2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టొయోటా అందిస్తున్న పవర్‌ఫుల్ ప్రీమియం ఎస్‌యూవీ 'ఫార్చ్యూనర్' (Fortuner)లో అప్‌గ్రేడెడ్ 2021 వెర్షన్‌ను తాజాగా థాయ్‌లాండ్ మార్కెట్లో ఆవిష్కరించింది. అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో మరియు ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ కొత్త మోడల్‌ను అతి సుందరంగా తీర్చిదిద్దారు.

2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2021 టొయోటా ఫార్చ్యూనర్‌లో మునుపటి వెర్షన్ల కన్నా మెరుగైన ఫీచర్లను జోడించారు. అలాగే డిజైన్ పరంగా కూడా అనేక మార్పులు చేర్పులు చేశారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ముందుగా డిజైన్ విషయానికి వస్తే.. కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో L ఆకారంలో ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో పాటుగా మరింత షార్ప్ లుక్ కలిగిన ఎల్ఈడి హెడ్‌లైట్లను అమర్చారు. పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, సరికొత్త వేవ్ డిజైన్ కలిగిన స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్, డీప్ హౌసింగ్ కలిగిన ఫాగ్ ల్యాంప్స్ మరియు క్రింది భాగంలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ (ఇంజన్‌ను చల్లగా ఉంచేందుకు) అలాగే పెద్ద స్కిడ్ ప్లేట్ డిజైన్లను మనం ఇందులో గమనించవచ్చు.

2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఇక ఈ కారును వెనుక వైపు అలాగే పక్క వైపుల డిజైన్‌ను గమనించినట్లయితే, సరికొత్త వీల్ ఆర్చెస్ మరింత పెద్దగా ఉండి గతుకుల రోడ్లకు, ఆఫ్-రోడింగ్‌కు అనువుగా ఉండేలా ఉంటాయి. ఇందులో సరికొత్త డిజైన్‌తో కూడిన 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను మనం గమనించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త మోడల్‌లోని బ్రేక్ (టెయిల్) లైట్లను మరింత సన్నగా డిజైన్ చేశారు.

2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

వెనుక వైపు బంపర్‌ను కూడా రిడిజైన్ చేసి, సరికొత్త స్టయిలిష్ రిఫ్లెక్టర్లను జోడించారు. మొత్తమ్మీద కారును బయటి నుంచి గమనిస్తే, డ్యూయెల్ టోన్ డిజైన్‌తో ఎక్కువ భాగం బాడీ కలర్ మరియు పైభాగమంతా నలుపు రంగులో ఉండి తక్కువ క్రోమ్ గార్నిష్ ఎక్కువ గ్లాసీ బ్లాక్ ఫినిష్‌తో కనిపిస్తుంది. షార్క్ తోకమాదిరిగా ఉండే యాంటెన్నా, రూఫ్‌లోనే కలిసిపోయినట్లుగా అనిపించే రూఫ్ రెయిల్స్ ఇందులో మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో క్యాబిన్‌ను రపాన్ని ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉంచినప్పటికీ ఫీచర్ల పరంగా మాత్రం అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇందులో సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను మనం గనించవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేసే 8.0 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో జోడించారు.

2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఇంకా డ్రైవర్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే అధునాతన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 రకాలుగా సర్దుబాటు చేసుకోగలిగిన ఫ్రంట్ సీట్స్, 9 స్పీకర్లతో కూడిన జెబిఎల్ (JBL) ఆడియో సిస్టమ్, మూడ్‌కి తగినట్లుగా మార్చుకోదగిన ఇంటీరియర్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా, ప్రమాదాలను ముందుగా తెలియజేసే కొల్లైజన్ ప్రివెన్షన్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రోడ్డుపై పొరపాటున లైన్ తప్పితే హెచ్చరించే లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.

2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. 2021 టొయోటా ఫార్చ్యూనర్‌లో ఇదివరకటి 2.8 లీటర్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ పవర్‌ఫుల్ 2.8 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 177 బిహెచ్‌పిల శక్తిని, 450 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కాకపోతే, ఈ ఇంజన్‌ను కొంచెం ట్యూన్ చేసి 204 బిహెచ్‌పిల శక్తిని, 500 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేసేలా మార్పు చేయనున్నట్లు సమాచారం. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌పై మా అభిప్రాయం.

టొయోటా కంపెనీ ప్రస్తుతం ఈ కారును యూరోపిన్ మార్కెట్లలో విడుదల చేసినప్పటికీ, ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ మన భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

భారత మార్కెట్లో టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ ఉంది. ఇదొక ప్రీమియం ఫుల్ సైజ్ ఎస్‌యూవీ. రోడ్డుపై గంభీరమైన లుక్‌తో కనిపించే ఈ ఎస్‌యూవీని చూసి ఫ్లాట్ అవని వారెవ్వరూ ఉండరేమో. ఇది ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా అల్ట్యురాస్ జి4 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 4, 2020, 14:11 [IST]
English summary
Toyota has unveiled the 2021 Fortuner facelift in Thailand. The new (2021) Toyota Fortuner facelift SUV comes with a host of changes and updates, along with a number of added features as well. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+