భారత్‌లో కొత్త ఆడి ఎ4 సెడాన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

భారత మార్కెట్లో వాహనప్రియులు ఎంతగానో వేచిచూస్తున్న "ఆడి ఏ4" సెడాన్ ఎట్టకేలకు దేశీయమార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త ఐదవ తరం ఆడి ఏ4 సెడాన్ ఇప్పుడు దాని డిజైన్, ఇంటీరియర్స్ మరియు ఫీచర్ కొంతవరకు అప్డేట్స్ చేయబడ్డాయి. ఈ సెడాన్ ధర రూ. 42.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

భారత్‌లో కొత్త ఆడి ఎ 4 సెడాన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

కొత్త ఆడి ఎ 4 సెడాన్ రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అవి ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే వేరియంట్లు. కొత్త సెడాన్ కోసం బుకింగ్స్ కొన్ని వారాల క్రితమే ప్రారంభమైంది. ఈ కారు బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు ఎ 4 సెడాన్ ను ఆన్‌లైన్ ద్వారా లేదా బ్రాండ్ యొక్క డీలర్‌షిప్ ద్వారా రూ. 2 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ సెడాన్ యొక్క డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో కొత్త ఆడి ఎ 4 సెడాన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

ఆడి ఏ 4 సెడాన్ మంచి పనితీరుని కలిగి ఉండటమే కాకుండా సమర్థవంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇక దీని డిజైన్‌ విషయానికి వస్తే, కొత్త ఆడి ఎ 4 ఇప్పుడు ముందు భాగంలో పెద్ద హెక్సాగోనల్ గ్రిల్‌ను కలిగి ఉంది, ఇది ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో రివైజ్డ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్ ద్వారా ఇరువైపులా ఉంటుంది.

భారత్‌లో కొత్త ఆడి ఎ 4 సెడాన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

ఈ కొత్త ఆడి ఎ 4 లో ఫ్రంట్ బంపర్లను కూడా అప్డేట్ చేయబడ్డాయి. దీనికి ఎల్ఈడి ఫాగ్ లాంప్స్ ఇరువైపులా ఉన్నాయి. సెడాన్ ఇప్పుడు కొత్తగా రూపొందించిన 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో స్టాండర్డ్ గా వస్తుంది. ఇది ట్వీక్డ్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ క్లస్టర్ మరియు కొంచెం అప్‌డేట్ చేసిన రియర్ బంపర్‌ను కూడా కలిగి ఉంది.

భారత్‌లో కొత్త ఆడి ఎ 4 సెడాన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

ఆడి ఏ 4 సెడాన్ యొక్క లోపలి భాగంలో ఉన్న క్యాబిన్ ఇప్పుడు మరింత ప్రీమియం లుక్ ని అందిస్తుంది. డాష్‌బోర్డ్ వంటివి సాఫ్ట్-టచ్ మెటీరియల్‌తో వస్తాయి, అయితే సీట్లు ప్రీమియం లెదర్ అప్హోల్‌స్టరీలో చుట్టబడి ఉంటాయి.

భారత్‌లో కొత్త ఆడి ఎ 4 సెడాన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

క్యాబిన్ ఇప్పుడు ఆల్-డిజిటల్ వర్చువల్ కాక్‌పిట్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పెద్ద 10.1 ఇంచెస్ ఎమ్ఎమ్ఐ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి.

భారత్‌లో కొత్త ఆడి ఎ 4 సెడాన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

కొత్త ఆడి ఎ 4 లో ఒకే 2.0-లీటర్ టిఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ యూనిట్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 188 బిహెచ్‌పి మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి స్టాండర్డ్ గా జతచేయబడుతుంది. కొత్త ఏ 4 సెడాన్ కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగవంతం అవుతుందని కంపెనీ తెలిపింది.

భారత్‌లో కొత్త ఆడి ఎ 4 సెడాన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

కొత్త ఆడి ఎ 4 సెడాన్ బ్రాండ్ నుండి 2021 లో విక్రయించబడిన మొదటి ఉత్పత్తి. ఈ కొత్త ఆడి ఎ 4 సెడాన్ భారత మార్కెట్లో లేటెస్ట్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు జాగ్వార్ ఎక్స్‌ఇ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 5, 2021, 11:09 [IST]
English summary
New Audi A4 Sedan Launched In India. Read in Telugu.
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+