ఇది 16 ఏళ్ల పాత హ్యుందాయ్ శాంత్రో కారు అంటే నమ్మగలరా?

హ్యుందాయ్ శాంత్రో కారు గురించి వాహన ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్మాల్ కార్ సెగ్మెంట్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన శాంత్రో, కొంత కాలం క్రితం నిలిపివేయబడి, తిరిగి 2018లో మార్కెట్లోకి పునఃప్రవేశించిన సంగతి తెలిసినదే.

ఇది 16 ఏళ్ల పాత హ్యుందాయ్ శాంత్రో కారు అంటే నమ్మగలరా?

అయితే, పాతకాలపు హ్యుందాయ్ శాంత్రోకి మార్కెట్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మధ్యతరగతి ప్రజల కారుగా నిలిచిన ఈ కారుతో సదరు కారు యజమానులకు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. అలాంటి ఓ పాత హ్యుందాయ్ శాంత్రో కారును ఓ యజమానికి సరికొత్తగా మార్చారు.

ఇది 16 ఏళ్ల పాత హ్యుందాయ్ శాంత్రో కారు అంటే నమ్మగలరా?

సుమారు 16 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ పాత హ్యుందాయ్ శాంత్రో జింగ్ మోడల్‌ను పూర్తిగా రీస్టోర్ చేశారు. ప్రస్తుతం శాంత్రో జింగ్ మోడల్ మార్కెట్లో అమ్మకానికి లేదు. అయినప్పటికీ, ఈ కార్ ప్రియుడు తన శాంత్రో జింగ్ కారును తాను కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండేలా కస్టమైజ్ చేయించుకున్నాడు.

MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

బ్రోటోమోటివ్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, ఇందులో సదరు హ్యుందాయ్ శాంత్రో జింగ్ కారు మెకానిక్ షాపుకు రాక మునుపు మరియు వచ్చిన తర్వాత ఎలా ఉందో చూడొచ్చు. ఈ కారు ఫుల్ రీస్టోరేషన్ తర్వాత, దాని అవుట్‌పుట్ చూస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.

చిత్ర సౌజన్యం: BROTOMOTIV

ఇది 16 ఏళ్ల పాత హ్యుందాయ్ శాంత్రో కారు అంటే నమ్మగలరా?

ఈ పాత హ్యుందాయ్ శాంత్రో జింగ్ కారుకి 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ, ఇది పెద్దగా డ్యామేజ్ కాలేదు. అంతేకాకుండా ఈ కారుకి ఎలాంటి మేజర్ యాక్సిడెంట్స్ కూడా జరగలేదు. రెగ్యులర్ వేర్ అండ్ టేర్, రస్ట్ మినహా ఈ కారు మంచి కండిషన్‌లోనే ఉంది. అందుకే, దీనిని ఫ్యాక్టరీ కండిషన్‌లోకి రీస్టోర్ చేయటం సులువైంది.

MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

ఇది 16 ఏళ్ల పాత హ్యుందాయ్ శాంత్రో కారు అంటే నమ్మగలరా?

హ్యుందాయ్ శాంత్రో జింగ్ రీస్టోరేషన్ ప్రక్రియలో కారుపై ఉండే పెయింట్‌ను పూర్తిగా తొలగించి డెంట్స్ మరియు డింగ్స్‌ను పూడ్చి కొత్తగా రీపెయింట్ చేశారు. ఈ రీపెయిటింగ్ ప్రక్రియలో అవసరమైన చోట టింకరింగ్ చేశారు. తుప్పు పట్టిన భాగాలను తొలగించడం లేదా తిరిగి వెల్డింగ్ చేయటం చేశారు.

ఇది 16 ఏళ్ల పాత హ్యుందాయ్ శాంత్రో కారు అంటే నమ్మగలరా?

ఈ కారులోని ఇంజన్ ప్రాంతంలో కొన్ని చోట్ల వైరింగ్‌ను పూర్తిగా మార్చారు. అక్కడ కూడా తుప్పు పట్టిన భాగాలను కొత్త భాగాలతో భర్తీ చేశారు. కారు యొక్క హెడ్‌లైట్స్ మరియు టెయిల్ లైట్లను కూడా రీపాలిష్ చేశారు. మొత్తంగా ఈ కారు రీస్టోరేషన్ ప్రక్రియలో సదరు మెకానిక్ పనితీరు గొప్పగా ఉంది. ఈ కారు చూడటానికి పూర్తిగా కొత్తదానిలా అనిపిస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

ఇది 16 ఏళ్ల పాత హ్యుందాయ్ శాంత్రో కారు అంటే నమ్మగలరా?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హ్యుందాయ్ శాంత్రో హ్యాచ్‌బ్యాక్ కారులో 1.1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 68 బిహెచ్‌పి పవర్‌ను మరియు 99 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‍‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
16 Year Old Hyundai Santro Xing Beautifully Restored. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X