ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2020 మరికొన్ని కొన్ని రోజుల్లో మొదలవనుంది. భారతదేశపు ప్రతిష్టాత్మక వాహన ప్రదర్శన జరిగే ఇండియన్ ఆటో ఎక్స్‌పోకు నెలరోజులే ఉండటంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దిగ్గజ సంస్థలైన మారుతి సుజుకి, కియా మోటార్స్, హ్యుందాయ్ మరియు టాటా కంపెనీలు తమ నూతన ఉత్పత్తులు ఆవిష్కరించడానికి సిద్దం అవుతున్నాయి.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2020లో మన ముందుకు రాబోతున్న కొత్త ఎస్‌యూవీల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం...

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

1. సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ పాపులర్ ఎస్‌యూవీ క్రెటా కారును సెకండ్ జనరేషన్‌లో తీసుకొస్తోంది. ఇండియన్ ఆటో ఎక్స్‌పో 20202 వేదికగా భారీ మార్పులు చేర్పులతో పాటు నూతన ఇంజన్ ఆప్షన్‌లో కార్ల ప్రేమికుల ముందుకు రాబోతోంది. పానరొమిక్ సన్‌రూఫ్, అతి పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటివి ఎన్నో కొత్త ఫీచర్లు రానున్నాయి.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

2. కొత్త తరం హ్యుందాయ్ టుసాన్

ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి తీసుకొచ్చిన టుసాన్ ఎస్‌యూవీ లగ్జరీ కార్ ప్రేమికులను బాగానే ఆకట్టుకుంది. ఈ మోడల్ విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తోంది. దీంతో టుసాన్ ఎస్‌యూవీని సెకండ్ జనరేషన్ వెర్షన్‌లో నూతన ఫీచర్లు ఆవిష్కరించనుంది. ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు బిఎస్-6 వెర్షన్‌లో రానున్నాయి.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

3. మారుతి వితారా బ్రిజా ఫేస్‌లిఫ్ట్

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ వితారా బ్రిజాను సరికొత్త పెట్రోల్ ఇంజన్ వెర్షన్‌లో ఆవిష్కరించే ఆవకాశం ఉంది. మారుతి బ్రిజా ఎస్‌యూవీని నూతన హెడ్‌ల్యాంప్స్ మరియు పలు అదనపు ఫీచర్లతో కూడిన బిఎస్-6 మోడళ్లను ఇటీవల రహస్యంగా పరీక్షించింది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

4. మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి సుజుకి గతంలో క్రాసోవర్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ఎస్-క్రాస్ కారును తీసుకొచ్చింది. నెక్సా ప్రీమియం షోరూముల ద్వారా మాత్రమే లభించే మారుతి ఎస్-క్రాస్ ప్రీమియం కస్టమర్లను ఎంతగానో ఆకర్షించింది. దీనిని కూడా నూతన పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో పరిచయం చేసే అవకాశం ఉంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

5. స్కోడా కమిక్

స్కోడా ఆటో ఇండియా మార్కెట్లో పట్టుబిగించేందుకు నూతన మోడళ్లను ప్రవేశపెట్టనుంది. అందులో స్కోడా కమిక్ ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లో లభించే కమిక్ ఎస్‌యూవీని ఫిబ్రవరిలో జరిగే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించే అవకాశం ఉంది. స్కోడా కమిక్ పెట్రోల్ మరియు సీఎన్జీ ఇంజన్ ఆప్షన్‌లో వచ్చే ఛాన్స్ ఉంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

6. స్కోడా కరోక్

స్కోడా కరోక్ కూడా ఇండియన్ మార్కెట్‌కు పూర్తిగా కొత్త మోడల్. దేశీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి రానున్న కరోక్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ టీఎస్ఐ ఇవో టుర్భో‌ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. స్కోడా ఇందులో డీజల్ ఇంజన్‌ అస్సలు పరిచయం చేయదు.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

