టయోటా సీ-హెచ్ఆర్.. మరో సంచలనానికి తెరలేపిన జపాన్ దిగ్గజం

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి మరో సంచలనానికి తెరలేపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డులు బద్దలు కొట్టిన మోస్ట్ పాపులర్ మోడల్ సీ-హెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద అత్యంత రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తోంది. టయోటా సీ-హెచ్ఆర్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.. కానీ సడెన్‌గా దిగ్గజాలకు షాకిచ్చేందుకు రహస్యంగా దీనిని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

టయోటా సీ-హెచ్ఆర్.. మరో సంచలనానికి తెరలేపిన జపాన్ దిగ్గజం

2020 ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరగబోయే ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేదికలో టయోటా కంపెనీ ఈ సీ-హెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీని తొలి ఆవిష్కరణ చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ మోడల్‌కు అత్యంత రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తోంది.

టయోటా సీ-హెచ్ఆర్.. మరో సంచలనానికి తెరలేపిన జపాన్ దిగ్గజం

కంపెనీ యొక్క TNGA మోడ్యులర్ ప్లాట్‌ఫామ్ మీద దీనిని నిర్మిస్తున్నారు. పూర్తిగా తయారైన మోడళ్లను దిగుమతి చేసుకుని (CBU-కంప్లిట్లీ బిల్ట్ యూనిట్) లేదా విడి భాగాలను దిగుమతి చేసిన దేశీయంగా అసెంబుల్ (CKD- కంప్లిట్లీ నాక్డ్ డౌన్) చేసి టయోటా సీ-హెచ్ఆర్‌ను మార్కెట్లో విక్రయించే అవకాశాలు ఉన్నాయి.

టయోటా సీ-హెచ్ఆర్.. మరో సంచలనానికి తెరలేపిన జపాన్ దిగ్గజం

టయోటా సీ-హెచ్ఆర్ పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే ఇటు కంపెనీ లైనప్‌లోనూ.. అటు మార్కెట్లోనూ ఒక కొత్త సెగ్మెంట్‌కు నాంది పలుకుతుంది. టయోటా సీ-హెచ్ఆర్ 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్, 1.8-లీటర్ హైబ్రిడ్ మరియు 2.0-లీటర్ హైబ్రిడ్ డైనమిక్ వంటి ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. కానీ ఇండియన్ వెర్షన్‌లో ఇంజన్ గురించిన వివరాలు ఇంకా స్పష్టం కాలేదు.

టయోటా సీ-హెచ్ఆర్.. మరో సంచలనానికి తెరలేపిన జపాన్ దిగ్గజం

టయోటా సీ-హెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీలో 180సెల్స్ గల నికెల్-మెటల్ హైబ్రిడ్ బ్యాటరీ ప్యాక్ వస్తోంది. 216వోల్ట్ సామర్థ్యంతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్ 80కిలో వాట్ పవర్ మరియు 202ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా కారును రీజనరేటివ్ బ్రేకింగ్ మోడ్‌లో ఉంచినపుడు ఇది జనరేటర్‌లా కూడా పనిచేస్తుంది.

టయోటా సీ-హెచ్ఆర్.. మరో సంచలనానికి తెరలేపిన జపాన్ దిగ్గజం

ఇతర ఎలక్ట్రిక్ కార్లలో క్యాబిన్ స్పేస్ పెంచేందుకు బ్యాటరీలను వెనుక సీట్ల క్రింద అమర్చినట్లు టయోటా సీ-హెచ్ఆర్ క్రాసోవర్‌లో కూడా బ్యాటరీలను రియర్ సీట్ల కింద అమచర్చారు. అత్యాధునిక ఆప్టిమైజ్డ్ కూలింగ్ ఎఫీషియన్సీ టెక్నాలజీని కూడా అందించారు.

టయోటా సీ-హెచ్ఆర్.. మరో సంచలనానికి తెరలేపిన జపాన్ దిగ్గజం

డిజైన్ విషయానికి వస్తే, ఇండియన్ వెర్షన్ టయోటా సీ-హెచ్ఆర్ చూడటానికి అచ్చం అంతర్జాతీయ మార్కెట్లో లభించే మోడల్‌నే పోలి ఉంది. ఎత్తైన బాడీ, కండలు తిరిగిన రూపం, బ్లాక్ పెయింటెడ్ రూఫ్, ఫ్రంట్ లైటింగ్ సిస్టమ్ జోడింపుతో వచ్చిన ఆల్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, బ్లూ కలర్ హైలెట్స్ గల బ్లాక్ ఇంటీరియర్, 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఎన్నో అంశాలున్నాయి.

టయోటా సీ-హెచ్ఆర్.. మరో సంచలనానికి తెరలేపిన జపాన్ దిగ్గజం

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎలక్ట్రిక్ కార్ల దశకానికి 2020 ఏడాదితోనే పునాది పడిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే రెండు మూడు కంపెనీలు పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. టయోటా కూడా అవకాశం ఉన్నంత కాలం సీ-హెచ్ఆర్ ఎస్‌యూవీని పెట్రోల్ మరియు హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లలో విక్రయించి, వీటితో పాటే ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

Source: ElectricVehicleWeb.in

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota C-HR Spied Testing In India Ahead Of Possible Launch: Spy Pics & Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X