భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

మీకు అరవింద్ మోటార్స్ కంపెనీ గుర్తుందా? 1960 కాలంలో కేవలం రూ.5,000 లకే కారును విక్రయించిన ఈ సంస్థ, కొన్ని దశాబ్ధాల తర్వాత తిరిగి దేశీయ మార్కెట్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

కేరళకు చెందిన ప్రొఫెషనల్ కార్ మెకానిక్ కె.ఎ.బి మీనన్ 1956లో స్థాపించిన అరవింద్ ఆటోమొబైల్ సంస్థను ఇప్పుడు ఆయన మనవరాళ్లు నిర్వహిస్తున్నారు. వీరు తాజా తమ కంపెనీ యొక్క లేటెస్ట్ లోగోను మరియు కాన్సెప్ట్ వన్‌గా పిలువబడే కారు స్కెచ్ చిత్రాలను విడుదల చేశారు.

భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

ఐకానిక్ అరవింద్ మోడల్ 3 (ఈ కారును ముద్దుగా బేబీ అని పిలిచే వారు) కారుని ఆధారంగా చేసుకొని ఈ కంపెనీ తాజాగా తమ కాన్సెప్ట్ వన్ స్కెచ్ చిత్రాలను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.

MOST READ: ఒకే ఛార్జ్‌తో 150 కి.మీ మైలేజ్ అందించే టాటా ఏస్ ఎలక్ట్రిక్ వెహికల్.. వివరాలు

భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

అరవింద్ మోడల్ -3 యొక్క రూపకల్పన కొంతవరకు అమెరికన్ కారు కాడిలాక్ నుండి ప్రేరణ పొంది తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. అప్పట్లో ఇదొక ఫుల్ సైజ్ సెడాన్ కారుగా ఉండి, యుఎస్ మరియు యూరప్ దేశాలలో మాత్రమే అందుబాటులో ఉండే కార్ల మాదిరిగా ఉండేది.

భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

ఆ సమయంలో ఈ కారును ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేవారు. సినీ ప్రముఖులు సెలబ్రిటీలు కూడా ఈ కారును ఉపయోగించే వారు. ఈ కారు ముందు భాగంలో పొడవైన బోనెట్ ఉంటుంది మరియు వెనుక భాగంలో కూడా అంతే సమానమైన బూట్ స్పేస్ ఉంటుంది.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి లగ్జరీ సెడాన్ రివ్యూ.. లేటెస్ట్ ఫీచర్స్ & వివరాలు

భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

ఈ కారు డిజైన్ చాలా సరళమైనదే అయినప్పటికీ, చాలా ఆకర్షణీయంగా ఉండేది. కారు హెడ్‌లైట్, గ్రిల్, విండోస్ మరియు ఇంటీరియర్‌లోని కొన్ని డీటేలింగ్స్‌పై క్రోమ్ ఫినిషింగ్ ఉండేది. సాంప్రదాయ కార్ల మాదిరిగా వాలుగా కాకుండా కాకుండా, ఈ మోడల్ 3 కారు డిజైన్ బాక్స్ టైప్‌లో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

కాగా, ఇప్పుడు అరవింగ్ మోటార్స్ నుండి రానున్న కొత్త తరం కాన్సెప్ట్ వన్ డిజైన్ చాలా ఆధునికంగా ఉంటుందని, భవిష్యత్తులో తాము ఎలక్ట్రిక్ కార్ల రూపకల్పనకు కూడా శ్రీకారం చుట్టనున్నామని కంపెనీ వెల్లడించింది. వచ్చే 2029 నాటికి అరవింద్ మోటార్స్ ఈ కారును లాంచ్ చేస్తుందని, త్వరలోనే దీని రూపకల్పనపై పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు.

MOST READ:నువ్వా నేనా అంటూ జరిగిన 2021 రెడ్ బుల్ ఏస్ రేస్ హైలెట్స్ & ఫలితాలు.. వచ్చేశాయ్

భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

అరవింద్ మోడల్ 3 కారు తయారీలో ఉపయోగించిన చాలా భాగాలను అరవింద్ మోటార్స్ తమ ప్లాంట్‌లోనే స్వతహాగా చేతుల్తో తయారు చేసేది. మీనన్ ఈ కారు తయారీలో బయటి సంస్థల నుండి ఎలాంటి సహాయాన్ని ఆశించలేదు. మీనన్ ఈ కారును భారతదేశంలోని సాధారణ పౌరులకు పరిచయం చేయాలనుకున్నారు.

భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

అయితే, మార్కెట్లో పెరిగిన పోటీ, సరైన పెట్టుబడులు లేకపోవడం వంటి పలు కారణాల వల్ల మీనన్ తన వ్యాపారాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. మీనన్ 1970 కాలంలోఆర్థిక సహాయం కోసం భారత ప్రభుత్వాన్ని వేడుకున్నాడు మరియు సంస్థను విస్తరించడానికి లైసెన్స్‌ను కూడా కోరారు. కానీ, అప్పటి ప్రభుత్వం అరవింద్ మోటార్స్‌ను విస్మరించి మారుతికి లైసెన్స్ ఇచ్చింది.

MOST READ:200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు కోసం రూ. 10,000 ఖర్చు చేసిన వ్యాపారవేత్త

భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

ఈ నిర్ణయం అరవింద్ మోటార్స్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. అరవింద్ మోటార్స్ చివరకు 1971లో తక్కువ అమ్మకాలు మరియు పెట్టుబడి లేకపోవడం వల్ల వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. అదే సంవత్సరంలో కెఎబి మీనన్ గుండెపోటుతో మరణించారు. మీనన్ మరణం తర్వాత ఆయన భార్య ఈ సంస్థ బాధ్యతలను స్వీకరించింది.

భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఐకానిక్ అరవింద్ మోటార్స్; కాన్సెప్ట్ వన్ వెల్లడి!

ప్రస్తుతం మీనన్ మనవరాళ్లు అరవింద్ మోటార్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రాండ్ ఓ ఎలక్ట్రిక్ కారుతో తిరిగి మార్కెట్లోకి రావాలని ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Arvind Motors Releases New Logo And Prototype Sketch Images, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X