పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

హోండా కార్స్ ఇండియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదవ తరం సరికొత్త 2020 హోండా సిటీ కారుని భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త తరం మోడల్‌తో పాటుగా ప్రస్తుత నాల్గవ తరం మోడల్‌ను కూడా కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచుతామని కంపెనీ ప్రకటించింది.

పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

రూ.10.90 లక్షల నుండి రూ.14.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో విడుదలైన ఐదవ తరం హోండా సిటీ విడుదలైన అతికొద్ది సమయంలోనే మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ మోడల్‌తో పాటుగా ఇది వరకు మార్కెట్లో ఉన్న నాల్గవ తరం హోండా సిటీ సెడాన్ కూడా ప్రస్తుతం కేవలం పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే అమ్ముడవుతోంది మరియు మార్కెట్లో దీని ధరలు రూ.9.91 లక్షల నుండి రూ.14.31 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

కాగా, తాజాగా కార్‌దేఖో నుండి వచ్చిన నివేదికల ప్రకారం, పాత-తరం సిటీ వేరియంట్లను కంపెనీ రీషఫుల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు తరాల మోడళ్ల మధ్య ముఖ్యమైన వ్యత్యాసాన్ని సృష్టించేందుకు కంపెనీ ఈ పని చేస్తున్నట్లు సమాచారం.

MOST READ: లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

ఈ రెండు మోడళ్ల మధ్య అత్యధిక ధర వ్యత్యాసం విఎక్స్ సివిటి వేరియంట్‌లో రూ.44,000గా ఉంది. ఆశ్చర్యకరమైన చిన్న ధర వ్యత్యాసాన్ని నివారించడానికి, కంపెనీ ప్రస్తుతం వేరియంట్‌ను బట్టి రూ.1.60 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

హోండా సిటీ సెడాన్ యొక్క ‘ఎస్‌వి ఎమ్‌టి' మరియు ‘వి ఎమ్‌టి' వేరియంట్‌లను రూ.15,000 వరకు డిస్కౌంట్‌తో అందిస్తున్నారు. మిడ్-స్పెక్ వేరియంట్ అయిన‘వి సివిటి' పై గరిష్టంగా రూ.51,000 ప్రయోజనాలను అందిస్తున్నారు ఈ మొత్తంలో రూ.31,000 నగదు తగ్గింపు, రూ.20,000 అదనపు కార్ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉంటాయి.

MOST READ: గర్భిణీ భార్య కోసం 4000 కి.మీ ప్రయాణించిన భర్త

పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

విఎక్స్ సివిటి వేరియంట్‌ను రూ.70,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో ఆఫర్ చేస్తున్నారు. ఇందులో జెడ్ఎక్స్ ఎమ్‌టి మరియు జెడ్ఎక్స్ సివిటి వంటి టాప్-ఎండ్ వేరియంట్లపై అత్యధిక తగ్గింపులను అందిస్తున్నారు. ఈ వేరియంట్లపై వరుసగా రూ.1.3 లక్షలు మరియు రూ.1.6 లక్షల డిస్కౌంట్లను అందిస్తున్నారు.

పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

దీనికి తోడు, పాత-తరం మోడల్ నుండి జెడ్ఎక్స్ వేరియంట్ల వంటి కొన్ని టాప్-ఎండ్ వేరియంట్లను కంపెనీ నిలిపివేసే ఆస్కారం ఉంది. సిటీ బ్యాడ్జ్‌ను కొనుగోలుదారులకు సాపేక్షంగా అందుబాటులో ఉంచడానికి ఇకపై ఇది కేవలం ఎస్‌వి, వి, విఎక్స్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

MOST READ: భారత్ & అమెరికా మధ్య తిరిగి ప్రారంభం కానున్న ఫ్లైట్ సర్వీస్ ; ఎప్పటినుంచో తెలుసా ?

పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

పాత తరం సిటీ సెడాన్‌లో ప్రస్తుతం ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 6600 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 118 బిహెచ్‌పి శక్తిని మరియు 4600 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా పాడిల్ షిఫ్టర్లతో కూడిన సెవన్-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

అంతే కాకుండా, ఓల్డ్-జెన్ హోండా సిటీ సెడాన్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌పే ఫీచర్లకు సపోర్ట్ ఇచ్చే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా లభిస్తుంది. ఇంకా ఇందులో సన్‌రూఫ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, బహుళ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో ఎబిఎస్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

పాత హోండా సిటీలో వేరియంట్స్ రీషఫుల్, టాప్-ఎండ్ వేరియంట్స్ నిలిపివేత!

పాత తరం హోండా సిటీ వేరియంట్ రీషఫలింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పాత తరం హోండా సిటీ బ్రాండ్ యొక్క బెస్ట్ సెల్లర్‌గా ఉండేది. అయితే, కంపెనీ ఈ సెడాన్‌లో సరికొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో విడుదలైన కొత్త 2020 హోండా సిటీ సెడాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇండన్ ఆప్షన్లతో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తోంది. పాత-తరం సిటీతో పోల్చుకుంటే కొత్త తరం సిటీ కారులో గణనీయమైన మార్పులు ఉన్నాయి.

Source:Cardekho

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India recently launched the much-awaited fifth-generation Honda City in the Indian market. The company also announced that the old-gen model will also be sold alongside making it accessible for sedan buyers in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more