దేశంలో 3 కొత్త కార్ కేర్ డీటేలింగ్ స్టూడియోలను ఓపెన్ చేసిన టర్టల్ వ్యాక్స్

చికాగోకు చెందిన ప్రముఖ కార్ కేర్ సంస్థ టర్టల్ వ్యాక్స్ భారత దేశవ్యాప్తంగా తమ కో-బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో భాగంగా, గురుగ్రామ్, పూణే మరియు బెంగళూరు నగరాల్లో ఒక్కొక్కటి చొప్పున డీటేలింగ్ స్టూడియోలను కంపెనీ ఏర్పాటు చేసింది.

దేశంలో 3 కొత్త కార్ కేర్ డీటేలింగ్ స్టూడియోలను ఓపెన్ చేసిన టర్టల్ వ్యాక్స్

టర్టల్ వ్యాక్స్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కార్ కేర్ స్టూడియోల ద్వారా ఔత్సాహికుల కస్టమైజేషన్ అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన కార్ డీటేలింగ్ సేవలు మరియు ఉత్పత్తులను అందిస్తాయని తెలిపింది. ప్రతి స్టూడియోలో అల్ట్రా-మోడరన్ టర్టల్ వ్యాక్స్ డీటేలింగ్ టెక్నాలజీతో పాటుగా అర్హతగల మరియు శిక్షణ పొందిన సేవా సిబ్బంది బృందం ఉంటుందని కంపెనీ పేర్కొంది.

దేశంలో 3 కొత్త కార్ కేర్ డీటేలింగ్ స్టూడియోలను ఓపెన్ చేసిన టర్టల్ వ్యాక్స్

ఈ కార్ కేర్ స్టూడియోలు టర్టల్ వ్యాక్స్ ప్రొఫెషనల్‌కు సంబంధించిన వివిధ ప్యాకేజీలను అందిస్తాయి. ఇందులో సిరామిక్ మరియు హైబ్రిడ్ సొల్యూషన్స్ వంటి ప్యాకేజీలు కార్ డీటేలింగ్‌లో మంచి ఫలితాలను అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ సంరక్షణ ప్యాకేజీలు వాహనాల మెయింటినెన్స్ మరియు హైజీన్‌కు సహాయపడతాయి.

MOST READ:యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]

దేశంలో 3 కొత్త కార్ కేర్ డీటేలింగ్ స్టూడియోలను ఓపెన్ చేసిన టర్టల్ వ్యాక్స్

భారతదేశంలో టర్టల్ వ్యాక్స్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కంపెనీ భారతదేశపు మొదటి ఫార్ములా 1 డ్రైవర్ నరేన్ కార్తికేయన్ ద్వారా డిజిటల్ ఆవిష్కరణ చేసింది. టర్టల్ వ్యాక్స్ నరేన్ యొక్క ఎన్‌కే రేసింగ్ అకాడమీతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది మరియు భారతదేశంలో యువ రేసింగ్ ప్రతిభకు తోడ్పడటం మరియు వారి కలలను సాకారం చేసుకోవడానికి వారిని ముందుకు తీసుకురావడంలో సహకరిస్తుంది.

దేశంలో 3 కొత్త కార్ కేర్ డీటేలింగ్ స్టూడియోలను ఓపెన్ చేసిన టర్టల్ వ్యాక్స్

టర్టల్ వ్యాక్స్ కార్ కేర్ స్టూడియోలో లభించే ట్రీట్‌మెంట్స్ వివరాలు ఇలా ఉన్నాయి: హైబ్రిడ్ సిరీస్, సిరామిక్ కోట్ ప్రొటెక్షన్, ఎక్స్టీరియర్ రీస్టోరేషన్ ట్రీట్‌మెంట్, ఇంటీరియర్ డిటెయిలింగ్ ట్రీట్‌మెంట్, స్పెషాలిటీ ట్రీట్‌మెంట్, మరియు వాష్. టర్టల్ వ్యాక్స్ ఐస్ సీల్ మరియు షైన్ వంటి టెక్నాలజీతో పాటుగా 10హెచ్ సిరామిక్ హైబ్రిడ్ వంటి సిరామిక్ సొల్యూషన్స్‌ను కూడా అందిస్తుంది.

MOST READ:ప్యూర్ ఇవి ఎట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ ఎప్పుడో తెలుసా ?

