ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో టిఎస్ఐ మోడళ్లు డిస్‌కంటిన్యూ కాలేదు - డిటేల్స్
ఫోక్స్‌వ్యాగన్ కార్స్ ఇండియా గచచిన మే 2020లో టిఎస్ఐ ఎడిషన్ పోలో మరియు వెంటో మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడళ్లను విడుదల చేసిన 45 రోజులకే కంపెనీ వీటిని వెబ్‌సైట్ నుండి తొలగించడంపై ఇటీవలి కథనంలో మనం తెలుసుకున్నాం.

తాజాగా, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నుంచి రిపోర్ట్స్ ప్రకారం, ఈ రెండు మోడళ్లను డిస్కంటిన్యూ చేయలేదని మరియు ఫ్యూచర్ కస్టమర్లు ఇప్పటికీ బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మరియు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల ద్వారా ఈ స్పెషల్ ఎడిషన్ కార్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొన్నట్లు సమాచారం.

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ కొత్త పోలో టిఎస్ఐ మరియు వెంటో టిఎస్ఐ ఎడిషన్లను వరుసగా రూ.7.89 లక్షలు మరియు రూ.10.99 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఈ రెండు టిఎస్ఐ ఎడిషన్లను హైలైన్ ప్లస్ వేరియంట్ ఆధారంగా తయారు చేశారు.

టిఎస్ఐ ఎడిషన్లకు మరియు రెగ్యులర్ వెర్షన్‌లకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, టిఎస్ఐ ఎడిషన్లకు హనీకోంబ్ గ్రిల్, బాడీ సైడ్ గ్రాఫిక్స్, ప్యాసింజర్ డోర్స్‌పై టిఎస్ఐ బ్యాడ్జ్, బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్, గ్లాసీ బ్లాక్ రూఫ్ మరియు స్పాయిలర్ వంటి మార్పులు ఉన్నాయి.

యాంత్రికంగా, రెండు మోడళ్లలో ఎలాంటి మార్పులు లేవు. వీటిలో అప్‌గ్రేడ్ చేసిన 1.0 లీటర్ టిఎస్ఐ బిఎస్6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో మోడళ్లలోని ఈ 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసింది. ఇది కొత్త సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఫోక్స్‌వ్యాగన్ పోలో లీటరుకు 18.24 కి.మీ మైలేజీని మరియు ఫోక్స్‌వ్యాగన్ వెంటో లీటరుకు 17.69 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ రెండు మోడళ్లలో కూడా ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ పోలోలో హైలైట్ చేయబడిన కొన్ని ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు వాయిస్ కమాండ్ ఫీచర్లను సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

ఇందులో క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షన్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్-టోన్ ఇంటీరియర్స్, ఏబిఎస్, పలు ఎయిర్‌బ్యాగులు, డే అండ్ నైట్ ఇంటర్నల్ రియర్‌వ్యూ మిర్రర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఇకపోతే ఫోక్స్‌వ్యాగన్ వెంటో కారులో పైన పేర్కొన్న పోలో కారులోని ఇతర ఫీచర్లతో పాటుగా ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి టెయిల్ లైట్లు, క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్ మరియు రియర్ ఏసి వెంట్స్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో టిఎస్ఐ మోడళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో మోడళ్లు వరుసగా బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ కార్లు. ఈ లిమిటెడ్ ఎడిషన్ టిఎస్ఐ మోడళ్లకు కంపెనీ స్పెషల్ టచ్ ఇచ్చేందుకు ఇందులో కొద్దిగా మార్పులు చేర్పులు చేసింది. కంపెనీ ప్రకారం ఈ మోడళ్లకు భారత వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది. ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్ మంచి మైలేజీని, పనితీరును ప్రదర్శిస్తుంది.


Click it and Unblock the Notifications








