ఆటో ఎక్స్‌పోలో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్న వోక్స్‌వ్యాగన్

వోక్స్‌వ్యాగన్ ఇండియా కంపెనీ ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబోయే కొత్త కార్ల వివరాలను వెల్లడించింది. జర్మన్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ 2020 ఆటో ఎక్స్‌పోలో నాలుగు కొత్త ఎస్‌యూవీలను ప్రదర్శించేందుకు సిద్దం అయ్యింది, వీటిని రాబోయే రెండేళ్లలోపు దశల వారీగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

ఆటో ఎక్స్‌పోలో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్న వోక్స్‌వ్యాగన్

వోక్స్‌వ్యాగన్ ప్రకటించిన నాలుగు కొత్త మోడళ్లలో అంతర్జాతీయ ఆవిష్కరణకు సిద్దమవుతున్న AO ఎస్‌యూవీ కూడా ఒకటి. సరికొత్త AO ఎస్‌యూవీ ఇండియన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మంట్‌లో స్థానం సొంతం చేసుకోనుంది. ప్రొడక్షన్ AO ఎస్‌యూవీనే ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పోలో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్న వోక్స్‌వ్యాగన్

AO ఎస్‌యూవీతో పాటు ఇండియన్ వెర్షన్ టి-రాక్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరియు ఐడీ క్రాస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కూడా ఇదే వేదిక మీద ఆవిష్కరించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో సక్సెస్ సాధించిన మోడళ్లను ఇండియన్ మార్కెట్ కోసం తీసుకొస్తున్నట్లు వోక్స్‌వ్యాగన్ ఇది వరకే ప్రకటించింది. ఈ నిర్ణయం సేల్స్ పెంచుకోవడంలో వోక్స్‌వ్యాగన్‌కు ఎంతగానో తోడ్పనుంది.

ఆటో ఎక్స్‌పోలో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్న వోక్స్‌వ్యాగన్

వోక్స్‌‌వ్యాగన్ ఇండియా ప్యాసింజర్ కార్ల అధ్యక్షుడు స్టీఫెన్ న్యాప్ మాట్లాడుతూ, "ఎప్పటికప్పుడు మారుతున్న ఇండియన్ కస్టమర్ల ఎంపిక మరియు కార్లపై వారికున్న ఇష్టాలను అధ్యయనం చేసిన తర్వాత రాబోయే రెండేళ్ల కాలంలో కేవలం ఎస్‌యూవీలను మాత్రమే లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు" తెలిపారు.

ఆటో ఎక్స్‌పోలో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్న వోక్స్‌వ్యాగన్

వోక్స్‌‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీని ఇండియన్ వెర్షన్ ఎంక్యూబీ (MQB) AO IN ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ కోసం కార్లను అభివృద్ది చేసే MQB A0 ఆర్కిటెక్చర్ యొక్క మోడిఫైడ్ వెర్షన్ ప్రత్యేకించి ఇండియా కోసమే కార్లను అభివృద్ధి చేస్తుంది.

ఆటో ఎక్స్‌పోలో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్న వోక్స్‌వ్యాగన్

వోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా ఆటో కంపెనీలు ఇండియా కార్యకలాపాల కోసం భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు కంపెనీలు ఉమ్మడిగా ప్రారంభించిన "ఇండియా 2.0" ప్రాజెక్టులో భాగంగా కొత్త కార్లను అభివృద్ది చేసేందుకు MQB ఫ్లాట్‌‌ఫామ్‌నే ఉపయోగించుకోనున్నాయి.

ఆటో ఎక్స్‌పోలో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్న వోక్స్‌వ్యాగన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ కంపెనీ ఇండియన్ మార్కెట్ కోసం భారీ అంచనాలతో ఏకంగా నాలుగు కొత్త ఎస్‌యూవీలను సిద్దం చేస్తోంది. అతి పెద్ద ఎస్‌యూవీల తయారీ సంస్థగా రాణించే లక్ష్యంతో సేల్స్‌ మీద దృష్టి సారిస్తూనే ఈ నాలుగు కార్లను సిద్దం చేసింది. మరికొన్ని వారాల్లో వోక్స్‌వ్యాగన్ ఆవిష్కరణలు మన ముందుకు రానున్నాయి. అతి త్వరలో ప్రారంభమయ్యే ఆటో ఎక్స్‌పో 2020 అప్‌డే‌ట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి!

Most Read Articles

English summary
Volkswagen India Announces Product Lineup For 2020 Auto Expo: Here’s What To Expect! Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X