వెనుక సీటులో ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్; ప్రపంచంలోనే మొట్టమొదటసారి

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, వెనుక వరుస సీట్లలో కూర్చునే ప్రయాణీకుల భద్రత కోసం ఓ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకుల భద్రత కోసం ఇప్పటి వరకూ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి, ఇకపై వారికి కూడా ముందు వరుసలోని డ్రైవర్, కో-ప్యాసింజర్ మాదిరిగానే పూర్తి కవరేజ్‌ని అందించేలా అధునాతన ఎయిర్‌బ్యాగ్స్‌‌ను తయారు చేసింది మెర్సిడెస్ బెంజ్.

వెనుక సీటులో ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్; ప్రపంచంలోనే మొట్టమొదటసారి

మెర్సిడెస్ బెంజ్ త్వరలో విడుదల చేయబోయే సరికొత్త 2021 ఎస్-క్లాస్ మోడల్‌లో ఈ టెక్నాలజీని పరిచయం చేయనున్నారు. ప్రపంచంలోనే ఈ తరహా సేఫ్టీ టెక్నాలజీ కలిగిన మొట్టమొదటి వాహనంగా తమ సరికొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ నిలుస్తుందని కంపెనీ తెలిపింది.

వెనుక సీటులో ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్; ప్రపంచంలోనే మొట్టమొదటసారి

సెప్టెంబర్ 2, 2020వ తేదీన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కారును కంపెనీ అధికారికంగా ఆవిష్కరించనుంది. కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌లోని వెనుక సీట్లలో ఏర్పాటు చేసిన కొత్త ఎయిర్‌బ్యాగులు ఫ్రంటల్ కొల్లైజన్ జరిగినప్పుడు వెనుక సీట్ల యజమానులను రక్షించడానికి రూపొందించబడ్డాయి. చైల్డ్ సీట్లు, ఆప్షనల్ బెల్ట్ బ్యాగ్ మరియు గాలితో కూడిన సీట్ బెల్టులు ఈ సిస్టమ్‌లో ఉంటాయి.

వెనుక సీటులో ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్; ప్రపంచంలోనే మొట్టమొదటసారి

ముందు వరుసలో డ్రైవర్, కో-ప్యాసింజర్ బ్యాక్‌రెస్ట్‌లలో ఈ రియర్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్ అమర్చబడి ఉండేలా మెర్సిడెస్ బెంజ్ వీటిని డిజైన్ చేసింది. వెనుక సీటు ఎయిర్‌బ్యాగులు U ఆకారాన్ని కలిగి ఉండేలా రూపొందించబడ్డాయి, ఇది కారులోని ప్రయాణీకులను మరింత సమర్థవంతంగా రక్షించడంలో సహాయపడుతాయని కంపెనీ చెబుతోంది.

వెనుక సీటులో ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్; ప్రపంచంలోనే మొట్టమొదటసారి

మెర్సిడెస్ బెంజ్ వస్తున్న ఈ కొత్త తరం ఎస్-క్లాస్, ప్రీ-సేఫ్ ఇంపల్స్ సైడ్ ఫంక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది, ఇది రాడార్ టెక్నాలజీని ఉపయోగించుకొని, సైడ్ ఇంపాక్ట్‌లను గుర్తించి ప్రయాణీకులను రక్షించడంలో సహకరిస్తుంది.

వెనుక సీటులో ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్; ప్రపంచంలోనే మొట్టమొదటసారి

ఒకవేల కారు పక్క వైపు నుంచి ప్రమాదం సంభవించినట్లయితే, ఈ సిస్టమ్ సీట్లలో అమర్చిన ఎయిర్ కుషన్లను విచ్చుకునేలా చేసి, ప్రయాణీకులను కారు మద్య సీటులోకి వచ్చేలా వత్తిడి తీసుకువస్తుంది. ఈ సిస్టమ్‌లో ఈ-యాక్టివ్ బాడీ కంట్రోల్ టెక్నాలజీని కూడా ఉంటుంది, ఇది వాహనం దిగువ భాగాన జరిగే ప్రమాదాన్ని తట్టుకునేందుకు వాహనం యొక్క ఎత్తును పెంచడంలో సహకరిస్తుంది.

వెనుక సీటులో ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్; ప్రపంచంలోనే మొట్టమొదటసారి

మెర్సిడెస్ బెంజ్ గడచిన 50 ఏళ్లుగా ప్రయాణీకుల భద్రతపై చేస్తున్న పరిశోధనలో భాగంగా ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. నిజ జీవిత భద్రత చట్టపరమైన భద్రతా అవసరాలకు మించినదని కంపెనీ చెబుతోంది.

వెనుక సీటులో ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్; ప్రపంచంలోనే మొట్టమొదటసారి

మెర్సిడెస్ బెంజ్ ఇటీవలే తమ సరికొత్త 2021 ఎస్-క్లాస్ ఇంటీరియర్‌లలో చేసిన కొన్ని కీలక మార్పులను కూడా వెల్లడించింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినది 3డి నావిగేషన్ మ్యాప్స్ మరియు దాని ఎమ్‌బియూఎక్స్ సిస్టమ్, ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీని కలిగి ఉంటుంది.

వెనుక సీటులో ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్; ప్రపంచంలోనే మొట్టమొదటసారి

కొత్త ఎస్-క్లాస్ మొత్తం ఐదు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లతో వస్తుంది. ఇందులో ముందు భాగంలో రెండు స్క్రీన్లు, మరియు వెనుక భాగంలో ప్యాసింజర్ల కోసం మూడు, 12.8 ఇంచ్ ఓఎల్ఈడి టచ్‌స్క్రీన్ సిస్టమ్స్ ఉంటాయి, ఇవి మెయిన్ స్క్రీన్‌కు అనుసంధానించబడి ఉంటాయి.

వెనుక సీటులో ప్యాసింజర్లకు ఎయిర్‌బ్యాగ్; ప్రపంచంలోనే మొట్టమొదటసారి

మెర్సిడెస్ బెంజ్ కొత్త రియర్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఇప్పటివరకు లేని అత్యంత ఫీచర్ అండే సేఫ్టీ లోడెడ్ కార్లలో ఒకటిగా మారనుంది. సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేయటంలో ఈ బ్రాండ్‌కు సాటి మరొకటి లేదనే చెప్పాలి. మెర్సిడెస్ బెంజ్ తాజాగా పరిచయం చేసిన ప్రపంచపు మొట్టమొదటి రియర్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 29, 2020, 12:20 [IST]
English summary
German luxury vehicle manufacturer Mercedes-Benz has confirmed that its soon-to-be-launched 2021 S-Class model will feature airbags in order to protect rear seat occupants, making it the first vehicle in the world to feature airbags for rear seat passengers. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+