రెనో క్విడ్, ట్రైబర్ మరియు డస్టర్ మోడళ్లపై ఏప్రిల్ నెల డిస్కౌంట్స్!
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఎంపిక చేసిన మోడళ్లపై ఏప్రిల్ 2021 నెల డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలలో క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ ఎమ్‌పివి మరియు డస్టర్ ఎస్‌యూవీ మోడళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు, మోడల్‌ను బట్టి రూ.75,000 వరకూ డిస్కౌంట్లను పొందవచ్చు.

ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో పాటుగా రెనో తమ కార్ల కొనుగోలు కోసం జీరో పర్సెంట్ వడ్డీ రేట్లను కూడా ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ డిస్కౌంట్ల జాబితాలో కంపెనీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాత్రం లేదు. వివిధ మోడళ్లపై రెనో ఇండియా అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

1. రెనో క్విడ్
రెనో ఇండియా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎంపిక చేసిన వేరియంట్లపై కంపెనీ ఏప్రిల్ 2021 నెల ఆఫర్లలో భాగంగా రూ.50,000 వరకూ తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు (విన్ 20 వాహనాలపై రూ.20,000 నగదు తగ్గింపు, విన్ 21 వాహనాలపై రూ.10,000 నగదు తగ్గింపు), రూ.20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ మరియు రూ.10,000 లాయల్టీ బెనిఫిట్‌లను ఆఫర్ చేస్తున్నారు.

వీటితో పాటుగా, ఈ నెలలో క్విడ్ కారును కొనాలనుకునే కస్టమర్లకు రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను అలాగే రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయతీ ఉద్యోగుల కోసం రూ.5,000 ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో రెనో క్విడ్ ధరలు రూ.3.13 లక్షల నుండి ప్రారంభం అవుతాయి.

2. రెనో ట్రైబర్
భారతదేశంలోనే అత్యంత సరమైన 7-సీటర్ కాంపాక్ట్ ఎమ్‌పివి రెనో ట్రైబర్ కొనుగోలుపై కంపెనీ రూ.55,000 తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.10,000 లాయల్టీ బెనిఫిట్ లేదా రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తున్నారు.

అదే సమయంలో, 2021 మోడల్‌పై రూ.30,000 ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ మరియు రూ.10,000 లాయల్టీ బెనిఫిట్ లేదా రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ మోడల్ కోసం కేవలం 5.99 శాతం వడ్డీకే రుణాలను కూడా అందిస్తున్నారు.

3. రెనో డస్టర్
రెనో ఇండియా అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ డస్టర్‌పై కంపెనీ గరిష్టంగా రూ.75,000 వరకూ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో డస్టర్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ వెర్షన్‌పై రూ.75,000 తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. ఈ మొత్తంలో రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.15,000 వరకు లాయల్టీ బోనస్ మరియు ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.30,000 నగదు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మోడల్‌పై రూ.30,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

రెనో డస్టర్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్‌పై రూ.45,000 తగ్గింపును ఇస్తున్నారు. ఇందులో ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ రూ.30,000 మరియు లాయల్టీ బెనిఫిట్ రూ.15,000 వరకు ఉన్నాయి. ఈ మోడల్‌పై గ్రామ పంచాయతీ సభ్యులకు కార్పొరేట్ డిస్కౌంట్ రూ.30,000 లేదా రూ.15,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు.

రెనో ఇండియా తమ కార్లపై అందిస్తున్న ఈ డిస్కౌంట్లు మరియు ఇతర ఆఫర్లకు సంబంధించి మరింత సమాచారం కోసం మీ సమీపం లోని రెనో డీలర్‌షిప్‌ను కూడా సంప్రదించవచ్చు. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications








