2019 డిసెంబర్ జాబితా ప్రకారం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి లు ఇవే!

భారతదేశం వాహనరంగంలో పరుగులు తీస్తుంది. రోజు రోజుకి కొత్త వాహనాలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ఈ విధంగా విడుదలైన వాహనాలలో ఎక్కువ ప్రజాదరణపొందుతున్న వాహనాలు, ఎక్కువగా అమ్ముడవుతున్న వాహనాలు ఏవి అని తెలుసుకోవడానికి ఒక జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ జాబితా గురించి మరింత తెలుసుకుందాం!

2019 డిసెంబర్ జాబితా ప్రకారం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి లు ఇవే!

2019 డిసెంబర్ నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి కోసం విడుదల చేసిన జాబితా ప్రకారం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎమ్‌పివిగా మారుతి ఎర్టిగా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. అమ్మకాల పరంగా చూసినట్లయితే టయోటా ఇన్నోవా క్రిస్టాను అధిగమించి రెనాల్ట్ ట్రైబర్ మూడవ స్థానానికి చేరుకుంది.

2019 డిసెంబర్ జాబితా ప్రకారం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి లు ఇవే!

మారుతి ఎర్టిగా మరో నెల పాటు ఈ ఎంపివి విభాగంలో టాప్ -10 లో ముందంజలో ఉండబోతోంది. ఎర్టిగా ఎంపివి 2019 డిసెంబర్ నెలలో 6,650 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది తన ప్రత్యర్థుల కంటే బాగానే అమ్మకాలను జరిపింది. అయితే 2018 డిసెంబర్ తో పోలిస్తే అమ్మకాలలో 7% క్షీణత కనిపిస్తుంది.

2019 డిసెంబర్ జాబితా ప్రకారం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి లు ఇవే!

టాప్ -10 జాబితాలో రెండవ స్థానాన్ని మహీంద్రా బొలెరో ఆక్రమించింది. బొలెరో ఎంపివి కొంతకాలంగా భారత మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఎంపివి గత నెలలో భారత మార్కెట్లో 17% పెరుగుదలను నమోదు చేసింది. 2018 డిసెంబర్‌లో 4,832 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు అమ్మకాలు దాదాపుగా 5,661 యూనిట్లుగా ఉన్నాయి.

2019 డిసెంబర్ జాబితా ప్రకారం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి లు ఇవే!

భారత మార్కెట్లో ఇబ్బందులు పడుతున్న ఫ్రెంచ్ బ్రాండ్‌కు రెనాల్ట్ ట్రైబర్ అద్భుతమైన విజయాన్ని అందించింది. రెనాల్ట్ నుండి సబ్ -4 మీటర్ కాంపాక్ట్ ఎంపివి 2019 డిసెంబర్‌లో 5,631 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది బొలెరో కంటే కేవలం 30 యూనిట్లు తక్కువలో మాత్రమే ఉంది.

2019 డిసెంబర్ జాబితా ప్రకారం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి లు ఇవే!

ఎప్పుడూ అమ్మకాలలో ముందుకు సాగుతున్న టయోటా ఇన్నోవా క్రిస్టా, అమ్మకాల పరంగా ఇప్పుడు నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ వాహనం అంతకుముందు నెలలో 3,414 యూనిట్లను నమోదు చేసింది. రెనాల్ట్ ట్రైబర్ రాకతో దీని అమ్మకాలు కొంత తగ్గాయనే చెప్పాలి. అయినప్పటికీ ఈ సంస్థ ఇటీవల BS6 వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. రాబోయే నెలల్లో అమ్మకాలను మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నారు.

2019 డిసెంబర్ జాబితా ప్రకారం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి లు ఇవే!

మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 6 ఇన్నోవా క్రిస్టా తరువాత ఐదవ స్థానాన్ని పొందింది. మారుతి ఎక్స్‌ఎల్ 6 డిసెంబర్ 2019 లో 2,521 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇన్నోవా క్రిస్టా, ఎర్టిగాతో పోలిస్తే అనేక అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

Read More:ప్రమాద బాధితులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఒడిస్సా ఎమ్మెల్యే!

2019 డిసెంబర్ జాబితా ప్రకారం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి లు ఇవే!
Rank Models Dec'19 Dec'18 Growth (%)
1 Maruti Ertiga 6,650 7,155 -7
2 Mahindra Bolero 5,661 4,832 17
3 Renault Triber 5,631 - -
4 Toyota Innova Crysta 3,414 6,551 -48
5 Maruti XL6 2,521 - -
6 Mahindra Marazzo 1,292 3,206 -60
7 Tata Hexa 317 682 -54
8 Honda BR-V 82 442 -81
9 Datsun Go+ 67 379 -82
10 Mahindra Xylo 41 195 -79

Read More:రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా..? ఈ న్యూస్ మీ కోసమే!

2019 డిసెంబర్ జాబితా ప్రకారం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి లు ఇవే!

జాబితా ప్రకారం మహీంద్రా మరాజో ఆరవ స్థానాన్ని ఆక్రమించుకుంది. మహీంద్రా మరాజో 2018 మధ్యలో ప్రారంభించబడింది. కానీ ప్రవేశపెట్టినప్పటి నుండి మంచి సంఖ్యలో అమ్ముడైంది. 2019 డిసెంబర్ నెలలో మరాజో 1,292 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే గత ఏడాది ఇదే నెలలో 3,206 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ అమ్మకాలతో పోలిస్తే ఇది 60% క్షీణతను కలిగి ఉంది.

Read More:దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు: ఆంధ్రాకే పెద్దపీఠ!

2019 డిసెంబర్ జాబితా ప్రకారం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి లు ఇవే!

ఈ జాబితాలో మొదటి నాలుగు వాహనాలుగా టాటా హెక్సా, హోండా బిఆర్-వి, డాట్సన్ GO+ మరియు మహీంద్రా xylo రూపొందించబడ్డాయి. ఈ నాలుగు వాహనాల అమ్మకాలు ఈ విధంగా ఉన్నాయి. టాటా హెక్సా 317 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. హోండా బిఆర్-వి 82 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, డాట్సన్ GO + మాత్రం 67 యూనిట్లు, మహీంద్రా xylo 67 వాహనం 41 యూనిట్లు నమోదు చేశాయి. 2019 డిసెంబర్‌లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎమ్‌పివి మారుతి సుజుకి ఎర్టిగాగా కొనసాగుతోంది.

Source: Auto Punditz

Most Read Articles

English summary
Top-Selling MPV In India For December 2019: Maruti Ertiga Continues Its Lead In The Segment-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X