గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్, త్వరలోనే విడుదల!

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ ఒకప్పుడు భారత మార్కెట్లో విక్రయించిన ప్రీమియం సెడాన్ 'పస్సాట్' (Passat)ను తిరిగి సరికొత్త రూపంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త అప్‌గ్రేడెడ్ ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారును ముంబై రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా ఓ నెటిజెన్ తన కెమెరాలో బందించాడు. క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేయటాన్ని చూస్తుంటే అతి త్వరలోనే ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్, త్వరలోనే విడుదల!

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో పాటుగా సరికొత్త ఇంజన్ ఆప్షన్‌తో సరికొత్త 2020 ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. క్యామోఫ్లేజ్ (కారు వివరాలు కనపడకుండా కప్పి ఉంచడం) లేకుండానే ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారును చూస్తుంటే ఇది ఉత్పత్తి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ టెస్టింగ్ కారు (టెస్టింగ్ కార్లు రెడ్ నెంబర్ ప్లేట్లను కలిగి ఉంటాయి) అనేక సార్లు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కనిపించింది.

గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్, త్వరలోనే విడుదల!

ఈ కొత్త మోడల్‌లో ఇదివరకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. కాకపోతే దానిని బిఎస్6 స్టాండర్డ్స్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. స్కొడా సూపర్బ్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ జిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్, త్వరలోనే విడుదల!

ఇదివరకటి బిఎస్4 మోడల్‌లోని 2.0 లీటర్ టిడిఐ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పిల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ జిఎస్‌జి గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ డీజిల్ ఇంజన్‌తో పోలిస్తే ప్రస్తుత పెట్రోల్ ఇంజన్ 16 బిహెచ్‌పిల ఎక్కువ శక్తిని మరియు 30 ఎన్ఎమ్‌ల తక్కువ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్, త్వరలోనే విడుదల!

భవిష్యత్తులో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే విడుదల కానుంది. ఇందులో డీజిల్ వెర్షన్ కొనాలనుకునే కస్టమర్ల కల కలగానే మిగిలే అవకాశం ఉంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా హెడ్ స్టీఫెన్ నాప్ కూడా ఒకానొక సందర్భంలో ఇందులో.. బహుశా డీజిల్ వేరియంట్ రాకపోవచ్చని వ్యాఖ్యానించారు.

గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్, త్వరలోనే విడుదల!

కొత్త 2020 ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్‌6లో డిజైన్ పరంగా కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. సరికొత్త బంపర్స్, కొత్త గ్రిల్ డిజైన్, ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్స్, కొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్ డిజైన్, బూట్ మొత్తాన్ని కవర్ చేసేలా రీడిజైన్ చేసిన పస్సాట్ లోగో, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను మనం ఇందులో చూడొచ్చు.

గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్, త్వరలోనే విడుదల!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. రీడిజైన్ చేసిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, బ్రాండ్ అందించే లేటెస్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ వంటి సాంకేతికతతో పాటుగా మరింత లగ్జరీ ఫీల్‌నిచ్చే ఇంటీరియర్ క్యాబిన్‌ను డిజైన్ చేశారు. ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని స్కొడా సూపర్బ్, టొయోటా క్యామ్రీ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్, త్వరలోనే విడుదల!

మునపటి ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్4 ధర (29.99 లక్షలు, ఎక్స్-షోరూమ్)తో పోల్చుకుంటే కొత్త బిఎస్6 పస్సాట్ ధర మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

ఇక వేరే ఫోక్స్‌వ్యాగన్ వార్తల్లోకి వెళితే.. 'ఇండియా అన్‌లాక్ 1.0' ప్రణాళికలో భాగంగా భారతదేశంలోని కంటైన్మెంట్ జోన్లు మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో తమ వ్యాపారాలను పునఃప్రారంభించింది. వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మార్గదర్శకాలను పాటిస్తూ కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా సేల్ అండ్ సర్వీస్ కార్యకలాపాలను పరిమిత సిబ్బందితో ప్రారంభించినట్లు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తెలిపింది.

గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్, త్వరలోనే విడుదల!

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ ఫేస్‌లిఫ్ట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఒకప్పుడు ఈ కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ రూట్‌లో విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించిన నేపథ్యంలో దీని ధర చాలా అధికంగా ఉండేది. ఇప్పుడు ఈ మోడల్‌ను ఇండియాలోని ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో, కాంపిటీటివ్ ధరకే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Source: Overdrive

More from DriveSpark

Article Published On: Friday, June 12, 2020, 18:05 [IST]
English summary
The Volkswagen Passat facelift model has been spotted testing ahead of its launch in the Indian market. The company is expected to launch the facelifted Passat with a new powertrain sometime this year. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+