దేశంలో 3 కొత్త కార్ కేర్ డీటేలింగ్ స్టూడియోలను ఓపెన్ చేసిన టర్టల్ వ్యాక్స్

కంపెనీ తమ సేవలను దేశంలోని మరిన్ని ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు ప్రకటించింది. మార్కెట్లలోని డిమాండ్‌ను తీర్చడానికి రాబోయే నెలల్లో భారతదేశం అంతటా 23 వివిధ కీలక నగరాలలో తమ సేవలను విస్తరించాలని టర్టల్ వ్యాక్స్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

దేశంలో 3 కొత్త కార్ కేర్ డీటేలింగ్ స్టూడియోలను ఓపెన్ చేసిన టర్టల్ వ్యాక్స్

టర్టల్ వ్యాక్స్ స్టూడియో లాంచ్ గురించి టర్టల్ వ్యాక్స్ కార్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మరియు కంట్రీ మేనేజర్ సజన్ మురళి పురంగంగర మాట్లాడుతూ, "ఈ బ్రాండ్ ప్రారంభించిన కొద్ది నెలల్లోనే భారతదేశంలో మా మొదటి మూడు డీటేలింగ్స్‌తో కూడిన కో-బ్రాండెడ్ కాన్సెప్ట్ స్టూడియోలను ప్రారంభించడం అనేది భారత మార్కెట్ కోసం మా నిరంతర పెట్టుబడి, నిబద్ధత మరియు ప్రణాళికలకు నిదర్శనంగా నిలుస్తుంది. టర్టల్ వ్యాక్స్ భారతదేశంలోకి ప్రవేశించిన ఫలితంగా డిఐవై (డు ఇట్ యువర్‌సెల్ఫ్) కార్ కేర్ సంస్కృతి మారి డిఐఎఫ్ (డు ఇట్ ఫర్-మి)కి మారుతుందని మేము ఆశిస్తున్నామని" అన్నారు.

MOST READ:కొత్త మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఎలా ఉందో చూసారా !

దేశంలో 3 కొత్త కార్ కేర్ డీటేలింగ్ స్టూడియోలను ఓపెన్ చేసిన టర్టల్ వ్యాక్స్

"అత్యున్నత ప్రమాణాలతో ప్రారంభించిన టర్టల్ వ్యాక్స్ కార్ కేర్ స్టూడియోల ద్వారా మా వినియోగదారులకు ఈ విభాగంలో పలు రకాల వినూత్న ప్రపంచ స్థాయి సేవలు మరియు ఉత్పత్తులను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మా బ్రాండ్ యొక్క 75 సంవత్సరాల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇదొక చక్కటి అవకాశంగా భావిస్తున్నాం. భారతదేశంలోకి మా బ్రాండ్ ప్రవేశించిన తరువాత వినియోగదారుల నుండి విస్తృత ప్రశంసలు వచ్చాయి మరియు టర్టల్ వ్యాక్స్ కార్ కేర్ స్టూడియోస్ అందించే అనేక కాంపర్హెన్సివ్ ట్రీట్‌మెంట్ ద్వారా కస్టమర్లు తమ వాహనాలకు ఓ పూర్తి మేక్ఓవర్‌ను ఇవ్వవచ్చని" ఆయన చెప్పారు.

దేశంలో 3 కొత్త కార్ కేర్ డీటేలింగ్ స్టూడియోలను ఓపెన్ చేసిన టర్టల్ వ్యాక్స్

భారతదేశంలో టర్టల్ వ్యాక్స్ కార్ కేర్ డీటేలింగ్ స్టూడియోల ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అమెరికాలో అత్యంత పాపులర్ అయిన టర్టల్ వ్యాక్స్ కార్ కేర్ స్టూడియో ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ స్టూడియోల సాయంతో కస్టమర్లు తమ కారును పూర్తి డీటేలింగ్ చేయించుకునే అవకాశం ఉంటుంది. కారు కేవలం శుభ్రం చేయటమే కాకుండా, వాహనాలను నష్టం నుండి రక్షించడానికి మరియు దాని షోరూమ్-కండిషన్‌ను పునరుద్ధరించడంలో ఈ స్టూడియోలు సహకరిస్తాయి.

MOST READ:మొదటి సారి భారీ డిస్కౌంట్స్ ప్రకటించి ఎంజి మోటార్ కంపెనీ.. ఎంతో తెలుసా !

Most Read Articles

English summary
Chicago-based car care company, Turtle Wax have announced the launch of its co-branded car-care studios across the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X