Tata Punch కి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన Hyundai Casper

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఈ విభాగంలో లభించిన మోడళ్లను చేతి వేళ్ల మీద లెక్కపెట్టేయవచ్చు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య పదులను దాటిపోయింది. అంతేకాదు ఇప్పుడు ఈ ఎస్‌యూవీ విభాగాన్ని ఫుల్-సైజ్, మిడ్-సైజ్, కాంపాక్ట్ మరియు మైక్రో ఎస్‌యూవీలు అంటూ మరిన్ని కొత్త విభాలుగా విభజిస్తున్నారు.

ఇప్పటి వరకు మిడ్-సైజ్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగాల్లోనే పోటీ విపరీతంగా ఉండేది. కానీ, ఇప్పుడు మైక్రో ఎస్‌యూవీ విభాగంలో పోటీ తీవ్రతరం అవుతోంది. ఈ విభాగంలో ఇప్పటికే Maruti Suzuki బ్రాండ్ Ignis (ఇగ్నిస్) అనే మోడల్ ను విక్రయిస్తుండగా, Mahindra సంస్థ KUV100 (కెయూవీ100) అనే మోడల్ ను విక్రయిస్తోంది.

Tata Punch కి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన Hyundai Casper

ఇదిలా ఉంటే, ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం Tata Motors ఇప్పుడు ఈ విభాగంలో కొత్తగా Punch (పంచ్) అనే మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయబోతున్నామని ప్రకటింది మరియు అందుకు సంబంధించిన ఓ టీజర్ ఇమేజ్ ని కూడా విడుదల చేసింది. ఈ కార్లకు పోటీ ఇచ్చేందుకు కొరియన్ కార్ బ్రాండ్ Hyundai కూడా సిద్ధమైంది.

Tata Punch కి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన Hyundai Casper

ఈ కొరియన్ కార్ బ్రాండ్ ఇప్పుడు హ్యుందాయ్ కాస్పర్ (Hyundai Casper) పేరుతో ఓ మైక్రో ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోనే ఇది అత్యంత చిన్న ఎస్‌యూవీ కావటం విశేషం. కంపెనీ ఈ కొత్త Casper మైక్రో ఎస్‌యూవీని, ప్రస్తుతం విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ Venue (వెన్యూ) కి దిగువన ప్రవేశపెట్టనుంది.

Tata Punch కి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన Hyundai Casper

భారత మార్కెట్లో Hyundai Casper నేరుగా ఈ విభాగంలో Tata Punch కి పోటీగా విడుదల కానుంది. Hyundai ఈ బేబీ ఎస్‌యూవీని ముందుగా తన స్వదేశమైన దక్షిణ కొరియాలో అమ్మకానికి ఉంచుతుంది. ఆ తర్వాత 2022 ఆరంభంలో ఇది భారత మార్కెట్లో కూడా అమ్మకానికి రానుంది.

Hyundai Casper ఇప్పటి వరకూ మనకు కాన్సెప్ట్ మోడల్ గానే తెలుసు. కానీ, ఇప్పుడు కంపెనీ ఇందులో ప్రొడక్షన్ కు సిద్ధంగా ఉన్న మోడల్ ను పరిచయం చేసింది. కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ శాంత్రో (Santro) ని తయారు చేస్తున్న K1 ప్లాట్‌ఫామ్‌పైనే ఈ కొత్త Casper మైక్రో ఎస్‌యూవీని కూడా తయారు చేయనున్నారు.

Tata Punch కి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన Hyundai Casper

ఈ నేపథ్యంలో Hyundai Santro మరియు Hyundai Casper రెండు మోడళ్లలో చాలా వరకు పోలికలు ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ రెండు మోడళ్లలలోని ఇంజన్ ఆప్షన్లు కూడా ఒకేలా ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Santro కారులో 1.1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది గరిష్టంగా 68 బిహెచ్‌పి పవర్ ను మరియు 99 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‍‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Tata Punch కి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన Hyundai Casper

ఇక Hyundai Casper విషయానికి వస్తే, కంపెనీ విడుదల చేసిన అధికారిక చిత్రాల ప్రకారం, ఈ మైక్రో ఎస్‌యూవీలో పెద్ద రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ లో అమర్చిన గుండ్రటి హెడ్‌లైట్స్, ఫ్రంట్ బంపర్‌లో బ్లాక్ అండ్ గ్రే గార్నిష్, హుడ్ క్రింద అమర్చిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సైడ్ డిజైన్‌ను గమనిస్తే, పెప్పీగా కనిపించే స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ఉబ్బినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్, బాడీ చుట్టూ సన్నటి బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, బాడీ కలర్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ మరియు వెనుక విడ్‌షీల్డ్ వద్ద అమర్చిన రియర్ డోర్ హ్యాండిల్, ఫంక్షనల్ రూఫ్ రెయిల్ మరియు బ్రాక్డ్ అవుట్ ఏ పిల్లర్ వంటి డీటేలింగ్స్ ఇందులో ఉన్నాయి.

Tata Punch కి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన Hyundai Casper

ఇక వెనుక డిజైన్ చాలా సింపుల్ గా మరియు అంతే స్టైలిష్ గా ఉంటుంది. వెనుక బంపర్ లో అమర్చిన రెండు గుండ్రటి టెయిల్ ల్యాంప్స్ మరియు వాటి మధ్యలో నెంబర్ ప్లేట్, బంపర్ దిగువ భాగంలో బ్లాక్ అండ్ గ్రే కలర్ స్కిడ్ ప్లేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ స్పాయిలర్ మరియు రియర్ వాషర్ అండ్ వైపర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను ఇందులో గమనించవచ్చు.

Tata Punch కి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన Hyundai Casper

Hyundai ఇంకా Casper యొక్క ఇంటీరియర్స్ వివరాలను వెల్లడించలేదు. అయితే, గతంలో లీకైన స్పై చిత్రాలను బట్టి చూస్తే, ఈ మైక్రో-ఎస్‌యువి లోపలి భాగంలో వైట్ అప్‌హోలెస్ట్రీ ఉంటుందని తెలుస్తోంది. అలాగే, డాష్‌బోర్డులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు లేటెస్ట్ కార్ కనెక్టింగ్ ఫీచర్లతో ఇది లోడ్ చేయబడి ఉంటుందని అంచనా.

Tata Punch కి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన Hyundai Casper

Hyundai Casper భారత మార్కెట్లో విడుదలైతే ఇది ఈ విభాగంలో Tata Punch, Maruti Suzuki Ignis, Renault Kwid, Mahindra KUV100 వంటి మోడళ్లతో పోటీ పడగలదు. అంతేకాకుండా, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీలైన Renault Kiger మరియు Nissan Magnite వంటి మోడళ్లకు ఇది పోటీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
All new hyundai caspar micro suv revealed will rival to tata punch details
Story first published: Wednesday, September 1, 2021, 17:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X