దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors; ధర & వివరాలు

సౌత్ కొరియా బ్రాండ్ అయిన 'Kia Motors' భారతీయ మార్కెట్లో కొత్త '2021 Kia Carnival MPV' ని విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన '2021 Kia Carnival MPV' ధర రూ. 24.95 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ కొత్త MPV కొత్త ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త కారు గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors

Kia India (కియా ఇండియా) కొత్త Kia Carnival MPV ని మొత్తం 6 వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో ప్రీమియం, ప్రెస్టీజ్, లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ అనే నాలుగు ట్రిమ్‌లు ఉన్నాయి. కంపెనీ ఈ MPV ని 7-సీటర్, 8-సీటర్ మరియు 9-సీటర్ కాన్ఫిగరేషన్‌లతో మార్కెట్లో విడుదల చేసింది.

దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors
2021 Kia Carnival Price
Premium 7 Seater ₹24,95,000
Premium 8 Seater ₹25,15,000
Prestige 7 Seater ₹29,49,000
Prestige 9 Seater ₹29,95,000
Limousine 7 Seater ₹31,99,000
Limousine Plus 7 Seater ₹33,99,000
దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors

Kia Carnival MPV అప్డేటెడ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ అల్లాయ్ వీల్స్ కూడా అప్‌డేట్ చేసింది. కావున ఇందులో లార్జ్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందించబడుతుంది. కంపెనీ తన కొత్త లోగోను 2021 కార్నివాల్ MPV లో కూడా ఉపయోగించింది. ఈ లోగో ఇప్పటికే Kia Seltos మరియు Sonet లలో కూడా ఉపయోగించబడింది.

దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors

కొత్త 2021 Kia Carnival MPV లోని ప్రెస్టీజ్, లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ అనే మూడు వేరియంట్లలోనూ ప్రీమియం లెదర్ సీట్లు అందించబడ్డాయి. ఇందులో వాహన వినియోగదారులు వీఐపీ సీటింగ్‌ను కూడా ఎంచుకోవచ్చు. దీనికి లెదర్ సీట్ కవర్‌లు ఉపయోగించబడతాయి.

దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors

Kia Carnival MPV లో ఇవి మాత్రమే కాకుండా అప్డేటెడ్ 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉంటుంది. ఈ టచ్‌స్క్రీన్‌లో UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ ఇందులో ఆటో-డిమ్మింగ్ IRVM లు, సింగిల్ రియర్-సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్‌తో ఇంటీరియర్‌లను కూడా అప్‌డేట్ చేసింది.

దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors

కియా మోటార్స్ ఇప్పుడు కొత్త లిమోసిన్ ప్లస్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్‌లో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్రైవర్ సీటు కోసం 10-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్, వుడ్ గార్నిష్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో డ్యూయల్ రేర్-సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వబడింది.

దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors

Kia India యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు చీఫ్ సేల్స్ & బిజినెస్ స్ట్రాటజీ ఆఫీసర్ Mr Tae-Jin Park, ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొత్త Kia Carnival అనేది కస్టమర్లకు అన్ని అంచనాలను అధిగమించే అసాధారణమైన ఉత్పత్తి. Kia Carnival ప్రారంభించినప్పటి నుంచి భారతీయ మార్కెట్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకోగలిగింది.

దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors

భారతీయ మార్కెట్లో ఇప్పటివరకు కూడా దాదాపు 8000 యూనిట్ల Carnival MPV లను విక్రయించాము. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మేము భావిస్తున్నాము, అన్నారు.

దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors

2021 Kia Carnival MPV యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. Kia Carnival MPV ప్రస్తుతం ఉన్న 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మార్కెట్లో విడుదల చేయబడింది. ఈ ఇంజిన్ 200 బిహెచ్‌పి పవర్ మరియు 440 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 2021 Carnival లాంచ్ చేసిన Kia Motors

2021 Kia Carnival MPV (కియా కార్నివాల్) కి భారతీయ మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే టయోటా ఇన్నోవా క్రిస్టా ధర కియా కార్నివాల్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ టాప్-ఎండ్ వేరియంట్ కియా కార్నివాల్ యొక్క బేస్ వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 16, 2021, 18:48 [IST]
English summary
2021 kia carnival mpv launched in india at rs 24 95 lakhs details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+