కార్ల అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించిన జమ్మూ కాశ్మీర్

భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ కారణంగా ఆటో పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ కారణంగా ఉత్పత్తులు ఆగిపోయాయి. అంతే కాకుండా లాక్ డౌన్ ప్రభావం వల్ల పూర్తి వాహన సేవలు నిలిపివేయబడ్డాయి. కాబట్టి దేశంలో వాహన అమ్మకాలు కూడా చాల వరకు తగ్గిపోయాయి. అయితే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. భారత్ మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇన్ని కార్లు ఎలా అమ్ముడయ్యాయి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.. !

కార్ల అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించిన జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్ లో దేశంలోనే అత్యధిక కార్ల అమ్మకాలు జరిగాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కార్ల అమ్మకాలు దాదాపు 53.4% ​​పెరిగాయి. 2020 హోండా సిటీ కారు క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5 స్టార్ సాధించింది.

కార్ల అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించిన జమ్మూ కాశ్మీర్

ఢిల్లీలో కార్ల అమ్మకాలు మాత్రం 43.6% తగ్గాయి. నివేదికల ప్రకారం కేంద్ర భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌ ఇతర రాష్ట్రాల కంటే కార్ల అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా మార్చి నెలలో అమ్మకాలు బాగా తగ్గాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం దేశ ఆటో మొబైల్ పరిశ్రమకు చాలా కష్టాలను తెచ్చిపెట్టింది.

కార్ల అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించిన జమ్మూ కాశ్మీర్

ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆటో ఉత్పత్తులు ఆగిపోయాయి. దేశంలోని చాలా ఆటోమొబైల్ కంపెనీలు చైనా మరియు దక్షిణ కొరియా నుండి 10% ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటాయి. చైనా మరియు దక్షిణ కొరియాలో ఉత్పత్తి ఆగిపోయినప్పటి నుండి భారతదేశ ఆటో మొబైల్ పరిశ్రమ ముడి పదార్థాల సరఫరాపై ప్రభావం చూపింది.

కార్ల అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించిన జమ్మూ కాశ్మీర్

ఇదే సమయంలో భారతదేశంలో బిఎస్ 6 కాలుష్య నిబంధనలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. కానీ భారతదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు బిఎస్ 4 వాహనాల అమ్మకం నుండి సుమారు 10,000 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కానీ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం లాక్ డౌన్ ముగిసిన తర్వాత బిఎస్ 4 వాహనాల అమ్మకలకు అదనంగా 10 రోజులు గడువు కూడా ఇచ్చింది.

కార్ల అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించిన జమ్మూ కాశ్మీర్

అయితే మిగిలిన వాహనాలను విక్రయించడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆటో మొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నెల చివరి వరకు బిఎస్ 4 వాహనాలను అమ్మలేమని ఆటోమొబైల్ డీలర్లు తెలిపారు. ఎందుకంటే ఈ నెల 14 న లాక్ డౌన్ ముగియనుంది. కానీ ఈ కరోనా వైరస్ మరింత ఎక్కువగా వ్యాపించడం వల్ల ఈ లాక్ డౌన్ మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది.

Most Read Articles

English summary
Vehicle Registration Jammu-Kashmir witness highest growth. Read in Telugu.
Story first published: Wednesday, April 8, 2020, 17:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X