క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఉబర్, అదేంటో చూసారా.. !
భారతదేశంలో కరోనా మహమ్మారి అధికంగా విస్తరిస్తున్న తరుణంలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 దాకా పొడిగించారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల ఇప్పటికే చాలామంది చాలా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
లాక్ డౌన్ లో భాగంగా భారతదేశంలో వాహనసేవలన్నీ నిలిపివేయడంతో ఉబర్ మరియు ఓలా వంటి వాహన సేవలు నిలిచిపోయాయి. కాబట్టి ఇప్పుడు వాహన డ్రైవర్లు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉబర్ సంస్థ తమ డ్రైవర్లకు అండగా నిలవడానికి ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థ అయిన ఉబర్ భారతదేశంలోని తన క్యాబ్ డ్రైవర్లు మరియు రైడ్ భాగస్వాములందరికీ ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఉబర్ కంపెనీ ఉబెర్ కేర్ డ్రైవర్ ఫండ్‌లో రూ. 25 కోట్లు జమ చేసింది. అంతే కాకుండా డ్రైవర్ల సహాయార్థం ప్రస్తుతం తమ ఉద్యోగులు, వాటాదారులు మరియు పెట్టుబడిదారుల నుండి అదనంగా రూ. 25 కోట్లు సేకరిస్తోంది.

దీని గురించి ఉబెర్ ఇండియా దక్షిణాసియా అధ్యక్షుడు "ప్రదీప్ రమేశ్వరన్" మాట్లాడుతూ ప్రత్యక్ష బదిలీ ద్వారా డబ్బును డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపాడు.

లాక్ డౌన్ ప్రభావం వల్ల క్యాబ్ డ్రైవర్లు చాలా వరకు ఆదాయాన్ని కోల్పోయారని ఆయన అన్నారు. ఈ డబ్బుతో క్యాబ్ డ్రైవర్లు తమకు మరియు వారి కుటుంబాలకు అందించడం ద్వారా కొంత ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి అనుకూలంగా ఉంటుంది.

అయితే ఈ గ్రాంట్ నుండి ఎంత మంది డ్రైవర్లు ప్రయోజనం పొందుతారో ఉబర్ వెల్లడించలేదు. అలాగే ప్రతి వ్యక్తికి ఎంత డబ్బు ఇవ్వబడుతుందో కూడా స్పష్టమైన వివరణ వెల్లడించలేదు.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అన్ని వాహనాల రాకపోకలు నిషేధించబడ్డాయి. అనేక మెట్రో నగరాల్లో మందులు మరియు నిత్యావసరాల పంపిణీ కోసం ఉబెర్ మెడిసిన్ మరియు ఉబెర్ ఎసెన్షియల్ సర్వీసులను ప్రారంభించింది. డయాలసిస్, సర్జరీ వంటి సమస్యలతో బాధపడుతున్న రోగులు మరియు వృద్ధుల కోసం ఉబెర్ ప్రత్యేక సేవను ప్రారంభించింది.

ఉబర్ మాత్రమే కాదు, బైక్ టాక్సీ సేవలను అందించే ఓలా మరియు రాపిడో కంపెనీలు కూడా అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తున్నాయి. ఓలా వైద్యులను హాస్పిటల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి హాస్పిటల్ కు తీసుకురావడానికి తమ సేవలను ప్రారంభించారు. అంతే కాకుండా ఓలా సంస్థ వైద్యులకు సహాయంగా దాదాపు 500 క్యాబ్ లను కూడా వినియోగించనున్నారు ఇంతకు ముందు ఒక ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications








