డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటున్న ఆడి ఇ-ట్రోన్ ఈవీ; పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి, భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'ఇ-ట్రోన్'ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా, ఆడి ఇండియా ఈ ఎలక్ట్రిక్ కారును దేశంలోని తమ డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా, కంపెనీ తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్‌లో కూడా ఈ ఎలక్ట్రిక్ కారును లిస్ట్ చేసింది.

డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటున్న ఆడి ఇ-ట్రోన్ ఈవీ; పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

సింగిల్ చార్జ్‌పై 400 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను ఆఫర్ చేసే ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి, జాగ్వార్ ఐ-పేస్ మరియు త్వరలో రాబోయే వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ మరియు టెస్లా మోడల్ 3 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు.

డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటున్న ఆడి ఇ-ట్రోన్ ఈవీ; పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

వాస్తవానికి ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు గతేడాదే మార్కెట్లోకి రావల్సి ఉంది. కంపెనీ ఈ కారును తొలిసారిగా గడచిన 2019లో ప్రదర్శించింది. కానీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఈ కారు విడుదల ఆలస్యమైంది. అయితే, తాజా పరిస్థితులను చూస్తుంటే, త్వరలోనే ఇది విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటున్న ఆడి ఇ-ట్రోన్ ఈవీ; పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ తర్వాత కంపెనీ ఇందులో మరో కొత్త స్పోర్ట్‌బ్యాక్ వెర్షన్‌ను కూడా ఇక్కడి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆడి ఇ-ట్రోన్ ఎస్‌యూవీ మరియు స్పోర్ట్‌బ్యాక్ రెండు మోడళ్లు కూడా వేర్వేరు డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఒకేరకమైన అండర్‌పిన్నింగ్స్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటున్న ఆడి ఇ-ట్రోన్ ఈవీ; పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందుంలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటిలో ఒకటి ముందు భాగంలో (125 కిలోవాట్ల మోటారు) ఉంటే, మరొకటి వెనుక భాగంలో (140 కిలోవాట్ల మోటారు) ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి గరిష్టంగా 408 బిహెచ్‌పి శక్తిని మరియు 664 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి.

డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటున్న ఆడి ఇ-ట్రోన్ ఈవీ; పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

ఇలా జనరేట్ అయిన శక్తి మొత్తాన్ని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు దీని గరిష్టం వేగం గంటకు 200 కిలోమీటర్లుగా ఉంటుంది.

డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటున్న ఆడి ఇ-ట్రోన్ ఈవీ; పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

ఈ కారులో 95 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని చార్జింగ్ టైమ్ విషయానికి వస్తే, డిసి ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 30 నిమిషాల్లో 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే, సాధారణ హోమ్ ఛార్జర్ ద్వారా అయితే, ఈ బ్యాటరీని పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది.

డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటున్న ఆడి ఇ-ట్రోన్ ఈవీ; పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఆక్టాగన్ ఆకారంలో ఉండే ఫ్రంట్ గ్రిల్, ఎయిర్ కూలింగ్ కోసం ఫ్లాప్స్, వాలుగా ఉండే రూఫ్-లైన్, బూట్ డోరుపై అడ్డంగా ఉన్న ఎల్‌ఈడీ లైట్ బార్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆడి మ్యాట్రిక్స్ టెక్నాలజీతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు 20 ఇంచ్ ఫైవ్-స్పోక్ అల్లాయ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటున్న ఆడి ఇ-ట్రోన్ ఈవీ; పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, మల్టిపుల్ టచ్‌స్క్రీన్లు, ప్రీమియం బ్యాంగ్ అండ్ ఓలుఫ్సేన్ సౌండ్ సిస్టమ్, విభిన్న పవర్ మోడ్స్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, మల్టిపుల్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్-అసిస్టెడ్ కనెక్ట్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటున్న ఆడి ఇ-ట్రోన్ ఈవీ; పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

ఇంకా ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లతో కూడిన

వర్చువల్ కాక్‌పిట్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి మరిన్నో ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మరికొన్ని యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయని సమాచారం.

More from DriveSpark

Article Published On: Monday, June 14, 2021, 9:28 [IST]
English summary
Audi e-Tron EV Reaches Showrooms, Offers 400 Km Range On A single Charge, Details. Read in Telugu.
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+