రీఫిల్లింగ్ చేయకుండా 1,359 కిమీ ప్రయాణించి 'గిన్నిస్ రికార్డ్' పొందిన Toyota Mirai: వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ Toyota (టొయోటా) మార్కెట్లో అత్యంత అధునాతన వాహనాలను విడుదల చేసి మంచి ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇటీవల ఒక కొత్త అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. Toyota కంపెనీ పొందిన ఈ రికార్డ్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఇంధనం నింపకుండా 1,359 కిమీ ప్రయాణించి 'గిన్నిస్ రికార్డ్' పొందిన Toyota Mirai: వివరాలు

Toyota కంపెనీ యొక్క 2021 Toyota Mirai (2021 టొయోటా మిరై) ఒక్క సారి ఇంధనం నింపడం ద్వారా అత్యధిక దూరం ప్రయాణించి ఏకంగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' కైవసం చేసుకుంది. ఈ విధమైన అత్యధిక మైలేజ్ అందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు ఇదే.

కంపెనీ సాధించిన ఈ ఘనత వల్ల టయోటా క్లీన్ అండ్ గ్రీన్ బ్రాండ్‌గా మారింది. నిజంగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' సాధించడం అనేది సాధారణ విషయం కాదు. ఇది కంపెనీ యొక్క కీర్తిని నలుదిశల్లో వ్యాపింపచేస్తుంది.

ఇంధనం నింపకుండా 1,359 కిమీ ప్రయాణించి 'గిన్నిస్ రికార్డ్' పొందిన Toyota Mirai: వివరాలు

నివేదికల ప్రకారం, 2021 Toyota Mirai (2021 టొయోటా మిరై) దక్షిణ కాలిఫోర్నియాలో ఒక రౌండ్‌ట్రిప్ తీసుకొని, దాని ప్రయాణాన్ని ప్రారంభించడానికి సన్నద్ధమయ్యింది. అయితే ఈ ప్రయాణం ప్రారంభించడానికి ముందు ఒక హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ నింపి, ఆ తర్వాత 1,359 కిమీల దూరాన్ని కవర్ చేసిందని కంపెనీ తెలిపింది.

Toyota కంపెనీ జీరో-ఎమిషన్ వాహనాల కోసం సాధించిన ఈ రికార్డు ఒక అరుదైన విజయం, అని కంపెనీ పేర్కొంది. టొయోటా కంపెనీ యొక్క నార్త్ అమెరికా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ 'బాబ్ కార్టర్' మాట్లాడుతూ, ఆటోమేకర్స్ పోర్ట్‌ఫోలియోలో జీరో-ఎమిషన్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ సమయంలో ఈ రికార్డ్ పొందటం చాలా ఆనందంగా ఉంది.

ఇంధనం నింపకుండా 1,359 కిమీ ప్రయాణించి 'గిన్నిస్ రికార్డ్' పొందిన Toyota Mirai: వివరాలు

అంతే కాకుండా, 2016 లో Toyota Mirai (టయోటా మిరై) ఉత్తర అమెరికాలో అమ్మకానికి అందుబాటులో ఉన్న మొదటి ఉత్పత్తి కూడా, ఇది ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్, అంతే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ 2021 టయోటా మిరాయ్ ఒక అద్భుతమైన కారుగా రికార్డు సృష్టిస్తోంది. కావున ఇది మంచి ఆదరణ పొందుతుంది.

Toyota తన అధికారిక నిబంధనలు మరియు డాక్యుమెంటేషన్ విధానాలకు అనుగుణంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అధికారిక రికార్డు ప్రయత్నాన్ని నిశితంగా పర్యవేక్షిస్తుందని కూడా తెలియజేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఈ కారు యొక్క ప్రయాణం రెండు రోజుల పాటు ఆగస్టు 23, 2021 న కాలిఫోర్నియాలోని గార్డెనాలోని టయోటా టెక్నికల్ సెంటర్ (TTC) నుండి ప్రారంభమైంది.

ఇంధనం నింపకుండా 1,359 కిమీ ప్రయాణించి 'గిన్నిస్ రికార్డ్' పొందిన Toyota Mirai: వివరాలు

హైడ్రోజన్ ఫ్యూయెల్ కలిగిన ఈ కారు శాన్ యసిడ్రో, శాంటా బార్బరా, శాంటా మోనికా మరియు మాలిబు గుండా ప్రయాణించింది. టొయోటా మిరై 'టయోటా టెక్నికల్ సెంటర్' కి తిరిగి వచ్చినప్పుడు అది 761 కి.మీ ప్రయాణించినట్లు తెలిసింది. మరుసటి రోజు శాన్ డియాగో ఫ్రీవే ద్వారా లాస్ ఏంజిల్స్ మరియు ఆరెంజ్ కౌంటీ మధ్య కారు వెళ్లింది. ఒకసారి అక్కడ, టయోటా మిరైలో హైడ్రోజన్ పూర్తయింది.

ఇంధనం నింపకుండా 1,359 కిమీ ప్రయాణించి 'గిన్నిస్ రికార్డ్' పొందిన Toyota Mirai: వివరాలు

ఇది తిరిగి 'టయోటా టెక్నికల్ సెంటర్' తీరానికి చేరుకుంది, రెండు రోజుల పాటు కారు మొత్తం 1359 కి.మీ ప్రయాణించినట్లు తెలిసింది. టయోటా ఈ రెండు రోజుల ప్రయాణాన్ని ముగించ్చుకునే సమయానికి మొత్తం 5.65 కిలోగ్రాముల హైడ్రోజన్‌ను వినియోగించిందని మరియు 12 హైడ్రోజన్ స్టేషన్లను నో-రీఫ్యూయల్ డ్రైవ్ మార్గాలతో దాటిందని కంపెనీ నివేదించింది.

ఏది ఏమైనా ఇంత దూరం కేవలం 5.65 కిలోగ్రాముల హైడ్రోజన్‌ను వినియోగించి ప్రయాణించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ గొప్ప ప్రయాణానికి గాను ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పొందటం కూడా కంపెనీ సాధించిన అపురూపమైన విజయం అనే చెప్పాలి.

టొయోటా మోటార్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ లెజండర్ లో కంపెనీ ఓ కొత్త 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ 4X4 ధర రూ.42.33 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. ప్రస్తుత పండుగ సీజన్ నేపథ్యంలో కంపెనీ ఈ కొత్త టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ 4X4 వేరియంట్ ను విడుదల చేసింది. ఆసక్తి గల కస్టమర్లు కొత్త ఫార్చ్యూనర్ లెజెండర్ 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్ ను కంపెనీ వెబ్‌సైట్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత టొయోటా డీలర్‌షిప్ ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఎస్‌యూవీ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
2021 toyota mirai hydrogen fuel cell electric car sets guinness world record details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X