వోక్స్ వ్యాగన్ యొక్క కొత్త బ్రాండ్ టి-రాక్ లాంచ్ ఎప్పుడంటే.. ?
జర్మన్ ఆటో మొబైల్ తయారీదారు అయిన వోక్స్ వ్యాగన్ తన బ్రాండ్ టి-రాక్ ఎస్‌యువిని మార్చి 18 న భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వోక్స్ వ్యాగన్ యొక్క కొత్త టి-రాక్ ఎస్‌యువి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న వోక్స్ వ్యాగన్ టి-రాక్ ఎస్‌యువి కోసం బూకిన్స్ ప్రారంభించింది. ఈ ఎస్‌యువి కారాండ్‌బైక్ ప్రకారం ఇప్పటికే 300 యూనిట్లకు పైగా బూకిన్స్ నమోదు చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

వోక్స్ వ్యాగన్ లో ఎల్ఇడి లైటింగ్, లెదర్ అప్హోల్స్టరీ మరియు పుల్లీ డిజిటల్ కాక్పిట్ ఉన్నాయి. కొత్త ఎస్‌యువిలో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇఎస్‌పి, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ మరియు మోటారు స్లిప్ రెగ్యులేషన్ టెక్ వాకాటి భద్రతకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి.

కొత్త వోక్స్ వ్యాగన్ టి-రాక్ 1.5 లీటర్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 147 బ్రేక్ హార్స్‌పవర్ మరియు 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు మాత్రమే జతచేయబడి ఉంటుంది.

ఇంజిన్ ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ, డ్రైవింగ్ కండిషన్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్, మరియు సిటీ డ్రైవింగ్ వంటి నాలుగు సిలిండర్లలో రెండు మూసివేయడానికి కారును అనుమతిస్తుంది.

పూర్తి శక్తి అవసరమైనప్పుడు యాక్సిలరేటర్‌పై అడుగు పెట్టాలి. ఇంజిన్ సజావుగా నాలుగు సిలిండర్ల సామర్థ్యానికి మారుతుంది మరియు అధిగమించడం మరియు హైవే డ్రైవింగ్ వంటి పరిస్థితులలో అవసరమైనప్పుడు ఇది అదనపు శక్తిని అందిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో వోక్స్ వ్యాగన్ టి-రాక్ ఆరు కలర్ అప్షన్లతో లభిస్తుంది. అవి వరుసగా డీప్ బ్లాక్ పెర్ల్, బ్లాక్ విత్ కర్కుమా ఎల్లో, ఎనర్జిటిక్ ఆరెంజ్ విత్ బ్లాక్, ప్యూర్ వైట్ విత్ బ్లాక్, రావెన్న బ్లూ విత్ బ్లాక్, మరియు ఇండియమ్ గ్రే విత్ బ్లాక్. వోక్స్ వ్యాగన్ టి-రాక్ ధర సుమారు రూ. 25 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉంటుందని ఆశించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వోక్స్ వ్యాగన్ టి-రాక్ ఇప్పటికే 300 బుకింగ్స్ స్వీకరించింది. ఈ టి-రాక్ ఎస్‌యువి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వినియోగదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఇది ఇండియన్ మార్కెట్లో విడుదలైన తరువాత ఎంజి హెక్టర్, టాటా హారియర్, హ్యుందాయ్ టక్సన్ మరియు జీప్ కంపాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








