2022 Maruti Vitara Brezza లో ఉండే సరికొత్త ఫీచర్స్, ఇవే

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి (Maruti Suzuki) యొక్క విటారా బ్రెజ్జా (Vitara Brezza) త్వరలోనే కొత్త అప్డేట్స్ తో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ యొక్క విటారా బ్రెజ్జా ఇప్పటికి కూడా మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తుంది. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు కొత్త కొత్త ఫీచర్స్ తో రావడం వల్ల మారుతి విటారా బ్రెజ్జా కూడా కొత్త ఫీచర్స్ తో రావలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (2022 Maruti Suzuki Vitara Brezza) ను లాంచ్ చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

2022 Vitara Brezza లో ఉండే సరికొత్త ఫీచర్స్, ఇవే

దేశీయ విఫణిలోకి ఈ కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ అయిన తర్వాత ఒక ఉన్నతమైన కాంపాక్ట్ SUV అవుతుంది, ఎందుకంటే ఇది ఇటీవలే కొత్త ప్రీమియం ఫీచర్లతో గుర్తించబడింది. ఈ ఫీచర్లు మారుతి సుజుకి యొక్క ఏ కారులోనూ లేకపోవడం గమనార్హం.

2022 Vitara Brezza లో ఉండే సరికొత్త ఫీచర్స్, ఇవే

2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా పొందుతున్న ఈ ఆధునిక ఫీచర్స్ వల్ల, మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కియా సోనెట్, మహీంద్రా XUV300 మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త 2022 మారుతి బ్రెజ్జాలో లేటెస్ట్ ఎక్స్టీరియర్ ప్రొఫైల్, అప్‌డేట్ చేయబడిన క్యాబిన్ మరియు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో రియర్ ప్రొఫైల్ బూట్ లిడ్‌పై క్రోమ్ స్ట్రిప్‌ కూడా పొందుతుంది, కానీ 'వితారా' బ్యాడ్జింగ్ తీసివేయబడింది.

కంపెనీ విడుదల చేయనున్న కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలోని ఆధునిక ఫీచర్స్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

2022 Vitara Brezza లో ఉండే సరికొత్త ఫీచర్స్, ఇవే

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్:

మారుతి సుజుకి కంపెనీ తన కార్లలో మొదటి సారిగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను అందించనుంది. ఇది నిజంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కంపెనీ ఇప్పటివరకు ఈ ఫీచర్ తన బ్రాండ్ యొక్క ఏ కార్లలోనే అందించలేదు. ఇప్పుడు మొదటిసారిగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను 2022 మారుతి బ్రెజ్జాలో అందిస్తుంది. అయితే ఇందులో కేవలం టాప్-ఎండ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

2022 Vitara Brezza లో ఉండే సరికొత్త ఫీచర్స్, ఇవే

ప్యాడిల్ షిఫ్టర్‌లు:

మారుతి సుజుకి ఈ ప్యాడిల్ షిఫ్టర్‌ ఫీచర్ ని కూడా మొదటిసారి తన బ్రాండ్ కార్లలో అందిస్తోంది. ఇప్పటికే వెలువడిన ఫోటోలలో 2022 మారుతి బ్రెజ్జా యొక్క సన్‌రూఫ్‌తో పాటు ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా కనిపించాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్‌లోని కియా సోనెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్యాడిల్ షిఫ్టర్‌ అనేది ముఖ్యమైన ఫీచర్ కానప్పటికీ, కారుకు స్పోర్టీ టచ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

2022 Vitara Brezza లో ఉండే సరికొత్త ఫీచర్స్, ఇవే

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్:

త్వరలో రానున్న కొత్త 2022 మారుతి సుజుకి వితారా బ్రెజ్జా ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో లాంచ్ చేయబడుతుంది. ఇప్పటికే విడుదలైన ఫోటోల ప్రకారం, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యూనిట్ కంటే ఇది కొంచెం పెద్దదిగా కనిపిస్తోంది. ఈ కొత్త ప్యాడిల్ షిఫ్టర్‌ 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌తో పాత స్మార్ట్ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్‌పై చక్కని అప్‌గ్రేడ్ అవుతుంది. కావున ఇది వినియోగింహడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

2022 Vitara Brezza లో ఉండే సరికొత్త ఫీచర్స్, ఇవే

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే:

కొత్త 2022 మారుతి బ్రెజ్జా SUV లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కోసం వైర్‌లెస్ కనెక్టివిటీని పొందుతుంది. ఇది ప్రస్తుతం అత్యంత ట్రెండింగ్ ఫీచర్‌లలో ఒకటి. అయితే, ఈ ఫీచర్ కూడా ఈ కారు యొక్క హై-ఎండ్ వేరియంట్‌లలో మాత్రమే కనిపిస్తుంది. వాహన కొనుగోలుదారులు దీనిని గమనించాలి. ఇది కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

2022 Vitara Brezza లో ఉండే సరికొత్త ఫీచర్స్, ఇవే

కనెక్టెడ్ కార్ టెక్నాలజీ:

కొత్త 2022 మారుతి వితారా బ్రెజ్జాలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఇంజిన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ మరియు హెడ్‌లైట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కంట్రోల్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు అందుబాటులో ఉన్న చాలా కార్లలో అందుబాటులో ఉంది. కావున కొత్త 2022 మారుతి వితారా బ్రెజ్జాలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

2022 Vitara Brezza లో ఉండే సరికొత్త ఫీచర్స్, ఇవే

న్యూ డ్రైవర్ డిస్‌ప్లే:

కొత్త 2022 బ్రెజ్జా SUV యొక్క కొన్ని చిత్రాల ప్రకారం, ఇందులో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇది డిజిటల్ యూనిట్‌గా కనిపించడం లేదు. అయితే ఇది మారుతి ఎస్-క్రాస్ మరియు మారుతి సియాజ్‌లను పోలి ఉంటుంది.

2022 Vitara Brezza లో ఉండే సరికొత్త ఫీచర్స్, ఇవే

మెరుగైన సేఫ్టీ ఫీచర్స్:

మారుతి సుజుకి కంపెనీ ఇప్పుడు ఈ కొత్త 2022 సబ్-కాంపాక్ట్ SUV ని మరిన్ని ఎయిర్‌బ్యాగ్‌లతో అందించే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ యొక్క ప్రస్తుత మోడల్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే లభిస్తాయి. కంపెనీ ఈ కొత్త SUV ని సుజుకి హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనుంది.

ఇందులో ఉన్న ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. అంతే కాకుండా ఈ ఫీచర్స్ కారణంగా ప్రస్తుత గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ రేటింగ్ లో మంచి రేటింగ్ పొందటానికి అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
2022 maruti suzuki vitara brezza 7 new features details
Story first published: Wednesday, November 24, 2021, 14:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X