8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

ప్రముఖ బాలీవుడ్ కవి కుమార్ విశ్వస్‌కి చెందిన టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తన నివాసం ముందే దొంగతనానికి గురైన సంగతి తెలిసినదే. ఈ దొంగతనానికి పాల్పడిన హైటెక్ దొంగలను యూపీ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా దొంగిలించబడిన విశ్వాస్ టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని తిరిగి ఆయనకు అందజేశారు.

8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

వివరాల్లోకి వెలితే.. కుమార్ విశ్వాస్‌కి చెందిన టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ఫిబ్రవరి 15వ తేదీన చోరీకి గురైంది. తన ఇంటి ముందు పార్క్ చేసిన ఉన్న కారుని దొంగలు చాలా తెలివిగా, సైలెంట్‌దా దోచుకెళ్లిపోయారు. ఈ ఎస్‌యూవీని గుర్తించడానికి పోలీసులకు దాదాపు ఎనిమిది నెలల సమయం పట్టింది, ఇందుకు ప్రధాన కారణం దొంగలు ఉపయోగించిన హైటెక్ టెక్నాలజీనే కారణమని తెలుస్తోంది.

8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

దొంగిలించబడిన టొయోటా ఫార్చ్యూనర్ కారుతో పాటుగా మరో మారుతి సుజుకి స్విఫ్ట్ కారును, సెల్‌ఫోన్లు మరియు లైసెన్స్ లేని అక్రమ తుపాకీని దుండగుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీకి పాల్పడిన వారిని అమీర్ అలియాస్ కామిల్, మోమిన్ అలియాస్ మహ్మద్ కల్లు, ఆరిఫ్ అలియాస్ కాలా మరియు నషీబుద్దీన్ అలియాస్ నాషాబోయెన్లుగా గుర్తించారు.

MOST READ:ప్రైవేట్ బస్సుకు రూ. 5 లక్షలకుపైగా జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దుండగులు దొంగిలించిన కార్లకు సంబంధించిన ఒరిజినల్ ఛాస్సిస్ మరియు రిజిస్ట్రేషన్ పత్రాలను మార్చివేసి వాటి స్థానంలో నకిలి వాటిని సృష్టించి సెకండ్ హ్యాండ్ వాహనంగా అమ్మేస్తారు. ఇంజన్ మరియు ఛాస్సిస్‌లపై నెంబర్ మార్చడం అలాగే ఒరిజినల్ పత్రాలను పోలిఉండే నకిలీ పత్రాలను తయారు చేయటంలో దొంగలు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.

8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

ఇలా నెంబర్లు మరియు పత్రాలు మార్చిన వాహనాలను వాటి అసలు యజమానులు చూస్తే, అది వారి కారేనని గుర్తించడం అసాధ్యం అవుతుంది. దుండగులు దొంగిలించిన వాహనాలను అసలు ఎవరూ గుర్తించలేని విధంగా మార్చేస్తారని పోలీసు అధికారులు చెప్పారు. అందుకే, చోరీకి గురైన వాహనాలను గుర్తించడంలో ఇంత జాప్యం జరుగుతుందని అన్నారు.

MOST READ:కారు బోనెట్ మీద పడిన పోలీస్.. పట్టించుకోకుండా కార్ డ్రైవింగ్, చివరికి ఏమైందంటే ?

8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

దొంగిలించబడిన టొయోటా ఫార్చ్యూనర్ కారును ఎనిమిది నెలల తర్వాత తిరిగి అందుకున్న సంతోషంలో పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ కుమార్ విశ్వాస్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసుల పనితీరును ఆయన కొనియాడారు. కారును కనుగొన్నందుకు ఘజియాబాద్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ఎస్పి) కలానిధి నైతాని మరియు తన బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

కుమార్ విశ్వాస్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని వసుంధర ప్రాంతంలో నివసిస్తున్నారు. అతను అనేక పుస్తకాలను రచించాడు. ఇవే కాకుండా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎగ్జిక్యూటివ్‌గా అనేక పాత్రలు పోషించారు.

MOST READ:తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల భీభత్సం ; భారీ సంఖ్యలో కొట్టుకుపోయిన వాహనాలు

8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

ఇక టొయోటా ఫార్చ్యూనర్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే.. కంపెనీ ఇటీవలే ఇందులో ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి పేరుతో భారత మార్కెట్లో విడుదలైన ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.34.98 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉంది.

8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

స్టాండర్డ్ ఫార్చ్యూనర్‌తో పోల్చుకుంటే కొత్త 2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి లిమిటెడ్ ఎడిషన్ అనేక కొత్త ఫీచర్లు, కాస్మోటిక్ మార్పులను కలిగి ఉంటుంది. గడచిన సంవత్సరంలో విడుదలైన టిఆర్‌డి వెర్షన్‌కు భిన్నంగా, ఈ ఏడాది కంపెనీ రెండు ఆటోమేటిక్ వెర్షన్లలో స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను అందిస్తోంది. అవి - టూ-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్-డ్రైవ్.

MOST READ:సైక్లిస్టులు ఇలా చేస్తే భారీ జరిమానా తప్పదు.. ఎలాగో తెలుసా ?

8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి లిమిటెడ్ ఎడిషన్‌లో కేవలం కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే ఉన్నాయి, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో స్టాండర్డ్ ఫార్చ్యునర్‌లో ఉపయోగించే 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 175 బిహెచ్‌పి శక్తిని మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సీక్వెన్షియల్ మరియు పాడిల్ షిఫ్ట్‌తో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

కుమార్ విశ్వాస్ టొయోటా ఫార్చ్యూనర్ చోరీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వాహనాల దొంగతనం విషయంలో దొంగలు చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నారని ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుంది. నిజానికి ఇంజన్ మరియు ఛాస్సిస్ నెంబర్లు వాటిపై చెక్కబడి ఉంటాయి. అలాంటి నెంబర్లను వారు తొలగించి, వాటి స్థానంలో నకిలీ నెంబర్లను చెక్కడం అలాగే ఒరిజినల్స్‌ను పోలి ఉండే నకిలీ పత్రాలను సృష్టించడంలో వారు లేటెస్ట్ టెక్నాలజీని వాడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కాబట్టి, మిత్రులారా మీ వాహనాల విషయంలో మీరు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించి, సురక్షితమైన ప్రదేశంలో పార్క్ చేయండి. కారులో జిపిఎస్ లొకేటర్ వంటి యాంటీ థెఫ్ట్ ఫీచర్లను ఇన్‌స్టాల్ చేసుకోండి.

Most Read Articles

English summary
UP police recovered bollywood poet Kumar Vishwas's stolen Toyota Fortuner after 8 months. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X