వోక్స్‌వ్యాగన్ పోలో & వెంటో కార్లు ఇప్పుడు బీఎస్6 వెర్షన్‌లో
వోక్స్‌వ్యాగన్ ఇండియా మార్కెట్లోకి తమ పోలో మరియు వెంటో మోడళ్లను ఎట్టకేలకు బీఎస్6 వెర్షన్ విడుదల చేసింది. సరికొత్త వోక్స్‌వ్యాగన్ పోలో బీఎస్6 ప్రారంభ ధర రూ. 5.82 లక్షలు మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో బీఎస్6 ప్రారంభ ధర రూ. 8.82 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి. వీటి గురించి మరిన్ని వివరాలు...

వోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో బీఎస్6 మోడళ్లు, వేరియంట్లు మరియు ధరల శ్రేణి క్రింది పట్టికలో...
| Product | Price (ex-showroom) | Trim |
| Volkswagen Polo 1.0l MPI 6 MT | INR 5.82 – 7.80 Lakh | TL, CL & HL+ |
| Volkswagen Polo 1.0l TSI 6 MT & 6 AT | INR 8.02 – 9.59 Lakh | HL+ & GT |
| Volkswagen Vento 1.0L TSI 6 MT | INR 8.86 – 11.99 Lakh | TL, CL, HL & HL+ |
| Volkswagen Vento 1.0L TSI 6 AT | INR 12.09 – 13.29 Lakh | HL & HL+ |

వోక్స్‌వ్యాగన్ ఎంట్రీ లెవల్ మోడల్ పోలో మరియు వెంటో సెడాన్ కార్లలో సరికొత్త బీఎస్6 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ పరిచయం చేశారు. చెప్పుకోడానికి చిన్న ఇంజన్ అయినప్పటికీ అత్యుత్తమ మైలేజ్ మరియు ఈ సెగ్మెంట్లోనే అత్యంత శక్తివంతమైన ఇంజన్‌గా నిలిచింది.

1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు టీఎస్ఐ మరియు ఎంపీఐ రెండు టెక్నాలజీలతో లభిస్తోంది. దీనిని వోక్స్‌వ్యాగన్ EA211 ఫ్యామిలీలో భాగంగా తీసుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి 110బిహెచ్‌పి పవర్ మరియు 175ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 1.0-లీటర్ ఇంజన్‌ను ప్రవేశపెట్టారు.

స్టాండర్డ్ వేరియంట్లలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అదే విధంగా, పోలో మరియు వెంటో కార్లలోని హై-ఎండ్ వేరియంట్లలో న్యూ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించారు, ఇది మునుపటి మోడళ్లలో ఉన్నటువంటి 7-స్పీడ్ డీఎస్‌జీ గేర్‌బాక్స్ స్థానాన్ని భర్తీ చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ కథనం మేరకు, సరికొత్త 1.0-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్, అత్యధిక డ్రైవబిలిటీ, బెటర్ పర్ఫామెన్స్ మరియు మెరుగైన మైలేజ్ ఇస్తుంది. ఫ్యూచర్ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మార్కెట్లో ఎక్కువ కాలం మన్నుతుందని వోక్స్‌వ్యాగన్ పేర్కొంది.

వోక్స్‌వ్యాగన్ వెంటో మరియు పోలో రెండు కార్లు కూడా మునుపటిలాగే, ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌లైన్, హైలైన్ మరియు హైలైన్ ప్లస్ అనే విభిన్న వేరియంట్లలో యధావిధిగా లభిస్తుంది. బీఎస్6 ప్రమాణాలతో వచ్చిన వోక్స్‌వ్యాగన్ పోలో మోడల్‌లో జీటీ-లైన్ అనే హైఎండ్ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వోక్స్‌వ్యాగన్ ఇండియా, ఎట్టకేలకు తమ బెస్ట్ సెల్లింగ్ మరియు ఎంట్రీ లెవల్ మోడళ్ల పోలో మరియు వెంటో కార్లను బీఎస్6 వెర్షన్‌లో లాంచ్ చేసింది. ఇందులో వచ్చిన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు పోలో జీటీ-లైన్ న్యూ వేరియంట్ ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ధరలు కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ, మునుపటి మోడళ్లతో పోలిస్తే లేటెస్ట్ అప్‌డేట్స్ వీటిలో వచ్చాయి.


Click it and Unblock the Notifications








