విండో టింట్, IND నంబర్ ప్లేట్ గందరగోళాన్ని క్లియర్ చేసిన సర్కార్

భారతదేశంలో ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి వాహనదారులు అనేక గందరగోళాలను కలిగి ఉన్నారు, ముఖ్యంగా నాలుగు చక్రాల వాహనాల్లో అనుమతించే విండోస్ టింట్ శాతం గురించి ఇంకా చాలా మంది మోటారిస్టులకు పూర్తి అవగాహన లేదు. మరోవైపు, దేశంలో IND నంబర్ ప్లేట్ తప్పనిసరి చేయబడిందా లేదా అని కూడా వాహనదారులు అయోమయంలో ఉన్నారు.

విండో టింట్, IND నంబర్ ప్లేట్ గందరగోళాన్ని క్లియర్ చేసిన సర్కార్

ఈ రెండు ప్రశ్నలకు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ సమాధానం ఇచ్చారు. #AskCPBlr అని పిలువబడే ట్విట్టర్లో ఆయన ఇటీవల నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆన్‌లైన్ ప్రశ్నోత్తరాల సెషన్‌లో, పంత్ ఈ రెండు ట్రాఫిక్ నిబంధనల చుట్టూ నగరంలోని వాహనదారుల్లో నెలకొన్న పెద్ద గందరగోళాన్ని తొలగించారు.

విండో టింట్, IND నంబర్ ప్లేట్ గందరగోళాన్ని క్లియర్ చేసిన సర్కార్

ఒక వాహనదారుడు అడిగిన ప్రశ్నలలో ఒకటి "బెంగళూరులో అనుమతించబడిన సన్ ఫిల్మ్ (కార్లపై) దృశ్యమానత శాతం (విజిబిలిటీ పర్సెంటేజ్) ఏమిటి?" అని. దీనికి బెంగుళూరు నగర పోలీసు కమిషనర్ స్పందిస్తూ "సైడ్ గ్లాసెస్ కోసం 50 శాతం విజిబిలిటీ తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయంలో ఎవరైనా లంచం కోరితే, ఆ సంఘటనకి సంబంధిచిన అధికారి పేరు/ర్యాంక్, స్థలం మరియు సమయం వంటి వివరాలను వాట్సాప్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా 9480801000 నెంబర్‌కు తెలియజేయడం లేదా 100కి కాల్ చేసి వివరించాలని" చెప్పారు.

MOST READ:ఏనుగులను రక్షించడానికి ట్రైన్ ఆపేసిన లోకో పైలెట్; ఎక్కడో తెలుసా ?

విండో టింట్, IND నంబర్ ప్లేట్ గందరగోళాన్ని క్లియర్ చేసిన సర్కార్

ఈ ప్రత్యేకమైన ట్వీట్ తరువాత, ఒకే పోస్ట్‌లో కొన్ని ఫాలో అప్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఈ నియమం సన్ ఫిల్స్‌కు వర్తిస్తుందా లేదా ఫ్యాక్టరీ అమర్చిన యువి ప్రూఫ్ టింటెడ్ గ్లాస్‌కు వర్తిస్తుందా అని ఉంది.

విండో టింట్, IND నంబర్ ప్లేట్ గందరగోళాన్ని క్లియర్ చేసిన సర్కార్

ఈ ప్రశ్నకు పోలీసు కమిషనర్ నుండి ఇంకా ఎటువంటి సమాధానం రానప్పటికీ, ప్రతి మోటారు వాహనం యొక్క విండ్‌స్క్రీన్ మరియు వెనుక విండో 70 శాతం విజువల్ ట్రాన్స్మిషన్ లైట్‌ను అనుమతించాల్సిన అవసరం ఉందని మోటార్ వాహన చట్టం చెబుతోంది. అలాగే, ఈ చట్టం ప్రకారం, సైడ్ విండోస్ కూడా 50 శాతం విజువల్ ట్రాన్స్మిషన్ లైట్‌ను అనుమతించే ఫిల్మ్స్ లేదా టింటెడ్ గ్లాస్‌ను కలిగి ఉండాలి.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

విండో టింట్, IND నంబర్ ప్లేట్ గందరగోళాన్ని క్లియర్ చేసిన సర్కార్

మోటారు వాహనాల చట్టం 1989 ప్రకారం, అనుమతించదగిన పరిమితికి మించి దృష్టిని పరిమితం చేసే విండ్‌షీల్డ్స్ మరియు వాహనాల కిటికీలపై టింటెడ్ గ్లాస్ లేదా సన్ ఫిల్మ్‌లను ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు 2012లో నిషేధించింది. దేశవ్యాప్తంగా నాలుగు చక్రాల వాహనాల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనే కారణంతో సుప్రీం కోర్డు నాలుగు చక్రాల వాహనాలకు డార్క్ టింట్ వాడకాన్ని నిషేధించింది.

విండో టింట్, IND నంబర్ ప్లేట్ గందరగోళాన్ని క్లియర్ చేసిన సర్కార్

దేశవ్యాప్తంగా బెంగుళూరు మరియు భారతీయ వాహనదారులలో IND నంబర్ ప్లేట్ వాడకానికి సంబంధించి కూడా గందరగోళం నెలకొని ఉంది. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక వాహనదారుడు నగరంలో IND నంబర్ ప్లేట్ తప్పనిసరి కాదా అనే ప్రశ్న అడుగుతూ ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు. దీనికి పంత్ స్పందిస్తూ "IND తప్పనిసరి కాదు, అందువల్ల మీకు జరిమానా విధించబడదు." అని సమాధానమిచ్చారు.

MOST READ:కిడ్నీ తరలించడానికి లంబోర్ఘిని కారు ఉపయోగించిన పోలీసులు.. ఎక్కడో తెలుసా?

విండో టింట్, IND నంబర్ ప్లేట్ గందరగోళాన్ని క్లియర్ చేసిన సర్కార్

వాహనదారులు నగరంలో తమ వాహనం కోసం IND నంబర్ ప్లేట్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఫలితంగా, వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించరు. ఒకవేళ, IND ప్లేట్ ఉపయోగించనందుకు ఎవరికైనా జరిమానా విధించబడితే, సంబంధిత అధికారిపై తదుపరి చర్యల కోసం వాహనదారుడు వాట్సాప్‌లో ఆ సంఘటనను నివేదించి ఫిర్యాదు చేయవచ్చు.

విండో టింట్, IND నంబర్ ప్లేట్ గందరగోళాన్ని క్లియర్ చేసిన సర్కార్

విండో టింట్ మరియు IND నంబర్ ప్లేట్ క్లారిఫికేషన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

విండో టింట్ మరియు IND నంబర్ ప్లేట్ విషయంలో వాహనదారులకు సరైన అవగాహన లేక గరిష్ట సంఖ్యలో జరిమానాలను చెల్లిస్తున్నారు. చాలా సందర్భాల్లో, ట్రాఫిక్ నిబంధనలలోని గందరగోళం కారణంగా వాహనదారులకు జరిమానా విధించబడుతుంది. ఈ నేపథ్యంలో, పోలీసు కమిషనర్ నుండి ఈ రెండు ప్రశ్నలకు వచ్చిన సమాధానాలతో వీటి విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది.

MOST READ:చేయని తప్పుకు అమాయక వ్యక్తిని నడిరోడ్డులో చితకబాదిన పోలీస్ [వీడియో]

Most Read Articles

English summary
Indian motorists have several confusions with the traffic rules, especially with the percentage of window tint that is allowed in a four-wheeler. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X