ఆగస్ట్ నెలాఖరు నాటికి టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం

జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా (టికెఎమ్) భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తున్న తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. మారుతి సుజుకి-టొయోటా భాగస్వామ్యం నుండి వస్తున్న ఈ రెండవ ఉత్పత్తికి 'అర్బన్ క్రూయిజర్' అనే పేరును ఖరారు చేశారు.

ఆగస్ట్ నెలాఖరు నాటికి టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెలాఖరు నాటికి టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టడం కోసం కెంపెనీ "రెస్పెక్ట్" అనే కొత్త క్యాంపైన్‌ను కూడా ప్రారంభించింది. టొయోటా ప్రోడక్ట్ లైనప్‌లో ఈ అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ, కంపెనీ నుండి లభ్యం కానున్న సరికొత్త మోడల్‌గా నిలుస్తుంది.

ఆగస్ట్ నెలాఖరు నాటికి టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం

"ఆల్-న్యూ టయోటా అర్బన్ క్రూయిజర్" కోసం బుకింగ్స్ ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి ప్రారంభమవుతాయని, పండుగ సీజన్ నాటికి ఈ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేస్తామని టయోటా పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే టొయోటా తమ అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీకి సంబంధించి మొదటి అధికారిక టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే.

ఆగస్ట్ నెలాఖరు నాటికి టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం

ఇది భారత మార్కెట్ కోసం కంపెనీ యొక్క మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉండనుంది. ఈ జపనీస్ బ్రాండ్ అందిస్తున్న ఐకానిక్ ‘ల్యాండ్ క్రూయిజర్' పేరు నుండి ప్రేరణ పొంది, ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీకి టొయోటా అర్బన్ క్రూయిజర్ అనే నేమ్‌ప్లేట్‌ను ఖరారు చేసినట్లు టొయోటా పేర్కొంది.

ఆగస్ట్ నెలాఖరు నాటికి టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం

టొయోటా అర్బన్ క్రూయిజర్‌ను మారుతి సుజుకి అందిస్తున్న విటారా బ్రెజ్జా మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. అయితే, ఇది బ్రెజ్జా కన్నా కాస్తంత భిన్నంగా ఉంటుంది. బ్రెజ్జాకు టొయోటా టచ్ ఇచ్చేలా, అర్బన్ క్రూయిజర్‌లో కంపెనీ అనేక విషయాలను ప్రీమియంగా అప్‌గ్రేడ్ చేసింది.

ఆగస్ట్ నెలాఖరు నాటికి టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం

ముందు భాగంలో ట్విన్-స్లాట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్‌లో కట్స్ మరియు క్రీజ్ లైన్స్, బిల్ట్-ఇన్ ఫాక్స్ బుల్ బార్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్‌ను ఇందులో గమనించవచ్చు. బాడీ మొత్తం క్రోమ్ ట్రీట్‌మెంట్ కనిపిస్తుంది. కారుకు చేసిన ఈ ట్వీక్స్, బ్రెజ్జా నుండి అర్బన్ క్రూజర్ భిన్నంగా కనిపించడానికి సహకరిస్తాయి. ఇవే కాకుండా, అర్బన్ క్రూయిజర్ ఒకే బాడీ పార్ట్స్‌ను పంచుకునేటప్పుడు దీని ఓవరాల్ లుక్ విటారా బ్రెజ్జా లాగానే అనిపిస్తుంది.

ఆగస్ట్ నెలాఖరు నాటికి టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం

ఇంటీరియర్స్‌లో, అర్బన్ క్రూయిజర్ టొయోటా మార్క్ కనిపిస్తుంది. ఇందులో అప్‌హోలెస్ట్రీ మరియు డాష్‌బోర్డ్ డిజైన్‌లు మారే అవకాశం ఉంది. అయితే, ఓవరాల్ ఇంటీరియర్ క్యాబిన్ మాత్రం తిరిగి బ్రెజ్జా మాదిరిగానే అనిపిస్తుంది. అన్ని మారుతి సుజుకి మోడళ్లతో పాటు టయోటా గ్లాంజాలో కనిపించే అదే స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అర్బన్ క్రూజర్‌లో కూడా అమర్చనున్నారు.

ఆగస్ట్ నెలాఖరు నాటికి టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం

ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జా బిఎస్6లో ఉపయోగిస్తున్న పెట్రోల్ ఇంజన్‌నే కొత్త అర్బన్ క్రూయిజర్‌లోనూ ఉపయోగించనున్నారు. ఇందులో సుజుకి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

ఆగస్ట్ నెలాఖరు నాటికి టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం

టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, సరికొత్త టొయోటా అర్బన్ క్రూయిజర్ ఆధునిక స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది మరియు యువతను ఆకర్షించే డిజైన్‌ను కలిగి ఉండనుంది. టొయోటా అర్బన్ క్రూయిజర్ మార్కెట్లో విడదలైతే, ఇది ఈ విభాగంలో టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు సరికొత్త కియా సోనెట్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 14, 2020, 12:00 [IST]
English summary
Toyota Kirloskar Motors is gearing up to launch its brand new compact-SUV called the Urban Cruiser in the Indian market. Bookings For The All-New Toyota Urban Cruiser Will Commence By The End Of August 2020. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+