో కియా కార్నివాల్, టయోటా ఇన్నోవా క్రిస్టాకు ప్రత్యర్థిగా ఉంటుంది.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

ఎంజి గ్లోస్టర్ :

బ్రిటీష్ కార్ బ్రాండ్ అయిన ఎంజి మోటార్స్ కంపెనీ యొక్క ఎంజి గ్లోస్టర్ భారత మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ వెర్షన్. గ్లోస్టర్ ఎస్‌యూవీ ఎంజి మోటార్ ఇండియా యొక్క ప్రధాన మోడల్. ఇది పుల్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఉంది. గ్లోస్టర్ సింగిల్ లేదా డ్యూయెల్-టర్బో సెటప్‌తో డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది భారీగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి రహదారి ఉనికిని కూడా అందిస్తుంది.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

ఎంజి గ్లోస్టర్ ‘అటానమస్ లెవల్ 1' పార్క్ అసిస్ట్‌ను కలిగి ఉన్న దేశం యొక్క మొట్టమొదటి ప్రీమియం ఎస్‌యూవీగా పరిగణించబడింది. గ్లోస్టర్ ఎస్‌యూవీ యొక్క ప్రారంభ ధర రూ. 29 లక్షలతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) లభిస్తుంది.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

ల్యాండ్ రోవర్ డిఫెండర్ :

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలో ప్రారంభించబడింది. డిఫెండర్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. ల్యాండ్ రోవర్ డిఫెండర్ రెండు బాడీ స్టైల్ తో అందించబడుతుంది. అవి 90 (3-డోర్) మరియు 110 (5-డోర్). ఈ రెండూ భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధరలు రూ. 73 లక్షల నుండి ప్రారంభమై, రేంజ్-టాపింగ్ 110 ఫస్ట్ ఎడిషన్ వేరియంట్ ధర రూ. 89 లక్షల వరకు ఉంటుంది. భారతదేశంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ మరియు జీప్ రాంగ్లర్ రూబికాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి :

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి అనేది బెంజ్ యొక్క మొట్టమొదటి పుల్ ఎలక్ట్రిక్ వెర్షన్ కారు. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ధర రూ. 90 లక్షలతో (ఎక్స్-షోరూమ్,ఇండియా) వస్తుంది. ఈ విభాగంలో ప్రస్తుతం ఇక్యూసి కి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు. కానీ ఇది ఆడి ఇ-ట్రోన్ మరియు జాగ్వార్ ఐ-పేస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Top-10 Car Launches In India In 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X