7. వోక్స్‌వ్యాగన్ టి-రాక్

ఇండియన్ మార్కెట్లో అతి పెద్ద ఎస్‌యూవీల తయారీ సంస్థగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వోక్స్‌వ్యాగన్ ఇది వరకే ప్రకటించింది. అందులో భాగంగానే భవిష్యత్తులో వీలైనంత వరకు ఎస్‌యూవీలనే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. టి-రాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా నిలిచే టి-రాక్ 1.5-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో రానుంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

8. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఇది వరకే ఇండియన్ మార్కెట్లోకి విడుదలైంది. అయితే, టిగువాన్ ఆల్‌స్పేస్ పేరుతో 5-సీటర్ మరియు 7-సీటర్ ఎస్‌యూవీలను లాంచ్ చేసేందుకు వోక్స్‌వ్యాగన్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో బిఎస్-6 వెర్షన్ 1.5-లీటర్ టుర్భో పెట్రోల్ మరియు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లు రానున్నాయి.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

9. రెనో హెచ్‌బిసి ఎస్‌యూవీ

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో సరికొత్త సబ్-5 మీటర్ ఎస్‌యూవీని హెచ్‌బిసి కోడ్ పేరుతో ఆవిష్కరించనుంది. 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో హెచ్‌బిసి ఎస్‌యూవీని కాన్సెప్ట్ వెర్షన్‌లోనా లేదా ప్రొడక్షన్ వెర్షన్‌లో రివీల్ చేస్తుందా అనే విషయమై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

రెనో ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న డస్టర్ మరియు ట్రైబర్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. బడ్జెట్ ధరలో ట్రైబర్ ఎంపీవీలో ఉన్నటువంటి ఎన్నో ఫీచర్లు మరియు డిజైన్ అంశాలు హెచ్‌బీసీలో ఎస్‌యూవీలో రానున్నాయి.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

10. కియా క్యూవైఐ (QYI)

సెల్టోస్ ఎస్‌‌యూవీతో ఇండియన్ మార్కెట్లో ఆరంగేంట్రం చేసిన కియా మోటార్స్ ఇప్పుడు కాంపాక్ట్ ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది. ఇండియన్ రోడ్ల మీద ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షిస్తూ పట్టుబడిన కియా QYI ఎస్‌యూవీని 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

కియా మాతృ సంస్థ అయిన హ్యుందాయ్ విక్రయించే వెన్యూ ఎస్‌యూవీ మరియు కియా సెల్టోస్ ఎస్‌యూవీల్లోని ఇంజన్‌లనే కియా QYIలో అందివ్వనుంది. కియా QYI కారను అత్యాధునిక ఫీచర్లతో విభిన్నమైన పేరుతో ప్రవేశపెట్టనున్నారు.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

11. ఎంజీ హెక్టర్ ప్లస్

ఎంజీ మోటార్స్ తమ మొట్టమొదటి ఎస్‌యూవీ హెక్టర్ ఎస్‌యూవీతో మార్కెట్లో తీవ్ర అలజడిని సృష్టించింది. దీనికి కొనసాగింపుగా హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని తీసుకొస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో దీనిని ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

ఎంజీ హెక్టర్ ప్లస్ కారును ఇప్పటికే పలుమార్లు పరీక్షిస్తుండగా రహస్యంగా సేకరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. పలు నూతన ఫీచర్లతో పాటు అదనంగా మూడో వరుస సీటింగ్‌తో 7-మంది ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దారు.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

12. టాటా గ్రావిటాస్

టాటా మోటార్స్ 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పో కోసం పెద్ద లిస్టునే సిద్దం చేసుకుంది. అందులో హ్యారియర్ ఎస్‌యూవీ ఆధారిత గ్రావిటాస్ కూడా ఒకటి. ప్రస్తుతం 5-సీటింగ్ లేఔట్లో లభించే హ్యారియర్ ఎస్‌యూవీ యొక్క 7-సీటర్ వెర్షన్ గ్రావిటాస్.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

13. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ఆలస్యంగా ప్రవేశించిన టాటా నెక్సాన్ గొప్ప విజయాన్ని అందుకుంది. మంచి ఆదరణ లభిస్తుండటంతో 2020 మోడల్ నెక్సాన్ ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురావాలని టాటా భావిస్తోంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

14. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. డిజైన్ పరంగా ఇండియన్ కస్టమర్ల మనసు దోచుకున్న నెక్సాన్ ఎస్‌యూవీ ఆధారంగానే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. టాటా నెక్సాన్ ఇవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీనే కూడా ఇదే కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

15. మహీంద్రా థార్ బిఎస్6

ముంబాయ్ ఆధారిత దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీల తయారీకి పెట్టింది పేరు. తమ పాపులర్ ఆఫ్-రోడర్ మరియు ఆన్-రోడర్ థార్ ఎస్‌యూవీని అతి త్వరలో బిఎస్-6 వెర్షన్‌లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

16. మహీంద్రా స్కార్పియో బిఎస్6

మహీంద్రాకు సక్సెస్‌ రుచి చూపించిన స్కార్పియో మోడల్ విడుదలైనప్పటి నుండి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిలకడైన విక్రయాలు సాధిస్తోంది. ఈ మోడల్‌ను కూడా 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా బిఎస్-6 ఇంజన్ ఆప్షన్లో పలు నూతన ఫీచర్లతో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

17. సెకండ్ జనరేషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో 7-సీటింగ్ సౌలభ్యంతో లభించే మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ, దీనిని కూడా సెకండ్ జనరేషన్‌లో ప్రవేశపెట్టాలని మహీంద్రా భావిస్తోంది. అన్ని మహీంద్రా ఎస్‌యూవీలలో బిఎస్-6 వెర్షన్‌ ఇంజన్‌లు తప్పనిసరిగా రానున్నాయి. ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఇదే ఈవెంట్లో మన ముందే వచ్చే అవకాశం ఉంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

18. సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఇ మరియు జీఎల్ఎస్

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ మరియు జీఎల్ఎస్ రెండు లగ్జరీ ఎస్‌యూవీలను నాలుగో జనరేషన్ వెర్షన్‌లో ఆవిష్కరించే అవకాశం ఉంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులు మరియు అవసరాలకు అనుగుణంగా అధునాతన ఇంజన్ ఆప్షన్లు మరియు వైవిధ్యమైన ఫీచర్లను పరిచయనుంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

19. జిడబ్ల్యూ మోటార్స్ హవల్ 6 ఎస్‌యూవీ

చైనాకు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్ ఈ ఏడాది జరిగే ఇండియన్ ఆటో ఎక్స్‌పో ద్వారా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. ఎంజీ హెక్టర్ మరియు టాటా హ్యారియర్ ఎస్‌యూవీలకు పోటీగా హవల్ 6 ఎస్‌యూవీని ప్రదర్శించే అవకాశం ఉంది.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

హవల్ 6 ఎస్‌యూవీ 1.5-లీటర్ మరియు 2.0-లీటర్ టుర్భో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే వెర్షన్‌లో కూడా ఇవే ఇంజన్‌లు ఉన్నాయి.

ఫ్యూచర్ మొత్తం ఈ కార్లదే: ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు వస్తోన్న టాప్ ఎస్‌యూవీలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఢిల్లీ వేదికగా ఫిబ్రవరిలో సుమారుగా వారం రోజుల పాటు జరిగే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో పలు కార్ల కంపెనీలు ఆవిష్కరించే ఎస్‌యూవీల జాబితా ఇదేనండీ.. మరిన్ని కొత్త కంపెనీలు కొన్ని కొత్త కొత్త మోడళ్లు మరియు కాన్సెప్ట్ వెర్షన్‌లను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్ట్ తెలుగు చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Top SUVs Expected To Be Showcased At The Delhi Auto Expo 2020: Creta, Tucson, And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X