ఇది మాడిఫైడ్ టయోటా అంబులెన్స్.. చూసారా !
కరోనా మహమ్మారి ఎక్కువగా విస్తరిస్తున్న సమయంలో, ఈ భయంకరమైన వైరస్ ని నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కార్ల తయారీదారులు వెంటిలేటర్స్, మాస్కులు తయారీకి తమదైన రీతిలో సహాయం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో టయోటా మాడిఫై చేసిన ఇన్నోవా క్రిస్టా కారును రెడ్‌క్రాస్ మరియు ఇండోనేషియా ఆరోగ్య శాఖకు విరాళంగా ఇచ్చింది. ఇది కరోనా రోగులకు అత్యవసర సమయంలో చాలా ఉపయోగపడుతుంది.

ఇటీవల కాలంలో టయోటా మాడిఫై చేసిన ఇన్నోవా క్రిస్టా కారును రెడ్‌క్రాస్ మరియు ఇండోనేషియా ఆరోగ్య శాఖకు విరాళంగా ఇచ్చింది. ఇది కరోనా రోగులకు అత్యవసర సమయంలో చాలా ఉపయోగపడుతుంది.

కారులో ఎక్కువ స్థలం ఉంటుంది మరియు మడతపెట్టే స్ట్రెచర్ ఇందులో సులభంగా ఉపయోగించవచ్చు. పారామెడిక్ సిబ్బంది కోసం రెండు వైపుల సీట్లు కల్పించారు. హృదయ స్పందనను పరీక్షించడానికి లైవ్ సేవింగ్ పరికరాలు ఇందులో ఉన్నాయి.

ఇన్నోవా వెలుపల అదనపు పరికరాలు వ్యవస్థాపించబడ్డాయి. కారు వెనుక గేట్‌లోని స్పాట్‌లైట్ ఉంది. ఇది చీకటిలో కూడా పనిచేస్తుంది. కారు పైభాగంలో సైరన్లు మరియు ఫ్లాషర్‌లను ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ కారును ఇండోనేషియాలోని టయోటా సప్లైయర్ తయారు చేసింది. ఈ టయోటా కారు మాడిఫై చేయడానికి ఎంత ఖర్చవుతుందనే దానిపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. ఈ కారులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజిన్ 139 బిహెచ్‌పి వద్ద 183 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశంలో ఎంజి మోటార్ కంపెనీ కరోనా నోవరణలో భాగంగా హెక్టర్ ఎస్‌యూవీని విరాళంగా ఇచ్చింది. హెక్టర్ అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్, ఆటోమేటిక్ లోడింగ్ స్ట్రెచర్, మెడిసిన్ క్యాబినెట్స్, ఫైవ్-పారామీటర్ మానిటర్లు, అంతర్గత కాంతి మరియు కారు పైన లైట్లు ఉన్నాయి. కరోనా వైరస్ నివారణలో భాగంగా చాలామంది చాలా రకాలుగా తమ వంతు మద్దతుని ప్రకటిస్తున్నారు.


Click it and Unblock the Notifications








