భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న Tata Punch: తేదీ వెల్లడించిన Tata Motors

దేశీయ వాహన తయారీ సంస్థ Tata Motors (టాటా మోటార్స్) భారతీయ మార్కెట్లో తన బ్రాండ్ నుంచి మరో ఎస్‌యూవీని తీసుకురావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ కొత్త SUV (Tata Punch) గురించి ఇప్పటికే చాలా సమాచారాన్ని అందించింది. అయితే ఇప్పుడు తాజాగా కంపెనీ ఈ కొత్త Tata Punch మార్కెట్లో ఆవిష్కరించనున్న తేదీని అధికారికంగా ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న Tata Punch: తేదీ వెల్లడించిన Tata Motors

Tata Motors కొత్త Tata Punch గురించి వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం, ఈ మైక్రో SUV ని 2021 అక్టోబర్ 04 న వెల్లడించనున్నట్లు తెలిపింది. అదేరోజున కంపెనీ ఈ SUV కోసం అధికారిక బుకింగ్స్ కూడా స్వీకరించనుంది. అయితే Tata Punch యొక్క అనధికార బుకింగ్స్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో ప్రారంభమయాయ్యి. కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న కస్టమర్లు అనధికారిక బుకింగ్స్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న Tata Punch: తేదీ వెల్లడించిన Tata Motors

Tata Motors ప్రకారం Tata Punch భారతదేశంలో రానున్న పండుగ సీజన్లో విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు చాలా కంపెనీలు తమ ఉత్పతులను ఈ పండుగ సీజన్లో విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తున్నారు. అయితే కొత్త Tata Punch కి సంబంధించిన ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కావున ఈ మైక్రో SUV లాంచ్ సమయంలో ధర వెల్లడౌతుంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న Tata Punch: తేదీ వెల్లడించిన Tata Motors

కంపెనీ ఇటీవల Tata Punch యొక్క కలర్ ఆప్సన్స్ కూడా వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ దీనికి సంబంధించి వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇందులో మూడు కలర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కంపెనీ ఈ Tata Punch ను మోనో టోన్ మరోయు డ్యూయెల్ టోన్ బాడీ కలర్ ఆప్సన్స్ లో అందించే అవకాశం ఉంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న Tata Punch: తేదీ వెల్లడించిన Tata Motors

Tata Punch బ్లూ కలర్, ఆరంజ్ కలర్ మరియు బ్రౌన్ కలర్స్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ కలర్స్ మాత్రమే కాకూండా కంపెనీ దీనిని గ్రే కలర్ మరియు వైట్ కలర్ ఆప్సన్స్ లో కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. కానీ దీనికి సంబందించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడికాలేదు.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న Tata Punch: తేదీ వెల్లడించిన Tata Motors

Tata Punch ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఈ కారు ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంటుంది. Tata Punch (టాటా పంచ్) అనేది కంపెనీ యొక్క మైక్రో ఎస్‌యూవీ అంతే కాకూండా, ఇది కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్, కావున ఈ కొత్త మోడల్ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న Tata Punch: తేదీ వెల్లడించిన Tata Motors

Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో సిగ్నేచర్ గ్రిల్, మధ్యలో బ్రాండ్ యొక్క లోగో ఉంచబడింది. ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్ తో వేరుచేయబడి ఉంటుంది. హెడ్‌లైట్ రెండు వైపులా ఉంచబడింది మరియు ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. నంబర్ ప్లేట్ మరియు స్కిడ్ ప్లేట్ దాని క్రింద ఉంచబడ్డాయి. ఇవన్నీ కూడా Tata Punch ని మరింత ఆకర్షనీయంగా చేస్తాయి.

ఇందులో ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ చూడవచ్చు, రూఫ్ తెల్లగా ఉంచబడింది మరియు రూఫ్ రైల్ బ్లాక్ కలర్‌లో ఉంచబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తం మీద Tata Punch డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న Tata Punch: తేదీ వెల్లడించిన Tata Motors

Tata Punch యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ టోన్ థీమ్‌లో ఉంచబడింది, ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఉపయోగించబడ్డాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ కలయిక దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటివి కూడా ఉన్నాయి. అంతే కాకుండా AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న Tata Punch: తేదీ వెల్లడించిన Tata Motors

Tata Punch ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, Tata Punch యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో, కంపెనీ తమ పాపులర్ Altroz iTurbo వేరియంట్లలో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న Tata Punch: తేదీ వెల్లడించిన Tata Motors

Tata Punch త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది, Tata Punch ఈ విభాగంలో Maruti Suzuki Ignis, WagonR, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత ఈ SUV ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Friday, September 24, 2021, 9:55 [IST]
English summary
All new tata punch micro suv revealed on october 4th in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+