సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

ఆఫ్ రోడ్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న Force Motors యొక్క Force Gurkha ఇటీవల దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడింది. అయితే కంపెనీ ఈ కొత్త Force Gurkha SUV ని 2021 సెప్టెంబర్ 27 న అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది.

సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

Force Motors ఇప్పుడు Force Gurkha యొక్క TVC వీడియో విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ వీడియోలో Gurkha యొక్క బయటి మరియు లోపలి భాగాలు చూడవచ్చు. ఈ వీడియో అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. మీరు ఈ వీడియోలో కొత్త Gurkha ను గమనించినట్లయితే మునుపటి మోడల్ కి మరియు కొత్త మోడల్ కి పెద్దగా మార్పు లేదని గ్రహించవచ్చు.

సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

2021 Force Gurkha యొక్క బాడీ షెల్ కొత్తగా ఉంది, కానీ ఇది పాత మోడల్‌తో సమానంగా ఉంటుంది. అయితే ఈ కొత్త Force Gurkha ను మరింత అప్డేటెడ్ గా గుర్తించడానికి అనేక కాస్మెటిక్ అప్డేట్స్ చేసింది. ఇందులో భాగంగానే ఫ్రంట్ గ్రిల్ రీడిజైన్ చేయబడింది, అంతే కాకుండా ఫోర్స్ లోగోకు బదులుగా గుర్ఖా పేరు వ్రాయబడింది.

సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

కంపెనీ 2021 Force Gurkha లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్‌ను ఉపయోగించింది, దాని చుట్టూ డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటి చుక్కల రింగ్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసింది. ఇది చూడటానికి కొత్తగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ SUV యొక్క బంపర్‌కు కూడా కొత్త డిజైన్ ఇవ్వబడింది.

సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

ఇక Gurkha యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది 16 ఇంచెస్ స్టీల్ వీల్స్, బ్లాక్ ORVM లు, బ్లాక్ రూఫ్ రైల్స్, ఫంక్షనల్ రాక్‌లు మరియు టర్న్ ఇండికేటర్‌లను పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 4x4x4 బ్యాడ్జింగ్ కూడా చూడవచ్చు. ఇవి వాహనాన్ని చాలా దూకుడుగా చూపిస్తాయి.

సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

ఇక కొత్త 2021 Gurkha యొక్క రియర్ ఫ్రొఫైల్ విషయానికి వస్తే, వెనుక భాగంలో విండోస్ పెద్దవిగా ఉంటాయి. ఈ TVC వీడియోలో రూఫ్ రాక్ కూడా కనిపిస్తుంది, అయితే ఇది కారుతో ప్రామాణికంగా ఉంటుందా.. లేదా అనుబంధంగా ఉంటుందా అనే విషయం ఖచ్చితంగా తెలియదు.

సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

దీనితో పాటు, వెనుక భాగంలో టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ మరియు రీడిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్స్ చూడవచ్చు. ఇది కాకుండా, కంపెనీ దాని లోపలి భాగంలో క్యాబిన్‌ను కూడా బాగా మెరుగుపరిచింది. ఇది ప్లాస్టిక్ మెటీరియల్‌తో బ్లాక్ క్యాబిన్‌ను పొందుతుంది, ఇందులో ఇప్పుడు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఉంటుంది. వీడియాలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

కొత్త 2021 Force Gurkha యొక్క స్టీరింగ్ వీల్ కూడా అడ్జస్టబుల్ చేయగల త్రీ స్పోక్ యూనిట్‌కి అప్‌గ్రేడ్ చేయబడింది. తక్కువ ఎన్‌విహెచ్ స్థాయికి మరియు ఆఫ్-రోడ్ డ్రైవ్ తర్వాత వెహికల్ మురికిగా ఉంటే శుభ్రపరిచే సౌలభ్యం కోసం ఫ్లోర్ మ్యాట్‌లు అందించబడతాయి.

సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

Force Gurkha కొలతల విషయానికి వస్తే, ఇది 4,116 మి.మీ పొడవు, 1,812 మి.మీ వెడల్పు, 2,075 మి.మీ ఎత్తు, 2,400 మి.మీ వీల్‌బేస్ మరియు 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. కావున ఆఫ్ రోడింగ్ చేయడానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది.

సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

2021 Force Gurkha యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.6-లీటర్ ఫోర్-సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ అనుసంధానించబడింది. ఇందులోని ఇంజిన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ మహీంద్రా థార్ కంటే తక్కువ శక్తివంతమైనది. మహీంద్రా థార్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2021 Gurkha లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఏబీఎస్ విత్ ఈబిడి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహనదారుని భద్రతను నిర్ధరిస్తాయి.

సెప్టెంబర్ 27 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న 2021 Force Gurkha

ఒక సంవత్సర కాలం నిరీక్షణ తరువాత కంపెనీ 2021 Force Gurkha ఆఫ్-రోడ్ SUVని ఆవిష్కరించింది. ఇది దేశీయ మార్కెట్లో Mahindra Thar మరియు Maruti Suzuki Jimny వాటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. Force Gurkha ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ధర కంపెనీ ఈ SUV ని విడుదల చేసే సమయంలో ప్రకటిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 18, 2021, 14:22 [IST]
English summary
2021 force gurkha suv first tvc released launch on 27 september details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+