సూపర్ ఫెర్ఫామెన్స్ అందించే కొత్త Tata Tigor EV ఇప్పుడు భారత్‌లో.. త్వరపడండి
భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన Tata Motors ఎట్టకేలకు కొత్త Tata Tigor EV ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త Tata Tigor EV ధర ఇండియన్ మార్కెట్లో రూ. 11.99 లక్షలు. ఈ కొత్త కారు ఇప్పుడు కొత్త బ్యాటరీ ప్యాక్‌తో జిప్‌ట్రాన్ టెక్నాలజీతో తీసుకురాబడింది. ఈ కారణంగా దీని పరిధి ఇప్పుడు దాదాపు 306 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
అంతే కాకుండా కొత్త Tata Tigor EV అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలు కలిగి ఉంటుంది. ఈ కొత్త ఈవి గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

దేశీయ మార్కెట్లో Tata Motors కంపెనీ ఈ కొత్త Tata Tigor EV కోసం బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. కొనుగ్గోలుచేయాలనుకునే కస్టమర్లు రూ. 21,000 అడ్వాన్స్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. త్వరలో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు యొక్క డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కొత్త Tata Tigor EV టీల్ బ్లూ, డేటోనా గ్రే అనే రెండు కలర్ అప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Tata Tigor EV మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి XE, XM మరియు XZ+ వేరియంట్లు. వీటి ధరల విషయానికి వస్తే, Tata Tigor EV యొక్క XE ధర రూ. 11.99 లక్షలు, XM ధర రూ. 12.49 లక్షలు కాగా XZ+ వేరియంట్ ధర రూ. 12.99 లక్షల వరకు ఉంటుంది.
| Tigor EV | Price |
| XE | ₹11,99,000 |
| XM | ₹12,49,000 |
| XZ+ | ₹12,99,000 |

కొత్త Tata Tigor EV యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో కొత్త ట్రై-యారో నమూనా, బ్లూ కలర్ స్లేట్ మరియు ఈవి బ్యాడ్జ్‌లు చాలా చోట్ల ఇవ్వబడ్డాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు దాని స్టాండర్డ్ మోడల్ కి చాలా భిన్నంగా ఉంటుంది. ఇంద్దులో ప్రొజెక్టర్ హెడ్‌లైట్, ఫాగ్ లైట్లు, ఎల్ఈడీ డిఆర్ఎల్ లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు బ్లూ యాక్సెంట్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

Tata Tigor EV ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ కారు కావున, దీనిని స్పష్టంగా తెలియజేయడానికి లోపలి భాగంలో చాలా చోట్ల బ్లూ యాక్సెంట్స్ ఉపయోగించబడ్డాయి. అంతే కాకుండా డోర్ హ్యాండిల్స్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్యానెల్‌లు మరియు కారు సీట్లపై కూడా బ్లూ యాక్సెంట్స్ ఇవ్వబడ్డాయి.

కొత్త Tata Tigor EV ఇప్పుడు అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. కావున మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఇది 306 కిమీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. Tata Tigor EV యొక్క మునుపటి మోడల్ ఇంతకూ ముందు ఒక చార్జితో 90 నుండి 100 కిమీ పరిధిని అందించేది. కానీ ఇప్పుడు ఇందులో ప్రవేశపెట్టిన, జిప్‌ట్రాన్ టెక్నాలజీ కారణంగా ఏకంగా దీని పరిధి 306 కిమీ వరకు పెరిగింది.

Tata Tigor ఎలెక్ట్రిక్ కార్ IP67 రేటింగ్ కలిగిన 26 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 55 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది. Tata Tigor యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది 15 amp హోమ్ సాకెట్ ద్వారా ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 8.5 గంటలు సమయం పడుతుంది.

అదే సమయంలో ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో, కేవలం 1 గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కొత్త Tata Tigor ఎలక్ట్రిక్ కారు యొక్క బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్ కు కంపెనీ 8 సంవత్సరాల లేదా 1,60,000 కిమీ వారంటీని అందిస్తుంది. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Tata Tigor ఈవి పూర్తిగా జలనిరోధితమైనవి (వాటర్‌ప్రూఫ్)గా ఉంటాయి. కావున వర్షాకాలంలో ఈ ఎలక్ట్రిక్ కారును నడపడం పెద్ద సమస్యగా ఉండదు. ఇది 74 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అంతే కాకుండా ఈ కారు కేవలం 5.7 సెకన్లలో 0 నుండి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

కొత్త Tata Tigor EV యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబిడి, డ్యూయల్-వీల్ డిస్క్ బ్రేక్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్క్ అసిస్ట్, హిల్ యాసెంట్ అసిస్ట్, హిల్ డీసెంట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు రియర్ పార్కింగ్ కెమెరాతో పాటు ఇంకా చాలా ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

Tata Tigor ఎలెక్ట్రిక్ కారు ఐఆర్ఏ కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా 30 కి పైగా కనెక్టెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. Tata Tigor EV విడుదలతో Tata Motors తన పరిధిని మరింత విస్తరించడానికి చూస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా నిరంతరం విస్తరిస్తోంది. అయితే దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకి కస్టమర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








