మొబైల్‌ని వదలు.. ప్రకృతిని ఆస్వాదించు..: టాటా హారియర్ టివిసి

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈనెల ఆరంభంలో తమ ఫ్లాగ్‌షిప్ హారియర్ ఎస్‌యూవీలో కొత్తగా ఎక్స్‌టి ప్లస్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. టాటా హారియర్ ఎక్స్‌టి ప్లస్ మ్యాన్యువల్ వేరియంట్‌ ధర రూ.16.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఇండియా) ఉంది.

మొబైల్‌ని వదలు.. ప్రకృతిని ఆస్వాదించు..: టాటా హారియర్ టివిసి

తాజాగా టాటా మోటార్స్ ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన ఓ టెలివిజన్ కమర్షియల్‌ను విడుదల చేసింది. టాటా హారియర్ ఎక్స్‌టి ప్లస్‌లో కీలక ఫీచర్ అయిన పానరోమిక్ సన్‌రూఫ్‌ను ఈ వీడియోలో హైలైట్ చేశారు. ఇందులో ఓ తండ్రి, కూతురు హారియర్‌లో ప్రయాణిస్తూ ఉంటారు.

ఆ సమయంలో కారు వెనుక సీటులో ఉన్న కుమార్తె మొబైల్ ఫోన్‍‌లో గేమ్ ఆడుతూ కనిపిస్తుంది. అదే సమయంలో తండ్రి పానరోమిక్ సన్‌రూఫ్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ కుమార్తె ఫోన్ పక్కన పెట్టి, బయట ఉన్న ప్రకృతిని ఆస్వాదించడం మొదలు పెడుతుంది.

MOST READ:ఎంజి గ్లోస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

మొబైల్‌ని వదలు.. ప్రకృతిని ఆస్వాదించు..: టాటా హారియర్ టివిసి

ఇక టాటా హారియర్ విషయానికి వస్తే, ఎక్స్‌టి ప్లస్ వేరియంట్ యొక్క హైలైట్ ఫీచర్ పానరోమిక్ సన్‌రూఫ్, ఇది బ్రాండ్ యొక్క ఆటోమేటెడ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని పార్క్ చేసిన తర్వాత ఒకవేళ పొరపాటున సన్‌రూఫ్ ఓపెన్‌లో ఉన్నా, అది ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది.

మొబైల్‌ని వదలు.. ప్రకృతిని ఆస్వాదించు..: టాటా హారియర్ టివిసి

అంతేకాకుండా, ఇందులో అదనపు భద్రత కోసం యాంటీ పించ్ మరియు రెయిన్ సెన్సింగ్ క్లోజర్‌ని కూడా కలిగి ఉంది. అంటే సన్‌రూఫ్ మూసుకునే సమయంలో దానికి ఏదైనా ఆటంకం కలిగినా లేదా వర్షపు చినుకులు దానిపై పడినా అది ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది. అంతే కాకుండా ఇది గ్లాస్ బ్లైండ్ కవర్‌తో కప్పబడి ఉంటుంది. ఫలితంగా కారు వెలుపల ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు, కారు లోపల వాహనదారునికి ప్రశాంతమైన ఇన్-క్యాబిన్ అనుభవాన్ని అందిస్తుంది.

MOST READ:బ్రేకింగ్ : నగరాల్లో డీజిల్ వెహికల్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?

మొబైల్‌ని వదలు.. ప్రకృతిని ఆస్వాదించు..: టాటా హారియర్ టివిసి

టాటా హారియర్ ఎక్స్‌టి ప్లస్ వేరియంట్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయెల్ ఫంక్షన్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎనిమిది స్పీకర్లు (4 స్పీకర్లు + 4 ట్వీటర్లు), ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

మొబైల్‌ని వదలు.. ప్రకృతిని ఆస్వాదించు..: టాటా హారియర్ టివిసి

ఇంకా ఇందులో పుష్-బటన్ స్టార్ట్, పుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కలిగి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్లో భద్రతా లక్షణాలను గమనించినట్లయితే ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, అధునాతన ఇఎస్పి ఫంక్షన్ ఉన్నాయి.

MOST READ:ఈ ప్లాన్ ద్వారా కారు కొనకుండా కార్ ఓనర్ అవ్వొచ్చు.. ఎలాగో మీరే చూడండి

మొబైల్‌ని వదలు.. ప్రకృతిని ఆస్వాదించు..: టాటా హారియర్ టివిసి

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త టాటా హారియర్ ఎక్స్‌టి ప్లస్ 2.0-లీటర్ ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుది. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

మొబైల్‌ని వదలు.. ప్రకృతిని ఆస్వాదించు..: టాటా హారియర్ టివిసి

టాటా హారియర్ టివిసిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా హారియర్ భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుండి దాని ఆకర్షనీయమైన డిజైన్ మరియు అద్భుతమైన పనితీరుతో అనేక మంది కస్టమర్లను ఆకర్షిస్తూ వస్తోంది. తాజాగా వచ్చిన హారియర్ ఎక్స్‌టి ప్లస్ వేరియంట్‌లోని కొత్త సన్‌రూఫ్ ఫీచర్ ఇప్పుడు మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తుందనేది మా అభిప్రాయం.

MOST READ:భారత్‌లో కార్యకలాపాలను నిలిపివేసిన లగ్జరీ బైక్ కంపెనీ హార్లే డేవిడ్సన్, ఎందుకో తెలుసా ?

Most Read Articles

English summary
Tata Motors highlights new features in Harrier XT+ variant in TVC. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X