కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

గత 2020 సంవత్సరంలో భారత కార్ మార్కెట్లో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, ఆటోమొబైల్ కంపెనీలు వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్ని అనేక కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయి. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన ఇంకా విడుదల కావల్సిన మోడళ్లు కంపెనీ ఫ్యాక్టరీలకే పరిమితమైపోయాయి.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

అయితే, కొత్త (2021) సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే అనేక కొత్త కార్లు భారత మార్కెట్లో సందడి చేయనున్నాయి. ప్రత్యేకించి జనవరి 2021లో సుమారు ఏడుకి పైగా కొత్త కార్లు మార్కెట్లో విడుదల కానున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి:

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

టాటా ఆల్ట్రోజ్ టర్బో

టాటా మోటార్స్ 2020 ప్రారంభంలో భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఈ టాటా ఆల్ట్రోజ్. కంపెనీ 2020 సంవత్సరంలో అమ్మకాల పరంగా అద్భుతాలను సృష్టించిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వచ్చే నెలలో సరికొత్త టర్బో ఇంజన్ ఆప్షన్‌తో విడుదల కాబోతోంది.

MOST READ:ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

టాటా ఆల్ట్రోజ్ కారులో ఇప్పటి వరకూ టర్బో ఆప్షన్ లేదు. ఈ నేపథ్యంలో, కొత్త టర్బో వేరియంట్‌ను విడుదల చేయడంతో జనవరి 2021లో ఆల్ట్రోజ్ లైనప్‌ను అప్‌డేట్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ జనవరి 13, 2021వ తేదీ మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

కొత్త టాటా ఆల్ట్రోజ్ టర్బో కారులో టాటా నెక్సాన్ నుండి గ్రహించిన కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడి ఉంటుంది. తర్వాతి దశల్లో ఇందులో డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా రావచ్చని సమాచారం.

MOST READ:బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

అమెరికన్ ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కంపాస్ ఎస్‌యూవీలో ఓ కొత్త 2021 మోడల్‌ను జనవరి 7వ తేదీన ఆవిష్కరించనుంది మరియు దీని అధికారిక లాంచ్ జనవరి 26, 2021వ తేదీన జరగనుంది. మరికొద్ది రోజుల్లో ఈ మోడల్ కోసం అధికారిక బుకింగ్‌లు కూడా ప్రారంభం కానున్నాయి.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

మునుపటి తరం జీప్ కంపాస్ మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2021 జీప్ కంపాస్‌‌లో సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లు ఉండనున్నాయి. ప్రధానంగా దీని ఇంటీరియర్స్‌లో చెప్పుకోదగిన మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై పెద్ద ఎమ్ఐడి, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన పెద్ద స్టీరింగ్ వీల్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు.

MOST READ:ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ; ఎంతో తెలుసా ?

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇది 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 163 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.0-లీటర్ డీజిల్ యూనిట్ కూడా 173 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ విభిన్న గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ విక్రయిస్తున్న లేటెస్ట్ అడిషన్ హెక్టర్ ప్లస్‌లో కంపెనీ ఓ 7-సీటర్ వెర్షన్‌ను కొత్త సంవత్సరంలో విడుదల చేయనుంది. హెక్టర్ ప్లస్ ఇప్పటి వరకూ 6-సీటర్ ఆప్షన్‌తో (మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో) మాత్రమే లభిస్తోంది. కాగా, ఇప్పుడు ఇందులో మధ్య వరుసలో బెంచ్ సీటుతో కొత్త 7-సీటర్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుంది.

