మార్చ్ 15న విడుదల కానున్న సరికొ 2021 జీప్ వ్రాంగ్లర్ - పూర్తి వివరాలు
అమెరికన్ ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, తమ సరికొత్త 2021 వ్రాంగ్లర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని వచ్చే నెల భారత మార్కెట్లో విడుదల చేయనుంది. జీప్ ఇప్పటి వరకూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో ఈ మోడల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇండియాలో విక్రయించింది.

కాగా, ఇప్పుడు జీప్ ఇండియా తమ కొత్త వ్రాంగ్లర్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లోనే స్థానికంగా అసెంబుల్ చేస్తోంది. సికెడి రూట్‌లో విడిభాగాలను విదేశాల నుండి దిగుమతి చేసుకొని, జీప్ తమ ఇండియా ప్లాంట్‌లో ఈమోడల్‌ను నిర్మిస్తోంది. ఈ మేడ్-ఇన్-ఇండియా జీప్ వ్రాంగ్లర్‌ను మార్చి 15న మార్కెట్లోకి రానుంది.

జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీ స్థానిక తయారీ కోసం కంపెనీ 180 కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించింది. రంజాన్‌గావ్‌లో ఉన్న జీప్ ఇండియా ప్లాంట్‌లో ఈ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. గతేడాది జీప్ తమ 2020 వ్రాంగ్లర్‌ను రూ.63.94 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతే విడుదల చేసింది.

అప్పట్లో ఈ ఎస్‌యూవీని పూర్తిగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న కారణంగా, అధిక దిగుమతి సుంఖాల కారణంగా మార్కెట్లో దీని ధర అత్యధికంగా ఉండేది. అయితే, ఇప్పుడు కంపెనీ ఈ మోడల్‌ను పూర్తిగా భారతదేశంలోనే అసెంబుల్ చేస్తున్న నేపథ్యంలో, దీని ధర కూడా భారీగా తగ్గే ఆస్కారం ఉంది.

కొత్త 2021 జీప్ వ్రాంగ్లర్ ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం ఐకానిక్ జీప్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇందులో బిల్ట్-ఇన్ జిపిఎస్ నావిగేషన్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు అప్‌డేటెడ్ డాష్‌బోర్డ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

అంతేకాకుండా, ఇందులో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ మరియు స్టాప్, ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ మరియు దానిపై వైట్ కలర్ స్టిచింగ్, రిమూవబల్ డోర్స్, సిగ్నేచర్ 7-స్లాట్ గ్రిల్, డ్రాప్ డౌన్ విండ్‌షీల్డ్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మరిన్నో ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 జీప్ వ్రాంగ్లర్ 2.0-లీటర్ హై పవర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 268 పిఎస్ శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది.

ఈ ఎస్‌యూవీ అత్యుత్తమ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇందులో మ్యాన్యువల్ డిఫరెన్షియల్ లాక్ ఉంటుంది. సెంట్రల్ కన్సోల్‌లో ఇచ్చిన స్విచ్‌ను ఉపయోగించి దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఇందులో కొత్త 4WD ఆటో మోడ్‌తో పాటుగా, హై మరియు లో మోడ్‌తో కూడిన డెడికేటెడ్ ఫోర్-వీల్-డ్రైవ్ (4WD) సిస్టమ్ కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications








