రీ-బ్యాడ్జ్డ్ మారుతి సుజుకి ఎర్టిగాను ప్రారంభించనున్న టయోటా

టయోటా కిర్లోస్కర్ మోటార్ గత ఏడాది టయోటా గ్లాంజాను మార్కెట్లోకి విడుదల చేసింది. తర్వాత రెండవ మోడల్ గా రీ-బ్యాడ్జ్ కారుని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తదుపరి కారు రీ బ్యాడ్జ్డ్ కారుగా మారుతి ఎర్టిగాని విడుదల చేస్తుందని ఊహాగానాలు ఉన్నాయి.

రీ-బ్యాడ్జ్డ్ మారుతి సుజుకి ఎర్టిగాను ప్రారంభించనున్న టయోటా

టయోటా తన ప్రణాళికలను వేగవంతం చేయడానికి రీ-బ్రాండెడ్ ఎర్టిగాను ఈ సంవత్సరంలో ప్రారంభించటానికి యోచిస్తోంది. ఈకంపెనీ బ్రాండ్ అయిన గ్లాంజా విజయవంతంగా అమ్ముడైన తరువాత రీ-బ్రాండెడ్ ఎర్టిగాని విడుదల చేయాలనే నిర్ణయం తీసుకుంది. కొత్త టయోటా రూపకల్పన అంశాలు ఎర్టిగాకు భిన్నంగా ఉంటాయి.

రీ-బ్యాడ్జ్డ్ మారుతి సుజుకి ఎర్టిగాను ప్రారంభించనున్న టయోటా

ఇందులో చిన్న కాస్మెటిక్ నవీకరణలు ఉంటాయి. అవి ఏవంటే రెండు స్లాట్ గ్రిల్ డిజైన్ మరియు ప్రత్యేకమైన క్రోమ్ అంశాలు. వాహనాన్ని మరింత నిర్దిష్టంగా చేయడానికి కంపెనీ హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్ అసెంబ్లీలను పునఃరూపకల్పన చేయవచ్చు.

రీ-బ్యాడ్జ్డ్ మారుతి సుజుకి ఎర్టిగాను ప్రారంభించనున్న టయోటా

ఇంటీరియర్స్ ఎక్కువగా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో పాటు లెధర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, యువి కట్ గ్లాస్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తాయి.

రీ-బ్యాడ్జ్డ్ మారుతి సుజుకి ఎర్టిగాను ప్రారంభించనున్న టయోటా

ప్రస్తుత బిఎస్ 6 రీ-బ్యాడ్జ్ ఎర్టిగా 1.5-లీటర్ నాలుగు సిలిండర్ కె 15 బి మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 102 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ తో జతచేయబడి ఉంటుంది. కొత్త టయోటా ఎమ్‌పివి ధర రూ .7.5 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

రీ-బ్యాడ్జ్డ్ మారుతి సుజుకి ఎర్టిగాను ప్రారంభించనున్న టయోటా

2017 లో మారుతి సుజుకి మరియు టయోటా రెండు కూడా భాగస్వాములుగా సంతకం చేశారు. ఈ రెండు కంపెనీలకు ఇతరుల కార్ల పోర్ట్‌ఫోలియోను యాక్సెస్ చేయడానికి, వాటిని తిరిగి బ్యాడ్జ్ చేయడానికి మరియు ఆయా బ్రాండ్ల క్రింద విక్రయించడానికి అనుమతిస్తుంది.

రీ-బ్యాడ్జ్డ్ మారుతి సుజుకి ఎర్టిగాను ప్రారంభించనున్న టయోటా

టయోటా బ్రాండ్ కింద తిరిగి బ్యాడ్జ్ చేయబోయే తదుపరి వాహనాలు ఏవంటే ఎర్టిగా మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా. ఈ భాగస్వామ్యం భారతదేశంలో హైబ్రిడ్ టెక్నాలజీ ని పెంపొందించడానికి సహకరిస్తుంది. ఈ టెక్నాలజీ రెండు సంస్థలు ఉత్పత్తి చేసే వాహనాలలో కనిపిస్తుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota To Launch Re-Badged Maruti Suzuki Ertiga This Year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X