MOST READ:రెండు గంటల్లోనే రూ.29.5 లక్షల జరిమానాలు, పోలీసుల రికార్డ్

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్‌లో ఇంటీరియర్ అప్‌డేట్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇంజన్ పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు. మార్కెట్లో ప్రస్తుతం ఎమ్‌జి హెక్టర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

పెట్రోల్ వెర్షన్‌లో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 143 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 170 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెట్రోల్ ఇంజన్‌లో మాత్రం ఆప్షనల్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ

ఈ ఏడాది ఆరంభం నుండి ఎంతో హైప్ క్రియేట్ చేసిన టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ ఎట్టకేలకు 2021లో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, టాటా గ్రావిటాస్‌ను జనవరి 26, 2021వ తేదీన కంపెనీ అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో దీని అమ్మకాలు మరియు డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

టాటా మోటార్స్ తొలిసారిగా తమ గ్రావిటాస్ ఎస్‌యూవీ 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. అప్పటి నుండి ఈ మోడల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ అందిస్తున్న హారియర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా గ్రావిటాస్ రానుంది. ఇది కూడా హెక్టర్ ప్లస్ మాదిరిగానే 6-సీటర్ మరియు 7-సీటర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా, భారత మార్కెట్ కోసం ఓ కొత్త ఫార్చ్యూనర్‌ను సిద్ధం చేసింది. కొత్త టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ జనవరి 6, 2021వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మునుపటి కన్నా మరింత ప్రీమియం డిజైన్, లగ్జరీ ఫీచర్లతో ఇది రానుంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

కొత్త 2021 ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీతో పాటుగా కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన ‘లెజెండర్' వెర్షన్‌ను కూడా భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ లెజెండర్ ఫేస్‌లిఫ్ట్ స్టాండర్డ్ ఫార్చ్యూనర్ కన్నా కాస్తం భిన్నమైన డిజైన్ కలిగి ఉండి, శక్తివంతమైన ఇంజన్‌తో లభ్యం కానుంది. ఇందులోని 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయనుంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

కొత్త (2021) ఆడి ఏ4 సెడాన్

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, కొత్త సంవత్సరాన్ని తమ కొత్త 2021 మోడల్ ఏ4 సెడాన్ విడుదలతో ప్రారంభించనుంది. కొత్త ఆడి ఏ4 ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ను జనవరి 5, 2021వ తేదీన కంపెనీ మార్కెట్లో విడుదల చేయనుంది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో కానీ లేదా ఆడి అధికారిక డీలర్‌షిప్‌ల నుండి కానీ రూ.2 లక్షల టోకెన్ అమౌంట్‌తో ఈ కొత్త ఆడి ఏ4 సెడాన్‌ను బుక్ చేసుకోవచ్చు.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం ఆడి ఏ4 సెడాన్‌ను కంపెనీ అనేక అధునాతన ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది. ఆడి ఇండియా ఈ మోడల్‌ను స్థానికంగానే ఔరంగాబాద్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. స్థానిక తయారీ కారణంగా ఈ మోడల్ తక్కువ ధరకే విడుదల కావచ్చని అంచనా. ఇందులో 2.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు, ఇది 187 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తుంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్

కొత్త 2021 ఆడి ఏ4 మోడల్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు మరో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ తమ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ యొక్క కొత్త లాంగ్-వీల్‌బేస్ వెర్షన్‌ను జనవరి 21, 2021వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న కొత్త కార్లు ఇవే..

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్ భారత్‌లోనే అత్యంత పొడవైన మరియు విశాలమైన ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్‌గా నిలుస్తుంది. పొడవాటి వీల్‌బేస్ కారణంగా ఈ సెడాన్‌లో విశాలమైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. కాకపోతే, ఇందులోని ఇంజన్ మరియు ఇతర ఇంటీరియర్ ఫీచర్లు స్టాండర్డ్ 3-సిరీస్ మాదిరిగానే ఉంటాయి.

కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు దేశీయ మరియు విదేశీయ కంపెనీలు తమ కొత్త వాహనాలతో సిద్ధమవుతున్నాయి. మరి వీటిలో మీరు ఏ మోడల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?

Most Read Articles

English summary
Upcoming Car Launches In India In 2021, Model Wise List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X