Just In
- 11 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 13 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 13 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 15 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- Movies Brahmamudi April 18th episode వెన్నెల నిజంగానే చనిపోయిందా? రాజ్ ఎందుకు అబద్దం చెప్పాడు?
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
టయోటా ల్యాండ్ క్రూయిజర్ డూప్లికేట్ మోడల్ కారుని తయారుచేసిన చైనా కంపెనీ
ప్రపంచదేశాలతో చైనా వస్తువులు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. చాలా వస్తువుల తయారీలో చైనా హస్తం తప్పకుండా ఉంటుంది. అంతే కాకుండా వాహన ఉత్పత్తులు చేసే చాల కంపెనీలకు ముడి సరుకులను కూడా సరఫరా చేస్తుంది.
ఏదైనా వస్తువును కాపీ చేయడంలో చైనా దేశం యొక్క హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా కాపీ చేసే కారణంగా ప్రపంచంలోనే అపఖ్యాతిని పొందింది. చైనాలోని ఆటోమొబైల్ కంపెనీలు ప్రపంచంలోని ఏ ప్రసిద్ధ కారునైనా కాపీ చేసి ఉత్పత్తి చేస్తున్నాయి.
కాపీ చేసిన కార్లు అసలైనవిగానే కనిపిస్తాయి. ఏది చట్టబద్ధమైనది మరియు ఏది నకిలీదో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. అంతకుముందు చైనా కార్ల తయారీదారులు తమ పాశ్చాత్య పోటీదారుల కొత్త కార్లను కాపీ చేసి అమ్మారు. ఇటీవల చైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని దీనిపై అనేక ఆంక్షలు కూడా విధించింది.
MOST READ:గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000
అయితే చైనా కంపెనీలు మునుపటిలాగే కాపీ చేయడం మాత్రం వదలడం లేదు. హెంగ్టియన్ ఆటోమొబైల్ ఇప్పుడు ఎల్ 4600 ఎస్యువి ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్యువి ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కాపీ.
ఈ ఎస్‌యువిని చోసినట్లైతే ఇంత బాగా నకిలీ విధానంలో కూడా తయారు చేయగలదా అని ఆశ్చర్యపోక తప్పదు. ఈ L-4600 ఎస్యువి ల్యాండ్ క్రూయిజర్ కంటే పెద్దది. కానీ ల్యాండ్ క్రూయిజర్ ఈ నకిలీ కారు కంటే చాలా పొడవుగా మరియు వెడల్పుగా ఉంది. ఈ డూప్లికేట్ ఎస్‌యువిలో పెద్ద వీల్‌బేస్ కూడా ఉంది.
MOST READ: కోవిడ్-19 టెస్ట్ కోసం తిరంగ ప్రాజెక్టును ప్రారంభించిన కేరళ గవర్నమెంట్
286 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేసే 4.6-లీటర్ వి 8 ఇంజిన్‌తో పనిచేసే ఈ ఎల్ 4600 ఎస్‌యూవీలో చైనా కంపెనీ తన సొంత ఇంజన్ మరియు గేర్‌బాక్స్‌ను ఇన్స్టాల్ చేసింది. ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీలో 5.7-లీటర్ వి 8 ఇంజన్ ఉంది.
ఈ ఎస్యువి బాడీని హెంగ్టియన్ కంపెనీలో తయారు చేశారు. దీని గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ యొక్క క్రోమ్ గ్రిల్ కాపీ చేయబడింది, కానీ భిన్నంగా కనిపించేలా అడ్జస్ట్ చేయబడింది. ఈ ఎస్యువి లోపలి చిత్రాలు ఇంకా విడుదల కాలేదు.
MOST READ: యమహా లాంచ్ చేయనున్న రెండు కొత్త బైక్స్ : FZ 25 & FZS 25
ఈ ఎస్యువి చూడటానికి ఆకర్షణీయంగా లేనప్పటికీ, లగ్జరీని పెంచడానికి ఇది అనేక ఫీచర్లను అందిస్తుంది. L4600 ఎస్‌యువిలో వుడ్ ట్రిమ్ మరియు డ్యూయల్ టోన్ లెదర్ అప్హోల్స్టరీ వంటివి ఉన్నాయి.
నకిలీ మోడల్ అయినప్పటికీ ఈ ఎస్‌యూవీని పెద్ద సంఖ్యలో విక్రయించే అవకాశం ఉంది. దీనికి కారణం ఈ ఎస్యువి ధర. ఈ ఎస్యూవీ ధర సుమారు రూ. 29.24 లక్షలు కాగా, టయోటా ల్యాండ్ క్రూయిజర్ ధర రూ. 1.47 కోట్లు. ఈ డూప్లికేట్ ఎస్‌యువితో టయోటా ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.
MOST READ:మీ అభిమాన బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ ఇకపై లేనట్టే, ఎందుకో తెలుసా..?