బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం
జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కిర్లోస్కర్ మోటార్, తమ బిడది ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో ఇద్దరు ఉద్యోగులకు కోవిడ్ -19 పాజిటివ్ రావటంతో కంపెనీ తమ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసింది.

టొయోటా ఇది వరకు చేసిన ప్రకటనలో జూన్ 7 మరియు జూన్ 16వ తేదీలలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు కరోనా వైరస్ పాజిటివ్ పరీక్షించబడ్డారని, ఫలితంగా ఈ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేశామని ప్రకటించింది.

ఈ కేసులు నమోదైనప్పటి నుంచి టొయోటా ప్లాంట్‌ను మూసివేసి, క్రిమిసంహారక మందులను స్ప్రే చేసి పూర్తిగా శానిటైజ్ చేసింది. అంతేకాకుండా, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లో ప్రతిరోజూ పెద్ద మొత్తంలో యాదృచ్ఛికంగా కొందరికి ఉష్ణోగ్రత పరీక్షలు నిర్వహిస్తూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

టయోటా ఈ ప్లాంట్‌లో పరిస్థితిని పర్యవేక్షించడం కొనసాగిస్తుందని, తమ ఉద్యోగుల ఆరోగ్యం మరియు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ కంపెనీలలో కోవిడ్-19 కేసులు నమోదైన నేపథ్యంలో, ఆ తర్వాత టొయోటా దేశంలో కోవిడ్-19 కేసులు నమోదైన మూడవ అతిపెద్ద ఆటో తయారీదారుగా మారింది.

టొయోటాకి సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే.. కంపెనీ అందిస్తున్న బిస్6 వెర్షన్ గ్లాంజా మరియు యారిస్ మోడళ్లపై జూన్ నెలలో డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్స్‌తో పాటుగా ఎక్స్ఛేంజ్ బోనస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి ఆఫర్లు ఉన్నాయి. వీటికి అదనంగా, దేశంలోని కోవిడ్ -19 వారియర్లకు కూడా ప్రత్యేక డిస్కౌంట్లను టొయోటా ఆఫర్ చేస్తోంది.

టొయోటా గ్లాంజాపై గరిష్టంగా రూ .15,000ల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటే, టొయోటా యారిస్ గరిష్టంగా రూ.72,500ల ప్రయోజనాలను అందిస్తున్నారు. జూన్ నెలలో అందించే డిస్కౌంట్ల గురించి మరింత తెలుసుకోవడానికి - ఈ లింకుపై క్లిక్ చేయండి.

టొయోటా బిడది ప్లాంట్‌లో సేవలు పునఃప్రారంభం కావటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
నిజానికి ఇది శుభవార్త. టొయోటా కిర్లోస్కర్ మోటార్ తన బిడది ప్లాంట్‌ను వైరస్ రహితంగా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ పరిస్థితిని వారు చాలా వేగంగా పరిష్కరించినందుకు టయోటాకు హ్యాట్సాఫ్.


Click it and Unblock the Notifications








