టొయోటా అర్బన్ క్రూయిజర్ బ్రోచర్ లీక్ - మరిన్ని కొత్త వివరాలు వెల్లడి!

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) నుంచి మరికొద్ది రోజుల్లోనే విడుదల కానున్న కొత్త సబ్-మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ "అర్బన్ క్రూయిజర్"కి సంబంధించి తాజాగా మరిన్ని కొత్త వివరాలు వెల్లడయ్యాయి. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌పై తయారైన కొత్త టొయోటా అర్బన్ క్రూయిజర్‌కు రేపటి నుండే (ఆగస్ట్ 22, 2020) బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ బ్రోచర్ లీక్ - మరిన్ని కొత్త వివరాలు వెల్లడి!

అర్బన్ క్రూయిజర్ కోసం కంపెనీ ఇప్పటికే 'గౌరవానికి దారి ఇవ్వండి' (మేక్ వే ఫర్ రెస్పెక్ట్) అనే క్యాంపైన్‌ను కూడా ప్రారంభించింది. ఆగస్ట్ 22 నుండి ఈ మోడల్ కోసం అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభిస్తున్నామని, కస్టమర్లు రూ.11,000 అడ్వాన్స్ చెల్లించి ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ బ్రోచర్ లీక్ - మరిన్ని కొత్త వివరాలు వెల్లడి!

తాజాగా, టొయోటా అర్బన్ క్రూయిజర్ మోడల్‌కి సంబంధించి గాడివాడి బ్రోచర్ చిత్రాలను విడుదల చేసింది. లీకైన బ్రోచర్ చిత్రాల ప్రకారం, కొత్త టొయోటా కాంపాక్ట్ ఎస్‌యూవీలోని అన్ని ఫీచర్లు, పరికరాలు, కలర్ ఆప్షన్లు, ఇంజన్ వివరాలు మొదలైనవి వెల్లడయ్యాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ బ్రోచర్ లీక్ - మరిన్ని కొత్త వివరాలు వెల్లడి!

లీకైన బ్రోచర్ చిత్రాలలో చూసినట్లుగా, టొయోటా అర్బన్ క్రూయిజర్ ముందు వైపు రెండు హారిజాంటల్ గ్రిల్‌తో కూడిన కొత్త బంపర్‌ను చూడొచ్చు. ఈ గ్రిల్ మధ్యలో ‘టొయోటా' లోగో ఉంటుంది. ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, టర్న్ ఇండికేటర్లుగా మారే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఫ్రంట్ బంపర్‌పై ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్‌, సెంట్రల్ ఎయిర్ డ్యామ్, సిల్వర్ ఫినిష్‌లో కూడిన ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ వంటి మార్పులు ఉన్నాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ బ్రోచర్ లీక్ - మరిన్ని కొత్త వివరాలు వెల్లడి!

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లో 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి స్టాప్ లైట్‌తో కూడిన రియర్ స్పాయిలర్ ఉన్నాయి. టొయోటా అర్బన్ క్రూయిజర్‌ను చూస్తుంటే దాని మొత్తం డిజైన్ మరియు సిల్హౌట్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మాదిరిగానే అనిపిస్తుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ బ్రోచర్ లీక్ - మరిన్ని కొత్త వివరాలు వెల్లడి!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, టొయోటా అర్బన్ క్రూయిజర్‌లో మారుతి విటారా బ్రెజ్జా మాదిరిగానే అదే డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, టొయోటా ఇంటీరియర్స్ మాత్రం మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. అర్బన్ క్రూయిజర్‌లో ప్రీమియం బ్లాక్ / బ్రౌన్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. సైడ్ డోర్ ప్యానెల్స్‌తో పాటు రూఫ్ మొత్తం సెమీ వైట్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ బ్రోచర్ లీక్ - మరిన్ని కొత్త వివరాలు వెల్లడి!

అర్బన్ క్రూయిజర్‌లో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా నుండి గ్రహించిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సెంటర్ కన్సోల్‌లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో పాటుగా బ్రాండ్ యొక్క స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లోని ఇతర ఫీచర్లలో ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్‌విఎమ్ (సైడ్ మిర్రర్స్), ఆటో ఏసి, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. లీకైన బ్రోచర్ ప్రకారం, టొయోటా అర్బన్ క్రూయిజర్ మొత్త ఆరు సింగిల్-టోన్ మరియు మూడు డ్యూయెల్-టోన్ రంగులలో లభ్యం కానుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ బ్రోచర్ లీక్ - మరిన్ని కొత్త వివరాలు వెల్లడి!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జా బిఎస్6లో ఉపయోగిస్తున్న పెట్రోల్ ఇంజన్‌నే కొత్త అర్బన్ క్రూయిజర్‌లోనూ ఉపయోగించనున్నారు. ఇందులో సుజుకి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ బ్రోచర్ లీక్ - మరిన్ని కొత్త వివరాలు వెల్లడి!

టొయోటా అర్బన్ క్రూజర్ ఫీచర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా అర్బన్ క్రూయిజర్‌ను చూస్తుంటే, మారుతి సుజుకి విటారా బ్రెజ్జాను కొత్త డిజైన్‌లో చూసినట్లుగా అనిపిస్తుంది. అయితే, ఇందులో ప్రతిచోటా టొయోటా ప్రీమియం టచ్‌ను మనం గమనించవచ్చు. మార్కెట్లో ఇది కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మారుతి విటారా బ్రెజ్జా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: GaadiWaadi

More from DriveSpark

Article Published On: Friday, August 21, 2020, 17:24 [IST]
English summary
Toyota Kirloskar Motors (TKM) is all set to introduce their new sub-4-metre compact-SUV, the Urban Cruiser in the Indian market. Toyota has officially announced that bookings for the compact-SUV will begin from the 22nd of August 2020. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+